గుండె గుడిలో..

8 Jul, 2016 02:19 IST|Sakshi
గుండె గుడిలో..

నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా కథనాలు

 ఆరోగ్యశ్రీ.. 108..  పింఛన్లు.. ఇళ్లు.. ప్రాజెక్టులు.. రుణమాఫీ.. ఉచిత విద్యుత్.. ఒకటేమిటి నిరుపేదల అభ్యున్నతి, సంక్షేమం కాంక్షించి అనేక పథకాలను రూపొందించి.. అమలు చేశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. జనం గుండెల్లో గూడు కట్టుకుని చరిత్రలో నిలిచిపోయారు. 

ఆరోగ్యశ్రీ.. 108..  పింఛన్లు.. ఇళ్లు.. ప్రాజెక్టులు.. రుణమాఫీ.. ఉచిత విద్యుత్.. ఒకటేమిటి నిరుపేదల అభ్యున్నతి, సంక్షేమం కాంక్షించి అనేక పథకాలను రూపొందించి.. అమలు చేశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. బడుగుల గుండెల్లో గూడు కట్టుకుని నిలిచారు. ఆరోగ్యశ్రీ పథకంతో ఎంతోమంది  పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. గుండె జబ్బుతో బాధపడుతూ శస్త్రచికిత్సలు చేయించుకొని ప్రస్తుతం కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు. తమకు ప్రాణదానం చేసిన ఆ మహనీయుడిని గుండె గుడిలో నిలుపుకొన్నారు. నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా కథనాలు..

ఊపిరిపోసిన ఆరోగ్యశ్రీ
శామీర్‌పేట్: మండలంలోని లాల్‌గడిమలక్ పేట్‌కు చెందిన బండి నర్సింహ, కమలమ్మ దంపతులు. వీరికి  కూతురు ఉంది. నర్సింహ కూలిపని చేస్తూ తనకున్న కాస్త పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు పెళ్లికి చేసిన అప్పులు, వ్యవసా యంలో వచ్చిన నష్టాలతో 2011లో గుండెనొప్పి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు   బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుం దని, రూ.6లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఆపరేషన్ చేయించుకునే స్థోమత తనకు లేదని ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందని మందులు వాడుతూ ఉండిపో యాడు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంతో గుండె ఆపరేషన్ చేయించుకోవచ్చని పలువురు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే కార్పొ రేట్ ఆస్పత్రిలో చేరగా నర్సిం హకు బైపాస్‌సర్జరీ చేశారు. మూడు నెలల తర్వాత నుంచి నర్సింహ తనపని తాను చేసుకుం టున్నాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుం దని తెలిపారు. ఆరోగ్యశ్రీ పేదల పాలిట వరమని, వైఎస్ లేకుంటే ఈ పథకం వచ్చి ఉండేది కాదని, తాను బతికి ఉండే వాడిని కాదన్నారు. ఆయన చేసిన సేవలు ఎప్ప టికీ మరువలే నివన్నారు.

‘చిన్నిగుండె’కు కొండంత అండగా ..
ఇబ్రహీంపట్నం రూరల్ : మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన చెరుకూరి బాల్‌రాజ్ సుకన్య దంపతులు. వారికి మొదటి సంతానంగా 2002 అక్టోబర్ 15న మేఘన జన్మించింది. పాప పుట్టిందన్న ఆనందంలో ఉన్నవారికి పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. మేఘన గుండెకు మూడు రంధ్రాలు ఉన్నాయని, శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని  వైద్యులు చెప్పారు. ఇందుకోసం రూ.4లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. పాపకు తీవ్ర జ్వరం, జలుబు, ఆయాసం ఉండేవి. ప్రతి పదిహేను రోజులకోసారి ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. నిరుపేద కుంటుంబానికి చెందిన వారు కావడంతో ఆపరేషన్‌కు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. అంతలోనే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్ర చికిత్సకు అనుమతి ఇచ్చారు. 2008 జనవరిలో నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం మేఘన ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆరోగ్యపరంగా ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదని, రాజశేఖర్‌రెడ్డి తాతయ్య చేసిన మేలు జీవితంలో మర్చిపోనని, ఆయన మరణవార్త ఎంతో కలవరపరిచిందని చెబుతోంది.

