నికిత డేర్!

9 Jan, 2015 00:30 IST|Sakshi
నికిత డేర్!

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి దుస్తులు వేసుకోవడానికైనా రెడీ అన్న నటీమణులను చూస్తూనే ఉంటాం. కానీ... మరాఠీ నటి నికిత గోఖలే మాత్రం అందుకు భిన్నం. అసలెవరూ అడగకపోయినా... ప్లే బాయ్ మ్యాగజైన్ ‘హగ్ హెఫ్‌నర్’ కోసం నగ్నంగా నటించడానికి కూడా వెనకాడనంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ దెబ్బకు ఫిల్మ్ సర్కిల్ షేకయింది. ఇంతలా డేర్‌గా అమ్మడు రెడీ అంటోందేంటని మరాఠీ ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారట. ప్రస్తుతం ఈ గుమ్మ చేసిన మరాఠీ ఫిల్మ్ ‘కాలేజీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రముఖ మోడల్ కూడా అయిన నికిత... ప్రస్తుతం విదేశీ టూర్లలో యమ బిజీగా గడిపేస్తోంది. మ్యాగజైన్ ఫొటో షూట్స్‌తో బాగా పాపులర్ అయిన ఈ సెక్సీ సుందరి... ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో తన అప్‌డేట్స్ పోస్ట్ చేసి కిక్కెస్తోంది.

మరిన్ని వార్తలు