పక్కింటి అమ్మాయి

29 Dec, 2014 09:06 IST|Sakshi
పక్కింటి అమ్మాయి

మా పక్కింటి అమ్మాయి పెళ్లయి ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఏమైందో వాడిన వసంతంలా చిన్న బోయి ఉంది. గాలిలో గాలిపటంలా ఎప్పుడూ ఎగురు తూ నవ్వుతూ ఉండే పిల్ల ఎగరకపోతే ఎగరకపోయే, రెక్కలు విరిగిన పక్షిలా గోడకలా జారగిలబడి కూర్చో డమేమిటి? అలుకూ పలుకూ లేకుండా ఆ మూగనో మేమిటి? అర్థం కావడంలేదు. ఇంతలో ఆ అమ్మాయి చిన్నగా ఏడుస్తూ 'నాన్నా! నేను భరించలేను. ఆర్నెల్లుగా నేనెంత క్షోభ అనుభవిస్తున్నానో మీకు తెలీదు. ప్రతి చిన్న విషయానికీ సంజాయిషీ ఇచ్చుకోవాలి. ప్రతి పైసాకీ లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కదానికీ యుద్ధం చేయాలి. అయింది చాలు. అనుభవించింది చాలు. నన్నొదిలెయ్యండి. నా చావేదో నేను చస్తాను..' అంటోంది.

 తండ్రి కూతురి చెయ్యిపట్టుకుని వంటింట్లోకి తీసుకు వెళ్లాడు. మేము మా వరండాలో కూర్చుంటే వాళ్ల కిచెన్ కన్పిస్తుంది. మంట పెద్దది చేశాడు... కంగారు పడ్డాను. ఆయన చాలా కూల్‌గా మూడు గిన్నెలు తీసు కుని వాటి నిండా నీళ్లుపోసి మూడు బర్నర్ల మీదా పెట్టాడు. నీళ్లు మరుగుతున్నాయి. ఒక గిన్నెలో పొటాటోలు, మరో గిన్నెలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీ గింజలు వేశాడు. పది నిమిషాల తర్వాత బర్నర్లు ఆపు చేసి మూడు గిన్నెలూ కిందకు దింపాడు. పొటాటోలు, కోడి గుడ్లు తీసి ఒక పళ్లెంలో పెట్టాడు. మూడో గిన్నెలోని కాఫీ ని కప్పులో పోశాడు. కూతుర్ని దగ్గరకు తీసుకుని 'ఈ మూడు ఏమిటో ఇప్పుడు చెప్పు?' అని అడిగాడు.

 కూతురు 'ఏముంది? పొటాటోస్, ఎగ్స్, కాఫీ' అంది. అంత తొందరెందుకు వాటిని చేతుల్లోకి తీసుకు ని చూడు' అన్నాడు తండ్రి. ఆ అమ్మాయి పొటాటోను చేతుల్లోకి తీసుకోబోతుండగానే అది మెత్తగా నుజ్జుయి కిందపడింది. తర్వాత కోడిగుడ్డును బ్రేక్ చెయ్యమన్నా డు. కూతురు గుడ్డును పగలకొట్టి పైనున్న పెంకంతా తీసేసింది. లోపల ఉడికిన గుడ్డు గట్టిగా ఉంది. తండ్రి వైపు చూసింది. 'ఇంకోటి మిగిలి ఉంది. దాని సంగతేమిటో కూడా చూడు' అన్నాడు.

 ఆ అమ్మాయి కాఫీ కప్పు దగ్గరకు తీసుకుంది. నురుగులు కక్కుతున్న కాఫీ మీద నుంచి వస్తున్న వెచ్చటి పరిమళం ఉల్లాసాన్ని చ్చింది. నాన్నను కాఫీ సగం తాగి మిగిలింది తనకు ఇమ్మంది. 'వద్దులే నువ్వేతాగు' అన్నాడు.  ‘ఏమిటి దీని అర్థం? ఫ్లీజ్ చెప్పు నాన్నా’ అని బతిమాలింది. 'పొటాటో లు, గుడ్లు, కాఫీ గింజలు - మూడు ఒకే సమయంలో ఒకే రకమైన యాడ్వర్సిటీని ఎదుర్కున్నాయి. మరిగే నీళ్లలో అవి ఒంటిని కాల్చుకు న్నాయి. కానీ, ఒక్కోటి ఒక్కోరకంగా మారిపోయాయి. అప్పటి వరకూ గట్టిగా ఉన్న దుంపలు ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక మెత్తగా తయారయ్యాయి.

గుడ్లయి తే చాలా డెలికేట్‌గా హాండిల్ చెయ్యడానికే కష్టంగా ఉండేవి. లోపలంతా ద్రవం. ఏ మాత్రం బ్రేక్ అయినా మొత్తం నేలపాలవుతుందని భయం. అలాంటివి మరిగే నీళ్లల్లో ఉడికి ఉడికీ గట్టిపడిపోయాయి. గుడ్ల లోపలి ద్రవమంతా ఘనీభవించింది. కానీ, కాఫీ గింజలో.. నీళ్లలో మరుగుతూనే నీటి రంగునీరుచినీ స్వరూపాన్నీ స్వభావాన్నీ మార్చేశాయి. పరిసరాల్ని పరిమళభరితం చేశాయి.  ఇప్పుడు నువ్వాలోచించుకో. పొటాటో లాగా మెత్తబడి నిస్పృహలోకి వెళ్తావో, గుడ్డులాగా థిక్ స్కిన్డ్ అయిపోయి మనసును రాయి చేసుకుంటావో? లేక,  నీ వ్యక్తిత్వంతో అందరిన్నీ గెలిచి కష్టాలను అధిగమించి మంచి కాఫీలాగా పరిమిళిస్తావో!

మా పక్కింటి అమ్మాయి నాన్న చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని చెంపలోకు చేర్చుకుంది. మనసుకు హాయిగా ఉంది!  స్వీట్ డాడీ! నాటీ చైల్ట్!- ప్రయాగ రామకృష్ణ?

మరిన్ని వార్తలు