ఆరోగ్యశ్రీతో గట్టెక్కిన గండం..
చేవెళ్లరూరల్: మండల పరిధిలోని చనువెళ్లి గ్రామానికి చెందిన  పట్లమ్మగారి వనమ్మ లక్ష్మారెడ్డి దంపతులు. వీరిది వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు  కొడుకులు. సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో నాలుగేళ్ల కిత్రం వనమ్మకు గుండెజబ్బు రూపంలో ఆపద వచ్చి పడింది.  ఆపరేషన్‌కు లక్షల రూపాయలు ఖర్చవు తాయని తెలిసి కుటుం బసభ్యులంతా ఆందోళనకు గురయ్యారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం అమల వుతోందని, ఈ విషయంలో దిగులు చెందాల్సిన పనిలేదని స్థానిక నాయకులు ధైర్యం చెప్పి నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆరోగ్యశ్రీ కింద ఆమెకు మంజూరైన రూ.2.40లక్షలతో ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్యుల సూచనలో మందులు వాడుతూ ఆరోగ్యంగా ఉంది. కొడుకులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లతో సంతోషంగా గడుపుతోంది. ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుకోగలిగామని  లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో  ఉహించుకుంటేనే భయ మేస్తోందని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఇదంతా వైఎస్ చలవేనని అభిమానంగా చెబుతున్నారు.

పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్..
పెద్దేముల్:  మండలపరిధిలో మంబాపూర్ గ్రామానికి చెందిన చాకలి పక్కీరప్ప, బాలమ్మ దంపతులు. వారికి ఏడుగురు సంతానం. రెక్కాడితేనే గానీ డొక్కాడని పరిస్థితి. మూడో కూతురు నర్సమ్మ(24)కు గుండె జబ్బు వచ్చింది. ఆపరేషన్‌కు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత మొత్తం వెచ్చించే స్థోమత తమకు లేదంటూ దేవుడిపై భారంవేసి వదిలేశారు తల్లిదండ్రులు. ఈ కుటుంబానికి ఆరోగ్యశ్రీ వరమైంది. ఈ పథకం కింద పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పడంతో సంతోషించారు. నర్సమ్మకు శస్త్రచికిత్స జరిగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది. ఆ ‘పెద్దాయన’ పుణ్యమా అని తన కూతురు పెద్ద గండం నుంచి గట్టెక్కిందని తల్లి బాలమ్మ అంటోంది. ఈ మేలును ఎన్నటికీ మరిచిపోలేమని చెబుతోంది.

నిరుపేద కుటుంబంలో వెలుగులు ..
జవహర్‌నగర్: వరంగల్ జిల్లా మద్దూర్ మండలం కేశిరెడ్డిపల్లికి చెందిన తుడుము ఆనంద్, జ్యోతి దంపతులు. వారికి కూతురు హెన్నాఓలీవా, కుమారుడు జాషువా ఉన్నారు. బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం జవహర్‌నగర్‌కు వలసవచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  2007లో రెండేళ్ల వయసులో హెన్నాఓలీవా అనారోగ్యానికి గురవగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారికి అన్ని పరీక్షలు చేసిన వైద్యులు గుండెకు రంధ్రం పడిందని ఆపరేషన్ చేస్తేనే బతుకుతుందని చెప్పారు. దీనికి దాదాపు రూ.3లక్షల వరకు  ఖర్చవుతుందని తెలిపారు.

ఒకవైపు పాపను ఎలాగైనా బతికించుకోవాలనే తాపత్రయం.. మరోవైపు కడుపేదరికం.. ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వైఎస్ ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీతో ఉచితంగా ఆపరేషన్ చేయించవచ్చని తెలుసుకున్న కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ఆపరేషన్ విజయవంతంగా చేశారు. ప్రస్తుతం హెన్నాఓ లీవా ఏడో తరగతి చదువుతోంది.   డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దీవెనలతోనే తమ పాప బతికి కళ్ల ముందు మెదులుతోందని, ఆ మహనీ యుడిని మరువలేమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆయ న పుట్టిన రోజునే తమ పాప పుట్టిన రోజు వేడుకలు జరుపుకుం టామని సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు