కువైట్‌లో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం

13 Mar, 2016 21:43 IST|Sakshi

కడప కార్పొరేషన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కువైట్‌లోని మాలియా ప్రాంతంలో శనివారం ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ కువైట్ కన్వీనర్ ఎం. బాలిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేట్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడి వారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ఏకైక పార్టీ వైఎస్‌ఆర్‌సీపీయేనన్నారు. నైతిక విలువలకు కట్టుబడి ఉండే పార్టీలో ఉన్నందుకు తామంతా గర్విస్తున్నామని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీని అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఎత్తులు చిత్తుకాక తప్పదని, 2019లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని తెలిపారు.

కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండుకళ్లు, రెండు నాల్కల సిద్ధాంతంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అవకాశవాదులు, డబ్బుకు అమ్ముడుపోయేవారే పార్టీ మారుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ వీడినవారికి రాజకీయ విలువలుంటే తమ పదవులకు రాజీనామా చేసి, టీడీపీ గుర్తుతో గెలవాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహమాన్‌ఖాన్, ఎన్. మహేశ్వర్‌రెడ్డి, ఎం. చంద్రశేఖర్‌రెడ్డి, ఎ. ప్రభాకర్‌రెడ్డి, షేక్ ఇనాయత్, ఏవీ సుబ్బారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దుగ్గి గంగాధర్, గఫార్, నియాజ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు