ఇబ్బందులు తాత్కాలికమే?!

6 Oct, 2017 13:56 IST|Sakshi

భవిష్యత్‌లో ఫలాలు అందుతాయి

జీడీపీ తగ్గుదల ప్రమాదమేమీ కాదు

భారత్‌ బలీయమైన ఆర్థిక వ్యవస్థ

మోదీ చర్యలు భేష్‌ అన్న వరల్డ్‌ బ్యాంక్‌

వాషింగ్టన్‌ : డిమానిటైజేషన్‌, జీఎస్టీ అమలుతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి వరల్డ్‌ బ్యాంక్‌ చల్లటి వార్త చెప్పింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ గమనం మందగించినా.. భవిష్యత్‌లో ఆ రెండింటి వల్ల మంచి ఫలితాలు వస్తాయని వరల్డ్‌ బ్యాంక్‌ శుక్రవారం వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థపై వరల్డ్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జిమ్ యాంగ్‌ కిమ్‌ మాట్లాడారు. ప్రస్తుతం జీఎస్టీ, డిమానిటైజేషన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినా భవిష్యత్‌లో ఎవరూ ఊహించని రీతిలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన చెప్పారు. వచ్చే వారంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సమావేశాలు వాషింగ్టన్‌లో జరగనున్న నేపథ్యంలో కొందరు పత్రికా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయనపై విధంగా సమాధానమిచ్చారు.

ప్రస్తుతం భారత్‌లో గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ అమలు చేయడం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులన్నీ తాత్కాలికమే.. కొన్ని కారణాల వల్ల వృద్ధిరేటు నెమ్మదించినా.. తరువాత కాలంలో భారత్‌ బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగేం‍దేకు అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమన మొదటి త్రైమాసికంలో భారత్‌ జీడీపీ తగ్గుదల (5.7)పైనా స్పందించారు. గత ఏడాది ఇదే సమయానికి జీడీపీ 7.9 ఉండగా.. గడచిన త్రైమాసికంలో జీడీపీ 6.1ని నమోదు చేసింది. వీటిని విశ్లేషించిన ఆయన.. ఆర్థికంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఇటువంటి సహజమేనని చెప్పారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు