బీసీలతో చెలగాటం తగదు!

19 Jul, 2013 01:23 IST|Sakshi
బీసీలతో చెలగాటం తగదు!

 డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కార్ ఎంతో ముందు చూపుతో ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత పూరిగుడిసెల్లో పుట్టినవారికి, కూలి పనిచేసుకునే  అతి బీదవారి పిల్లలకు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి విద్యాకోర్సులు చదువుకునే సావకాశం తొలిసారి కలిగింది. తద్వారా ఈ పేద కుటుంబాలు శాశ్వతంగా, సమగ్రంగా అభివృద్ధి చెందేందుకు నిర్దిష్ట ప్రాతిపదిక ఏర్పడింది. అంతేకాదు, జాతీయాభివృద్ధి కోణంలో కూడా చూడవలసిన అంశం ఇది. మానవ వనరులను తీర్చిదిద్ది మెరుగుపరిచి జాతీయ సంపదను సర్వతోముఖాభివృద్ధి చేసే పథకం ఇది. మట్టిలో మాణిక్యాలను వెలికి తవ్వితీసే మహోన్నత సందర్భం ఇది.
 
 రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఈబీసీ విద్యార్థుల ఫీజుల రీయింబర్స్ మెంట్ స్కీమ్‌తో చెలగాటం ఆడుతున్నది. ఈ ఏడాది దాదా పు 185 ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజుల రేట్లను రూ.35,000 నుం చి రూ1,17,000 దాకా పెంచు తూ జీవో నెం.57 విడుదల చేసింది. గత ఏడాదే అసాధార ణంగా ఫీజులు పెంచారు. నాలు గేళ్ల వరకు ఫీజులు పెంచబోమని ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతూ గత ఏడాది 89 కాలేజీలలో పెంచితే ఈ ఏడాది దాదాపు 185 కాలేజీల ఫీజులను పెంచారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సుకంటే కాలేజీ యాజమాన్యాల ‘శ్రేయస్సే’ ముఖ్య మని ఈ నిర్ణయం నిరూపించింది. దశల వారీగా ఫీజులు పెంచుకుంటూ, కాలేజీలు పెంచుకుంటూ ఫీజు రీయిం బర్స్‌మెంట్ బాధ్యతను తప్పించుకోవడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. కొత్తగా నిర్ణయించిన ఫీజుల రేట్లు మూడేళ్ల పాటు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటిం చింది. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకం. ఎందు కంటే తీర్పు ప్రకారం ఫీజులను క్రమంగా తగ్గించుకుంటూ రావాలి.
 
 బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు  చదువుకోకుండా చేసే కుట్ర ఇది. గత ఏడాది రాష్ర్ట ప్రభుత్వం ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిఫార్సుల మేరకు ట్యూషన్ ఫీజులను మూడు రెట్లు పెంచారు. ఈ పెంపుదల అసంబద్ధంగా, అన్యాయంగా ఉంది. ఉన్నతాధికారులకు,  ముఖ్యమంత్రికి లెక్కలు రావని ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజుల తీరుతెన్నులు చెప్పకనే చెబుతు న్నాయి. ఇంతవరకు రూ.35,000 ఫీజులతో నడిచిన కాలేజీలకు ఒకేసారి, ఒక ఏడాదిలోపే రూ.1,17,000కి పెంచడంలో ఔచిత్యమేమిటి?
 ఇప్పటికే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకా నికి అనేకమార్లు గండి కొట్టింది. మొత్తం ఫీజు ప్రభుత్వమే భరించాలనే ‘సాచ్యురేషన్’ విధానానికి స్వస్తి పలికింది. రూ.35,000 కంటే ఎక్కువ ఉన్న ఫీజులను విద్యార్థులే భరించాలని జీవోలలో మార్పులు చేసింది. దీని మూలంగా గత ఏడాది దాదాపు 89 కాలేజీలలో రూ.35,000 నుంచి రూ.1,05,000కి ఫీజులు పెంచారు. ఈ 89 కాలేజీలలో రూ.35,000 కంటే ఎక్కువ ఉన్న ఫీజులను విద్యార్థులే భరించారు. ఫీజులు కట్టే స్థోమత లేని వారు చదువు మానుకున్నారు.
 
