సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక వైఎస్‌ఎన్‌

1 Oct, 2016 22:57 IST|Sakshi
సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక వైఎస్‌ఎన్‌
  • ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌
  • ఘనంగా వైఎస్‌ఎన్‌ అశీతి ఉత్సవం
  • రాజమహేంద్రవరం కల్చరల్‌ : 
    తెలుగునాట సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక వైఎస్‌ నరసింహారావు అని, సాంస్కృతిక దీప్తి వసివాడకుండా అరచేతిని అడ్డుపెట్టి ఆయన కాపాడుతున్నారని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. వైఎస్‌ఎన్‌ అశీతి జన్మదినోత్సవ సారథ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి రాజమహేంద్రవరంలోని త్యాగరాజ నారాయణదాస సేవాసమితి ఆడిటోరియంలో వైఎస్‌ నరసింహారావు అశీతి ఉత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండలి మాట్లాడుతూ వైఎస్‌ఎన్‌ కారణంగానే రాజమహేంద్రవరంలోని పురమందిరం, కందుకూరి జన్మగృహం, రాళ్లబండి మ్యూజియం నేటిMీ Sపరిరక్షింపబడుతున్నాయన్నారు. అనంతరం వైఎస్‌ నరసింహారావు తనకన్నా పెద్దవారైన చిట్టూరి ప్రభాకరచౌదరి, ముళ్లపూడి సూర్యనారాయణ, పోతుకూచి సూర్యనారాయణమూర్తి, జోస్యుల సూర్యప్రకాశరావు, డాక్టర్‌ సీతరాం భార్గవి, పేరిటచర్ల సూర్యనారాయణరాజు, ద్రోణంరాజు సుందర రామారావులను సత్కరించారు. 
    పుస్తకాల ఆవిష్కరణ
    అశీతి పేరిట వెలువడిన ప్రత్యేక సంచికను మండలి బుద్ధప్రసాద్‌ ఆవిష్కరించారు. వైఎస్‌ఎన్‌ రచించిన నృసింహోపనిషత్తు మూడోముద్రణ, స్వాతంత్య్ర ఉద్యమంలో వీర వనితలు, అరిపిరాల నారాయణరావు రచించిన ఎదురీత పుస్తకాలను కూడా అతిథులు ఆవిష్కరించారు. ముందుగా నరసింహారావును ఇంటి నుంచి ఫ్రీడంపార్కు వరకు, అక్కడి నుంచి సభాస్థలికి మేళతాళాలతో, వేదస్వస్తితో తీసుకువచ్చారు. ఎంపీ మురళీమోహన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు, ఆదాయపన్ను అధికారి మేడిశెట్టి తిరుమలరావు, డాక్టర్‌ రాపాక ఏకాంబరాచార్యులు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, విశ్వనాథ గోపాలకృష్ణ, శలాక రఘునాథ శర్మ, కోసూరి చండీప్రియ, కె.శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ ప్రసంగించారు.అనంతరం వైఎస్‌ నరసింహారావును నిర్వాహకులు, నగర ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఫణి నాగేశ్వరరావు స్వాగత వచనాలు పలికారు. నిత్యవిద్యార్థి డాక్టర్‌ కర్రి రామారెడ్డి పవర్‌పాయింట్‌ ద్వారా వైఎస్‌ఎన్‌ జీవిత విశేషాలను వివరించారు.
     

whatsapp channel

మరిన్ని వార్తలు