పోతులవన్నీ కోతలే!

3 Jun, 2016 09:21 IST|Sakshi

► ఎమ్మెల్యే పోతుల రామారావుపై వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆగ్రహం
► నమ్మించి మోసం చేశాడని మండిపాటు
► టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకించిన నేతలు
► కరేడులో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం
► కందుకూరు నియోజకవర్గంలో ఆందోళనలు
 
ఉలవపాడు:కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పోతుల రామారావుపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చే రడాన్ని తప్పుబట్టారు. గురువారం ఆయన సీఎం చంద్రబాబు సమక్షంలో విజయవాడలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 16 రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే కార్యకర్తలను ఇలా నట్టేట్లో ముంచాడని నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని కరేడులో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రామారావు టీడీపీలో చేరడంతో ఆయన కుటుంబానికి ఉన్న మంచి పేరు గంగలో కలసిపోయిందన్నారు.

నిత్యం తన కుటుంబం, వంశం గురించి కోతలు కోసే రామారావు.. ప్రజలకు ఇప్పుడేం సమాధానం చెబుతాడన్నారు. వైఎస్సార్, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలు పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కార్యకర్తలను నిలువునా మోసం చేశాడన్నారు. ఉలవపాడు ఎంపీపీ ఎన్నికల సమయంలో ఇద్దరు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు టీడీపీకి ఓటేశారని, అందువల్లే ఎంపీపీ పదవి వైఎస్సార్ సీపీకి దక్కకుండా పోరుుందన్నారు. అప్పుడు సదరు ఎంపీటీసీ సభ్యులను మందలించిన పోతుల.. ఇప్పుడు వారికేం సమాధానం చెబుతాడని నిలదీశారు. తనతో పాటు క్యాడర్‌ను టీడీపీలోకి తీసుకెళ్లాలని ప్రయత్నించి విఫలమయ్యూడని చెప్పారు.

అధికార పార్టీ నేతల ప్యాకేజీలకు వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు తలొగ్గలేదన్నారు. ఉలవపాడులో రమేష్ అనే కార్యకర్త మెడలో వైఎస్సార్ సీపీ కండువా వేసుకుని ప్రతీ దుకాణానికి వెళ్లి పోతుల నీతిమాలిన చర్యను వ్యాపారులకు వివరించారు. నిరసన కార్యక్రమంలో కరేడు ఎంపీటీసీ సభ్యురాలు సుందరమ్మ, గ్రామ  ఉప సర్పంచి భాస్కర్, పార్టీ గ్రామ కన్వీనర్ డి.వెంకారెడ్డి, వి.కృష్ణ, కె.రామకోటయ్య, శరభారెడ్డి, సుధాక ర్‌రెడ్డి, రామకోటిరెడ్డి, నాగరాజు, దగ్గుమాటి శేషారెడ్డి, ద్వారం.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు