అన్యాయం జరిగితే బాబు సంబరాలా?

3 Feb, 2017 02:13 IST|Sakshi
అన్యాయం జరిగితే బాబు సంబరాలా?

వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌:  కేంద్ర బడ్జెట్‌లో అంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. ఏపీకి ఏమిచ్చారని సంబరాలు చెసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి ఎక్కడా ప్రత్యేక ప్యాకేజీ అనే పదాన్ని వాడలేదని, స్పెషల్‌ అసిస్టెన్స్‌ మాత్రమే అన్నారని గుర్తుచేశారు. చంద్రబాబు తీరు మాత్రం ఆఖరి బంతికి పాకిస్తాన్‌ గెలిస్తే భారతీయుడు సంబరాలు జరుపుకున్నట్లుగా ఉందని మండిపడ్డారు. ‘ఓటుకు కోట్లు’ కేసు తర్వాత రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా న్యాయం జరిగినట్లుగానే చంద్రబాబు భావిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రత్యేక హోదా కోసం ముందుండి పోరాడాల్సిన చంద్రబాబు వెనక ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు. నారాకాసురుడిపై పోరాటం చేస్తే తప్ప ప్రత్యేక హోదా సాధించుకోలేమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు