విహరిద్దాం!

28 Jun, 2016 23:44 IST|Sakshi
విహరిద్దాం!

త్వరలో జెడ్పీటీసీ సభ్యుల స్టడీ టూర్
ప్రభుత్వానికి లేఖ రాసిన చైర్‌పర్సన్ సునీత
మాకూ అవకాశం కల్పించండి : ఎంపీపీలు

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు (జెడ్పీటీసీలు) స్టడీ టూర్‌కు రెడీ అవుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు పయనమవుతున్నారు. పంచాయతీ పాలన అధ్యయనానికి కేరళను సందర్శించాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యుల అభ్యర్థనకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. సభ్యుల విజ్ఞానయాత్ర కు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు.

ప్రభుత్వ పథకాలు, ఆయా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల బలోపేతానికి  అవలంబిస్తున్న విధానాలను లోతుగా అధ్యయనం చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం సర్వసాధారణం. అయితే, ఈ పర్యటనలు కాస్తా విందు వినోదాలతో విహారయాత్రలుగా మారడంతో వీటి అనుమతులపై ప్రభుత్వం పరిమితులు విధించింది. స్టడీ టూర్‌ల పేరిట సాగే పర్యటనలపై ఆచితూచి వ్యవహరిస్తోంది. కాగా, ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ పాలకవర్గ సభ్యులు గగన విహారం చేయడంతో వారి బాటలోనే మన జిల్లా సభ్యులు నడిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అనుకున్నదే త డువుగా ప్రభుత్వ క్లియరెన్స్ కోసం లేఖ రాశారు. ఇదిలావుండగా, జెడ్పీటీసీల యాత్రలో తమకు చోటు కల్పించాలని సోమవారం మంత్రి మహేందర్‌రెడ్డిని కలిసి ఎంపీపీలు విన్నవించుకోవడం గమనార్హం.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

అక్కీ సో లక్కీ..

చిరుకు చిరుత విషెస్‌

‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’

చందమామతో బన్నీ చిందులు

‘త్వరలో.. కొత్త సినిమా ప్రకటన’