 ఫీజుల స్కీమును గందరగోళంలో పడేసి విద్యా ర్థులకు ఈ స్కీముపై విశ్వాసం కోల్పోయేటట్లు చేస్తే గత్యం తరం లేక చదువు మానేస్తారని సర్కార్ వ్యూహరచన చేసిందని అంటే అది అతిశయోక్తి కాదు. ‘సాచ్యురేషన్’ పద్ధతిని ఎత్తివేయడమే కాక అనేక షరతులు విధించింది. ‘స్పాట్’ అడ్మిషన్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించ కుండా చేసి వేలాది మందిని చదువుకోకుండా చేసింది. డబుల్ పీజీ చదివేవారికి ఇవ్వరాదని నిర్ణయించి ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఉన్నత విద్యకు దూరం చేసింది. ప్రతి కోర్సుకు వయఃపరిమితి విధించి వేలాదిమందిని వృత్తి విద్యాకోర్సులకు అర్హత లేకుండా చేశారు.


 ఒక కోర్సులో చేరిన విద్యార్థి అంతకంటే మంచి కోర్సులో సీటు వచ్చి అందులో చేరితే వారికి ఫీజులు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వ కూడదనే నిబంధన మరీ దారుణం. పీహెచ్‌డీ, రీసెర్చి చేసేవారికి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు రద్దు చేయడం ఏమైనా సబబుగా ఉందా? ఒక కోర్సుకు ఇంకొక కోర్సుకు మధ్య రెండేళ్ల వ్యవధి ఉంటే స్కీముకు అనర్హులని తీర్మానించడంలో ఏమైనా విజ్ఞత ఉందా? పారా మెడికల్ కోర్సులలో 12 కోర్సులకు ఫీజులు, స్కాలర్‌షిప్‌లు రద్దు చేయడంలో ఏమైనా ఔచిత్యం ఉందా? ఇలా తప్పుడు విధాన నిర్ణయాలతో లక్షలాది మంది విద్యార్థులపై అనర్హతవేటు వేశారు. తమ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నారు.
 
 పేదల పిల్లలు ఇంజనీరింగ్, మెడిసన్ వంటి కోర్సు లు చదువుతుంటే దొరల ప్రభుత్వాలు ఓర్వలేక పోతు న్నాయి. ఫీజుల పెంపుదలపై ముఖ్యమంత్రిగాని, మంత్రి వర్గ ఉపసంఘంగాని బాధ్యతాయుతంగా స్పందించిన దాఖలాలులేవు. ఉద్దేశపూర్వకంగానే ఫీజులు పెంచి, ఇంత పెద్ద మొత్తంలో ఫీజులను కట్టే స్థితిలో ప్రభుత్వం లేదని చెప్పి మొత్తానికే స్కీమ్‌కు ఎసరు పెట్టాలని చూస్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ స్కీమ్‌ను ఎత్తివేయడానికి చేయని కుట్రలు లేవు.  వాస్తవానికి కాలేజీ నిర్వహణ వ్యయాన్ని నాలుగేళ్ల వ్యవధిలో విద్యార్థులపై వేయాలి. కానీ అలాకాకుండా మొత్తం వ్యయాన్ని మొదటి ఏడాదే వసూలు చేసేందుకు పథక రచన చేశారు. కాలేజీ నిర్వహణ వ్యయాన్ని మొదటి సంవత్సరంతో పాటు తదుపరి నాలుగేళ్లు కూడా వసూలు చేయాలని చూడటం అసం బద్ధం. ఫక్తు కుత్రంతం.
 
