ఘోర దుర్ఘటన

15 Jun, 2015 01:07 IST|Sakshi
ఘోర దుర్ఘటన

రోడ్డు ప్రమాదాలను నివారించి, సురక్షిత ప్రయాణానికి గ్యారెంటీ ఇచ్చేందుకు ఉద్దేశించిన రహదారుల భద్రతా బిల్లు చట్టం కావడానికి ఎన్నో స్పీడ్ బ్రేకర్లు అవరో ధమవుతుంటే...ప్రమాదాలు మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయి. తూర్పుగో దావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ వంతెనపై శుక్రవారం అర్థరాత్రి దాటాక చోటుచేసుకున్న ప్రమాదం అత్యంత విషాదకరమైనది. వాహనం వంతెనపైనుంచి 50 అడుగుల లోతులో పడిపోయి తీర్థయాత్రలకు వెళ్లొస్తున్న బంధువర్గం 22మంది ఈ దుర్ఘటనలో కన్నుమూశారు.

మొత్తం ఎనిమిది కుటుంబా లకు చెందినవారు ఇందులో చిక్కుకోగా ఏడు కుటుంబాలవారు మరణించారు. ఒక కుటుంబానికి చెందిన పదేళ్ల బాలుడు కిరణ్ మాత్రమే మృత్యువునుంచి తప్పించు కోగలిగాడు. వీరంతా వారం రోజులుగా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తున్నవారు. మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరాల్సినవారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగినప్పుడల్లా కొట్టొచ్చినట్టు కనబడే లోపాలే ఈ దుర్ఘటనలో కూడా వెల్లడవుతున్నాయి.

మన అధికార యంత్రాంగం తీరుతెన్నులను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇతర విషయాల సంగతలా ఉంచి కనీసం ఆ వంతెనపై పర్యవేక్షక సిబ్బంది ఉన్నా ప్రమాదం జరిగిన వెంటనే దాన్ని గురించి అధికారులను అప్రమ త్తం చేసేవారు. ఆ సమాచారం అందుకుని 108 సిబ్బంది, పోలీసులు అక్కడి చేరు కోవడానికి అవకాశం ఉండేది. సకాలంలో వైద్యసాయం అందించగలిగితే కొందరై నా ప్రాణాలతో బయటపడేవారేమో!

కానీ, ఆ వంతెనపై పర్యవేక్షణకు అవసరమై న 48 మందికి 12మంది సిబ్బంది మాత్రమే ఉన్నారంటున్నారు. వీరిలో కూడా నిక రంగా ఇద్దరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారని చెబుతున్నారు. కనుకనే బాధితు ల ఆర్తనాదాలు బయటి ప్రపంచానికి తెలియలేదు. తెల్లారాకగానీ ఈ విషాదం వెల్లడి కాలేదు. ప్రమాదాల నివారణ సంగతలా ఉంచి ఆ బ్యారేజీని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరంరీత్యా అయినా అక్కడ తగిన భద్రతా ఏర్పాట్లు కల్పిం చాలన్న స్పృహ అధికార యంత్రాంగానికి లోపించింది. ఉగ్రవాదులు లేదా అసాం ఘిక శక్తులు, ఆకతాయిలు ఎవరైనా దానికి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తే ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

పర్యవేక్షక సిబ్బంది మాట అలా ఉంచి కనీసం ఆ బ్యారేజీపై వెలగాల్సిన విద్యుత్తు దీపాల ఆచూకీ కూడా లేద ని చెబుతున్నారు. 200 దీపాలుండాల్సినచోట రెండంటే రెండే ఉన్నాయంటే నిర ్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది. కనీసం దీపాలు వెలుగుతూ ఉంటే... అవసరమైన స్పీడ్‌బ్రేకర్లు, వాటిని సూచించేలా రేడియం సిగ్నళ్లు ఉంటే వాహనాలు నడిపేవారికి అవగాహన ఏర్పడుతుంది.  వంతెనకు పటిష్టమైన రక్షణ గోడ ఉంటే ప్రమాద సమయంలో వాహనం దాన్ని తాకి వేగం అదుపులోనికి వచ్చేది. వంతెనల కు ఉండాల్సిన రక్షణ గోడలు ఏ స్థాయిలో ఉండాలో, వాటికి ఉండాల్సిన కొలతలే మిటో నిర్దిష్టమైన నిబంధనలున్నాయి. వీటన్నిటినీ గాలికొదిలి, నామమాత్రంగా రెయిలింగ్‌ను నిర్మించి వదిలేయడంవల్లే ఇంత ప్రాణనష్టం సంభవించింది.

