రాజన్న స్ఫూర్తితో ముందడుగు

13 Mar, 2016 03:25 IST|Sakshi
రాజన్న స్ఫూర్తితో ముందడుగు

వాడవాడలా ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం
పేదలకు అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ

 సాక్షి ప్రతినిధి, తిరుపతి:  రాష్ట్రానికే పెద్దాయనగా పేరొందిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయ రంగం లో ముందడుగు వేద్దామని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు.  వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులుఅర్పించారు. అన్ని ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.  2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణ పాలనను మళ్లీ రాష్ట్ర ప్రజలకు అందించాలంటే జగనన్న ఒక్కడే దిక్కని పేర్కొన్నారు. అందుకోసం ఇప్పటినుంచే కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మమేకమవుతూ నిరంతరం సమస్యలపై పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

తిరుపతిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జగనన్న వ్యక్తిత్వం, ప్రజలపట్ల ఆయనకున్న ఆప్యాయత, పార్టీకి ఆభరణమని ఈ సందర్భంగా కరుణాకర రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాపరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్‌కె బాబు తదితరులు పాల్గొన్నారు.

చంద్రగిరి, శెట్టిపల్లె పంచాయతీల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీలో కార్యకర్తగా, ఎమ్మెల్యేగా ఉండటం తన అదృష్టమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన జగనన్నతోనే సాధ్యమని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మునీశ్వరరెడ్డి, హేమేంద్రకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్సీ సెల్  జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు ఆధ్వర్యంలో అవిలాలలోని ఆశ్రయ వేల్ఫేర్ అర్గనైజేషన్ ఆశ్రమంలో వృద్ధులు, అనాథలకు అన్నదానం చేశారు.

మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనాథాశ్రమంలో పేదలకు అన్నదానం చేశారు.

వాల్మీకిపురంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

చిత్తూరులోని సంతపేటలో బీసీ సెల్ నగర కన్వీనర్ జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ వేడుకలకు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

  హస్తి పట్టణంలో నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  పిల్లలకు పలకలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే వైఎస్ విగ్రహం వద్ద పేద మహిళలకు చీరలు, జాకెట్లు పంచిపెట్టారు.

పలమనేరులో పట్టణ కన్వీనర్ హేమంత్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారీ కేక్ కట్‌చేసి కార్యకర్తలు, నాయకులకు పంచిపెట్టారు.

సత్యవేడులో నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలం ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచిపెట్టారు. వరదయ్యపాళెంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నగరిలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మున్సిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతి, పార్టీ టీయూసీ రాష్ట్ర ప్రధాన ర్యదర్శి కెజె కుమార్ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు.

కుప్పంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసమూర్తి,  తంబళ్లపల్లి నియోజకవర్గంలోని బీ.కొత్తకోటలో మండల అధ్యక్షుడు జాఫర్ బాషా, జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డెప్ప రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

గంగాధర నెల్లూరు, తంబళ్లపల్లి, పూతలపట్టు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో పార్టీ  మండల అధ్యక్షులు జెండాను అవిష్క రించారు.

మరిన్ని వార్తలు