‘పట్నం’ పల్లెటూర్!

15 Jul, 2016 02:20 IST|Sakshi
‘పట్నం’ పల్లెటూర్!

జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి క్షేత్రస్థారుు పర్యటనలు
పనుల్లో నాణ్యత పరిశీలించేందుకు నిర్ణయం

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇకపై జిల్లా పరిషత్ చైర్‌పర్సన్  సునీతామహేం దర్‌రెడ్డి పల్లెబాట పట్టనున్నారు. వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్న ఆమె ఇక పనుల నాణ్యతపై క్షేత్రస్థారుు పర్యటన చేయనున్నారు. జిల్లా పరిషత్ పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తరుున నేపథ్యంలో మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణరుుంచారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ నిధులతో చేపట్టిన పనులను తనిఖీచేసి నాణ్యతను పరిశీలించనున్నారు.

ఈ మేరకు క్వాలిటీ కంట్రోల్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఇప్పటికే వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతున్న ఆమె.. వీటిని మరింత ముమ్మరం చేయాలని నిర్ణరుుంచారు. యాలాల మండలం తిమ్మారుుపల్లిని దత్తత తీసుకున్న సునీత.. ఈ గ్రామంలో ఇటీవల ఒకేసారి ఐదు వేల మొక్కలు నాటి రికా ర్డు సృష్టించారు. బహిరంగ మల విసర్జన, మద్యపాన నిషేధం, పారిశుద్ధ్య నిర్వహణపై విసృ్తత ప్రచారం చేపట్టారు. దీనికితోడు తాండూరులో ప్లాస్టిక్ నిషే ధంపై కూడా ప్రత్యేక చొరవ చూపుతు న్నారు.  భూగర్భజలాల వృద్ధికి ఇంకుడుగుంతల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించనున్నట్లు సునీత ‘సాక్షి’కి వివరించారు. పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరు గుపరిచి.. ఉత్తీర్ణతాశాతం పెంపొందించే దిశగా కార్యక్రమాలు చేపడతామన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా