రాత్రి వేళ.. రయ్‌..

10 Jan, 2018 11:30 IST|Sakshi

మధురపూడి విమానాశ్రయంలో ఇండిగో సేవలు ప్రారంభం

రాత్రి వేళల్లోనూ ప్రయాణాలు ప్రారంభించిన డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప

అందుబాటులో టికెట్ల ధరలు

మధురపూడి (రాజానగరం): విమానయాన ప్రయాణాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎయిర్‌నెట్‌ వర్క్‌ను విస్తరించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం మధురపూడిలోని రాజమహేంద్రవరం వి మానాశ్రయంలో ఇండిగో విమానయానసంస్థ çసర్వీసులను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి  ప్రారంభించారు. ఇండిగో సంస్థ దేశీ విమానయాన రంగంలో స్థానాన్ని బలపరచుకుందన్నారు. మంగళవారం ఇండిగో రాజమహేంద్రవరం–చెన్నై ద్వారా ఏటీఆర్‌ ఆపరేషన్స్‌ను ప్రారంభించారు. మొత్తం నాలుగు సర్వీసులు ఉదయం నుంచి రాత్రివరకు నడుస్తాయన్నారు. ఉదయం 8.20 గంటలకు మొదటిసర్వీసు,  మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో సర్వీసు, మధ్యాహ్నం 2.35 గంటలకు మూడో సర్వీసు ఉంటాయన్నారు.

నైట్‌ ల్యాండింగ్స్‌ మొదలు
ఇండిగో విమాన సర్వీసులతో నైట్‌ ల్యాండింగ్స్‌ ప్రారంభమవుతాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎమ్‌.రాజ్‌కిషోర్‌ అన్నారు. రాత్రి 8.40గంటలకు చివరి సర్వీసు చేరుతుంది. దీంతో రాత్రి సర్వీసుల నిర్వహణకు ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇండిగోసంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ కస్టమర్‌ సర్వీసెస్‌ ఎం.సంజీవ్‌ రామదాస్‌ జెండా ఊపి విమాన సర్వీసులను ప్రారంభించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరంఎంపీ మాగంటి మురళీ మోహన్, ఎమ్మెల్యేలు ఆకుల రామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చైర్మన్‌ పంతం రజనీశేష సాయి, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, రాజమహేంద్రవరం సబ్‌ కలె క్టర్‌ సాయికాంత్‌ వర్మ, అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనంలో జ్యోతి ప్రజ్వలన, కేక్‌కటింగ్‌ జరిగింది.

రాజమహేంద్రవరాన్ని కేంద్రం అంగీకరించాలి
రాజమహేంద్రవరంగా రాష్ట్ర ప్రభుత్వం నామకరణ చేసింది. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా కేంద్రం అంగీకరించలేదని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహాన్‌ ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ‘‘కేంద్రం అంగీకారం అవసరం. దానికోసం ప్రయత్నిస్తాను. రైల్వేజోన్‌ సాధనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బడ్జెట్‌ సమావేశాలకు ముందే మా ప్రతిపాదనలు తీసుకోవాలి. కాని కేంద్రం (పార్లమెంటరీకమిటీ) ఎంపీలకు అవకాశం ఇవ్వలేదు’’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు