దటీజ్ మోదీ

4 Oct, 2015 00:11 IST|Sakshi
దటీజ్ మోదీ

గిరీశం కోరితే జామ చెట్టెక్కి కూర్చున్న వెంకటేశాన్ని చూసిన అగ్నిహోత్రావధానులు ఇదేమిటని అడుగుతాడు. అక్కడ గిరీశం సమయస్ఫూర్తి అమోఘం. చెట్టూ పుట్టలూ ఎక్కలేకపోతే, నువ్వు డెస్కు ముందు కూచుని రాసుకో అని పంపేస్తారు, మునసబీ దక్కదూ అని చెబుతాడు. మోదీ ప్రభుత్వం యోగా తరువాత రూపొందించిన కార్యక్రమం చూస్తే జామ చెట్టు దృశ్యం గుర్తు రాక మానదు.

సాహసోపేత క్రీడలకు సిద్ధంకండి అని చెబుతోంది సర్కారు. ఎలాంటి క్రీడలు? కొండలెక్కడం, ట్రెక్కింగ్, పారా గ్లైడింగ్, రాఫ్టింగ్ వగైరా. ఇలాంటివి చేస్తే ఎప్పుడూ బద్ధకంగా కూర్చుని పనిచేయాలన్న ధోరణి నుంచి బయటపడతారట. చిక్కు సమస్యలను అలవోకగా పరిష్కరించే చురుకుదనం దండిగా సమకూరుతుందట.

 

అలాగే, ఆరోగ్యవంతులైన ఉద్యోగులే, ఆనందంగా ఉండే ఉద్యోగులు అనే నినాదంతో ప్రతి కేంద్ర కార్యాలయంలోను ఒక వ్యాయామశాల కూడా నెలకొల్పుతారట. మొత్తంగా చూస్తే యావన్మంది ఉద్యోగులు ఫిజికల్ ఫిట్‌నెస్‌తో చలాకీగా ఉండేటట్టు చేయడమే మోదీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని శాఖలకీ రెండు రోజుల క్రితం ఆదేశాలు కూడా వెళ్లాయి.

మరిన్ని వార్తలు