రేపటి బంద్‌కు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు

27 Nov, 2016 03:21 IST|Sakshi
నరసన్నపేట :  పెద్ద నోట్లు రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న బాధలను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న బంద్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు  ఇస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెండి శాంతి,  బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌లు ప్రకటించారు. నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలోని కొంతమంది వద్ద ఉన్న నల్లధనం వెలికితీతకు తాము పూర్తిగా మద్దతు ఇవ్వడంతోపాటు.. పెద్ద నోట్ల రద్దును కూడా స్వాగతిస్తున్నామన్నారు. అరుుతే కేంద్రం వెరుు్య, 500 రూపాయల నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆదరాబాదరగా తీసుకోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు చేపట్టనున్న బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
 ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ప్రజలు పడుతున్న బాధలను ఈ సందర్భంగా శాంతి, కృష్ణదాస్ వివరించారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలతో పాటు అనేక రంగాలకు చెందిన కార్మికులు, వ్యాపారులు, రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెద్దనోట్లు చెల్లక, ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన రెండు వేల నోట్‌కు చిల్లర దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతుండటాన్ని చూస్తున్నామన్నారు. పాత పెద్ద నోట్ల మార్పిడికి మరింత సమయం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్రం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు అంత సంతృప్తికరంగా లేవన్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్‌లో అన్నివర్గాల వారూ పాల్గొని  విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. 
 
 -ఏటీఎంల్లో నిరంతరం డబ్బులు ఉంచాలి
 పాతనోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వాలని, ఏటీఎంల్లో నిరంతరం డబ్బు ఉండే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని రెడ్డి శాంతి, కృష్ణదాస్ విజ్ఞప్తి చేశారు. ఏటీఎంలు తక్కువగా ఉండడం, వీటిల్లో నగదు సక్రమంగా ఉంచడంలేదన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి డబ్బును ఎక్కువగా ఉంచేలా చూడాలని, కొత్త రూ. 500 నోట్లును అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజలు దాచుకొనే డబ్బుపై కూడా ఆంక్షలు విధించి వారిని అవస్థలకు గురి చేయడం తగదన్నారు. ప్రజల జీవన సరళి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు చింతు రామారావు, ఆరంగి మురళి, సురంగి నర్శింగరావు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు