ఇంటికో ఉద్యోగం ఎక్కడ?

2 May, 2016 09:01 IST|Sakshi

అనంతపురం: ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు..అమలులో విఫలమయ్యారని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ కార్యాలయంలో ఘనంగా మే డేను నిర్వహించారు.ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి  ఆదినారాయణరెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం, సీనియర్ నేత చవ్వా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడారు. 

రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు బాసటగా నిలవడంతో పాటు  కార్మికుల ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.  కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించిన  ఘనత దివంగత సీఎం వైఎస్‌కు దక్కిందన్నారు. ప్రస్తుత ప్ర భుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్మికులకు అండగా నిలిచారన్నారు. ఆర్టీసీ  కార్మికులు ఫిట్‌మెంట్ సాధించడంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కీలకపాత్ర పోషించిందన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ నాయకత్వంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, సంయుక్త కార్యదర్శులు నదీంఅహమ్మద్, మీసాల రంగన్న, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, నగర అధ్యక్షుడు బలరాం, ఆటో యూనియన్ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, విద్యుత్ ఉద్యోగుల సంఘం బషీర్, వైద్య, ఆరోగ్య ఉద్యోగుల సంఘం శ్రీధర్, లారీ అ సోసియేషన్ రంగనాయకులు, రైతు, బీసీ, ఎస్సీ, కిసాన్, క్రిష్టియన్ మైనార్టీ విభాగాల అధ్యక్షులు వెంకటచౌదరి, పామిడి వీరాంజనేయులు, పెన్నోబులేసు, మిద్దె భాస్కర్‌రె డ్డి, జయపాల్, పార్టీ  జిల్లా  అధికార ప్రతినిధులు ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, జిల్లా ప్రధానకార్యదర్శులు మైనుద్దీన్, వెంకటరామిరెడ్డి, నాయకులు కనేకల్ లింగారెడ్డి, గోపాల్‌మోహన్, రాజారెడ్డి, వాయల శీనా, జేఎం బాషా, యూపీ నాగిరెడ్డి, కసనూరు శీనా, అనిల్‌కుమార్‌గౌడ్, దేవి, సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు