వైఎస్సార్‌ విగ్రహానికి అడ్డుగోడలు

14 Aug, 2016 21:24 IST|Sakshi
వైఎస్సార్‌ విగ్రహానికి అడ్డుగోడలు
వైఎస్సార్‌సీపీ, కొండవీటి సేవా సమితి నేతల నిరసన
 
తెనాలి : రణరంగచౌక్‌ సమీపంలోని దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు దారి లేకుండా చర్యలు తీసుకున్న తీరు హేయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, కొండవీటి సేవాసమితి నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. అమరవీరుల స్థూపాలకు పడమర వైపున ఏర్పాటుచేసిన వైఎస్‌ విగ్రహాన్ని దర్శించుకునేందుకు వీల్లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. విగ్రహం కనిపించకుండా వుండాలనే ఉద్దేశంతో రణరంగ చౌక్‌ శిలాఫలకాన్ని అడ్డుగా ఉంచారన్నారు. దీనిపై ఆదివారం సాయంత్రం మున్సిపాలిటీ సిబ్బంది ఎదుట నిరసన తెలియజేశారు. వైఎస్సార్‌ విగ్రహానికి దారి ఇవ్వాలనీ, లేనిపక్షంలో తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఎన్ని అడ్డుగోడలు పెట్టాలని చూసినా వైఎస్‌ను ప్రజల మనసుల్లోంచి తొలగించలేరని స్పష్టంచేశారు. సేవాసమితి కార్యదర్శి బొంతు చంద్రశేఖరరెడ్డి, ఉపాధ్యక్షుడు ఉడుముల బాలకోటిరెడ్డి, కోశా«ధికారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శులు మోరా శ్రీనివాసరెడ్డి, తవ్వా రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు షేక్‌ దుబాయ్‌బాబు, అక్కిదాసు కిరణ్‌కుమార్‌రెడ్డి, షేక్‌ ఖదీర్, షేక్‌ రఫీ, కౌన్సిలరు బచ్చనబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు