బాబుది రోజుకో మాట..పూటకో అబద్ధం

16 Jul, 2016 17:59 IST|Sakshi

కోటంబేడు: సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో మాట, పూటకో అబద్ధం చెబుతూ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చకుండా రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్, జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు.

మండలంలోని కోటంబేడులో శుక్రవారం ఆయన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాననే హామీతో అధికారంలోకి వచ్చిన బాబు పూర్తిస్థాయిలో మాఫీ చేయకుండా మోసం చేశాడని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానన్న బాబు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన ఘనత దక్కించుకున్నాడన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింగంశెట్టి భాస్కర్‌రావు, జిల్లా రైతు ప్రధానకార్యదర్శి గూడూరు భాస్కర్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, మండల కో-ఆప్షన్ సభ్యుడు హఫీజ్, పార్టీ మండలాధ్యక్షుడు మురళీ మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు