వైఎస్సార్‌కు ఘన నివాళి

2 Sep, 2016 18:45 IST|Sakshi
వైఎస్సార్‌కు ఘన నివాళి
మంకమ్మతోట: మహానేత వైఎస్‌.రాజశేఖరరెడ్డి వర్ధంతిని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ అమర్‌హై అంటూ ఆయనను స్మరించుకుని నివాళులర్పించారు. నగరంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. వైఎస్సార్‌ చిత్రపటానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కుమార్, నాయకులు, కార్యకర్తలు పూలమాలవేసి అంజలి ఘటించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నగేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో రోగులకు పండ్లు, బిస్కెట్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగే పద్మ ఆధ్వర్యంలో బాలసదన్‌లో పిల్లలకు పండ్లు అందజేశారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో దుస్తులు పంపిణీ చేశారు. యూత్‌రాష్ట్ర కార్యదర్శి దుబ్బాక సంపత్‌ ఆధ్వర్యంలో రేకుర్తిలోని శ్రీశివసాయి వృద్ధుల హెల్త్‌కేర్‌ ఆశ్రమంలో అన్నదానం చేశారు. కార్యక్రమాల్లో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వరాల శ్రీనివాస్, పారుపల్లి వేణుగోపాల్‌రెడ్డి, గాలిప్రశాంత్‌బాబు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మోకెనపెల్లి రాజమ్మ, జిల్లా అధికార ప్రతినిధులు దేవరనేణి వేణుమాధవ్‌రావు, వినుకొండ రామకృష్ణారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిరవి,  బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గండి శ్యామ్, సాన రాజన్న, సిరి రవి,  దీటి సుధాకర్‌రావు, ఎస్‌కే.జావిద్, జిల్లా కార్యదర్శి ఎడ్ల సురేందర్‌రెడ్డి, రేషవేని వేణుయాదవ్‌ పాల్గొన్నారు.
  • వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కుమార్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ అంటేనే పేదల అభివృద్ధి అని సంక్షేమ పథకాలు గుర్తుచేస్తున్నాయన్నారు. అన్నివర్గాల ప్రజలు సమానంగా జీవించేలా సంక్షేమపథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. సాగు, తాగునీరు అందించేందుకు ఎల్లంపల్లి, వరదకాలువను తీసుకొవచ్చిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు.
  • రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నగేష్‌ మాట్లాడుతూ అభివృద్ధికి నిదర్శనంగా వైఎస్సార్‌ పాలన సాగిందని గుర్తుచేశారు. పేదలకు కావాల్సిన సకల సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతో సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో నిలిచారన్నారు. విద్యా, వైద్యం వంటి వాటికి అధిక ప్రాధాన్యత కల్పించారనిగుర్తుచేశారు. ఆర్థిక భారంతో పేద విద్యార్థులు చదువుకు దూరం కావద్దని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టి ఉన్నత విద్యను అందించారని పేర్కొన్నారు.
 
 
మరిన్ని వార్తలు