ఈ ఉదంతంలో వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి బాగా అలసిపోవడంవల్లనే ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాహనచోదకులు మద్యం సేవించి ఉన్నారో, లేదో తెలుసుకోవడానికి అవసరమైన పరీక్షలున్నట్టే... వారి నిద్రలేమిని పసిగట్టే విధానం ఉండాలి. ప్రమాదాల్లో అధికభాగం రాత్రి సమ యాల్లో చోటుచేసుకుంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నందున ఇది అవసరం. అలాగే...మన దేశంలో ఇప్పటికే చాలాచోట్ల నాలుగు లేన్ల, ఆరు లేన్ల రహదారులను నిర్మించారు. అలాంటివాటి సంఖ్యను రాబోయే కాలంలో ఇంకా పెంచడానికి పథక రచన చేస్తున్నారు.

ఇప్పుడు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న సరుకుల, సేవల పన్నుల(జీఎస్‌టీ) బిల్లు ఆమోదం పొందితే రహదారులపై ఇప్పుడున్న చెక్ పోస్టులు కూడా ఉండవంటున్నారు. ఇలాంటి రహదారులపై వాహనాలు పెను వేగంతో పరుగులు పెడతాయని వేరే చెప్పనవసరం లేదు. రహదార్లపై పెట్రోలింగ్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండి వాహనచోదకుల స్థితిగతులెలా ఉన్నాయో నిఘా ఉంచితే తప్ప ప్రమాదాల నివారణ సాధ్యంకాదు. రాత్రివేళల్లో వాహనచోదకులు ప్రతి ఆరు గంటలకూ ఆగి నిర్దిష్ట సమయం విశ్రాంతి తీసుకోవాలన్న నిబంధనను యూరప్ దేశాల్లో పాటిస్తున్నారు. అందుకనుగుణంగా రహదారుల పక్క విశ్రాంతి గదులను కూడా నిర్మిస్తారు. మన దగ్గర కూడా ఇలాంటి నిబంధన అమలైతే వాహనచోదకుల ఏమరుపాటును నివారించడానికి ఆస్కారం కలుగుతుంది.

వాస్తవానికి మన దేశంలో రవాణా సౌకర్యాలు విస్తరిస్తున్నకొద్దీ ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాల కారణంగా నిరుడు రూ. 3,80,000 కోట్ల నష్టం సంభవించిందని అంచనా. ఇది మన జీడీపీలో 3 శాతం. పటిష్టమైన ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ మొత్తంతో 847 స్మార్ట్ సిటీల నిర్మాణం లేదా ఏడేళ్ల పాటు ఆహార భద్రతా చట్టం అమలు చేసి నిరుపేద కుటుంబాలకు తిండిగింజలు అందేలా చేయొచ్చని ఈమధ్య కొందరు నిపుణులు లెక్కలేశారు. 2012లో జరిగిన ప్రమాదాలతో పోలిస్తే 2013లో స్వల్పంగా తగ్గాయి. కానీ ప్రమాద తీవ్రత హెచ్చిం ది.

అంతక్రితం ఏడాది ప్రతి వంద ప్రమాదాలకూ 28.2 మరణాలు సంభవిస్తే... నిరుడు ఆ మరణాలు 28.3కు చేరుకున్నాయి. పరిస్థితులిలా ఉన్నా రహదారుల భద్రతా బిల్లు తీసుకురావడంలో పాలకులు తాత్సారం చేస్తున్నారు. ఏడాదికాలం నుంచి అది ముందుకు కదలడంలేదు. పైగా ఆ బిల్లులోని నిబంధనలను నీరు గారుస్తున్నారు. ధవళేశ్వరం ప్రమాదం జరిగినరోజే యూపీలో ఒక ప్రమాదం సంభవించి 17మంది మరణించారు. ఇప్పటికైనా ఈ తరహా ప్రమాదాల నివారణ కు చురుగ్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి.

మరిన్ని వార్తలు