వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ‘కౌరు’ నామినేషన్‌

22 Mar, 2017 21:33 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ‘కౌరు’ నామినేషన్‌
 తణుకు : తణుకు మునిసిపల్‌ పరిధిలోని మూడో వార్డు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. వార్డు కౌన్సిలర్‌ గుబ్బల రామారావు కుటుంబ సభ్యులకు టికెట్టు ఇవ్వడం ద్వారా ఎన్నిక ఏకగ్రీవం చేయాలని తొలుత భావించినప్పటికీ ఆశావాహుల ఒత్తిడితో టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ ఏపీపీ, పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కౌరు వెంకటేశ్వర్లు బుధవారం తొలి నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి, మునిసిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావుకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు.
భారీ ర్యాలీగా..
మునిసిపల్‌ పరిధిలోని 3వ వార్డు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో నూతనోత్తేజం నెలకొంది. ప్రధాన ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రధాన పక్షాలైన టీడీపీ, వైఎస్సార్‌ సీపీ నుంచి ఆశావాహులు ఎక్కువగానే ఉండటంతో పోరు నువ్వా నేనా అన్నట్టుగానే ఉంది. గురువారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా బు«ధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. మూడోవార్డు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మునిసిపల్‌ కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బలగం సీతారాం, అత్తిలి ఏఎంసీ మాజీ చైర్మన్‌ మద్దాల నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ములగాల శ్రీనివాసు, గౌరవాధ్యక్షుడు ఎస్‌ఎస్‌ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు గుర్రాల సత్య ప్రియ, పట్టణ కన్వీనర్‌ కలిశెట్టి శ్రీనివాసు, పార్టీ రాష్ట్ర నాయకులు పెన్మత్స రామరాజు, మద్దిరాల రామ సతీష్, బూసి వినీత, నాయకులు పెన్మత్స సుబ్బరాజు, నరసింహమూర్తి రాజు, వీరవల్లి పాలేశ్వరరావు, పోలిశెట్టి వెంకన్నబాబు, అడ్డాల రమేష్, బెజ్జవరపు సాక్షి గోపాలరావు, చెల్లంకి వెంకటేశ్వరరావు, ఆర్‌వీవీ రమణ, పైబోయిన సత్యనారాయణ, చింతాడ సంజీవరావు, వి.సీతారాం, గంటా బాబి, బసవా గణేష్, కొమ్మోజు రామకృష్ణ, కేతా కృష్ణ, చదలవాడ యేసయ, మట్టా వెంకటేష్, రంబ నాగేశ్వరావు, గుర్రాల నాగేంద్ర, ఎలిపే సరోజిని పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా