గ్రహం అనుగ్రహం, మే 25, 2015

25 May, 2015 03:50 IST|Sakshi
గ్రహం అనుగ్రహం, మే 25, 2015

 శ్రీమన్మథనామ సంవత్సరం
 ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
 జ్యేష్ఠ మాసం, తిథి శు.సప్తమి ఉ.10.04 వరకు
 తదుపరి అష్టమి, నక్షత్రం మఖ తె.5.24 వరకు (తెల్లవారితే మంగళవారం)
 వర్జ్యం సా.4.18 నుంచి 6.02 వరకు
 దుర్ముహూర్తం ప.12.22 నుంచి 1.12 వరకు
 తదుపరి ప.3.01 నుంచి 3.50 వరకు
 అమృతఘడియలు రా.3.00 నుంచి 4.42 వరకు

మేషం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా చికాకులు. ఆలయ దర్శనాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
 
వృషభం: రాబడి తగ్గి రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
 
మిథునం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. రుణఒత్తిడులు తొలగుతాయి. ఆస్తిలాభం. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
కర్కాటకం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు,ఉద్యోగాలలో గందరగోళం.
 
సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
 
కన్య: దూరప్రయాణాలు. ఇంటాబయటాఒత్తిడులు. ధనవ్యయం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు.
 
తుల: దూరపు బంధువులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులుసేకరిస్తారు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
 
వృశ్చికం: బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీసేవలకు గుర్తింపు పొందుతారు. ఆస్తి లాభం. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
 
ధనుస్సు: కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమతప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు  విధుల్లో మార్పులు.
 
మకరం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు పనిభారం.
 
కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో ఆదరణ. భూ,గృహయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
 
మీనం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక లాభాలు. బంధువులతో వివాదాలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 - సింహంభట్ల సుబ్బారావు

సూర్యోదయం:5.29 సూర్యాస్తమయం: 6.24
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

మరిన్ని వార్తలు