 ఒక్కొక్క కాలేజీకి ఒక్కో రకంగా ఫీజులను నిర్ణయిం చడం సరికాదు. ఒకే ఏడాది ప్రారంభమైన కాలేజీలకు ఒకే రేటు ఉండాలి. కానీ అలా జరగలేదు. ఉదాహరణకు సీబీఐటీ, వాసవి, మాతృశ్రీ తదితర 14 కాలేజీలు 1980లో ప్రారంభమయ్యాయి. ఈ 14 కాలేజీల నిర్వహణ వ్యయం ఒకేరీతిలో ఉంటుంది. జీతాలు కూడా ఒకే స్కేలు ప్రకారం ఇస్తారు. అలాంటప్పుడు వేర్వేరుగా ఫీజు ఎలా వసూలు చేస్తారు? కాలేజీలు ఎంత కోరితే అంత ఎలా నిర్ణయిస్తారు? ప్రైవేట్ కాలేజీలు చూపే నిర్వహణ ఖర్చు వాస్తవికమా? కాదా? పరిశీలించకుండా ఎలా నిర్ణయి స్తారు? ప్రభుత్వం అన్ని కాలేజీలకు ఒకే విద్యా ప్రమా ణాలు నిర్ణయించాలి కదా! విద్యార్థుల చదువు, విద్యా ప్రమాణాల సంగతి ప్రభుత్వానికి పట్టదా? ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్టించుకోదా?
 
 ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి రూ.60,000 ఫీజు ఉండగా, ఇంజనీరింగ్‌కు రూ.1,17,000 ఫీజు ఉండటమేమిటి? మెడికల్ కాలేజీ నిర్వహణకు అయ్యే వ్యయం కంటే ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహణకు అయ్యే వ్యయం ఎక్కువా? ప్రభుత్వం ఈ కోణంలో ఎందుకు చూడదు? ప్రతిష్టాత్మకమైన ఐఐటీ లాంటి సంస్థలలో ఫీజు ఏడాదికి రూ.50,000 మాత్రమే. సీబీఐటీ తదితర ప్రైవేట్ కాలేజీలలో ఫీజులు, ఐఐటీ ఫీజుల కంటే ఎక్కువ ఉండటం ఎలా సమర్థనీయం? కాలే జీ నిర్వహణ వ్యయంలో తేడాలు ఉండటం, ఫీజుల రేట్లు రకరకాలు ఉండటం ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శ నం. ప్రభుత్వం, ఫీజు రెగ్యులేటరీ కమిటీ పునఃసమీక్షించి, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలతో చర్చించి ఫీజుల రేట్లపై సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.


 డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కార్ ఎంతో ముందు చూపుతో ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత పూరిగుడిసెల్లో పుట్టినవారికి, కూలి పని చేసుకునే అతి బీదవారి పిల్లలకు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి విద్యాకోర్సులు చదు వుకునే సావకాశం తొలిసారి కలిగింది. తద్వారా ఈ పేద కుటుంబాలు శాశ్వతంగా, సమగ్రంగా అభివృద్ధి చెందేం దుకు నిర్దిష్ట ప్రాతిపదిక ఏర్పడింది. అంతేకాదు, జాతీయా భివృద్ధి కోణంలో కూడా చూడవలసిన అంశం ఇది. మానవ వనరులను తీర్చిదిద్ది మెరుగుపరిచి జాతీయ సంపదను సర్వతోముఖాభివృద్ధి చేసే పథకం ఇది. మట్టిలో మాణిక్యాలను వెలికి తవ్వితీసే మహోన్నత సంద ర్భం ఇది. జాతి ముఖచిత్రాన్ని మౌలికంగా మార్చివేయ గల ఈ మానవీయ, ప్రజాస్వామిక పథకాన్ని కాంగ్రెస్ నల్ల దొరల ప్రభుత్వం నీరుగార్చడానికి  ఎత్తుగడలు పన్నడం క్షమార్హం కాదు.    

ఆర్ కృష్ణయ్య అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం

మరిన్ని వార్తలు