ఎస్‌బీఐలో 103 ‘స్పెషల్’ పోస్టులు

12 Dec, 2016 15:20 IST|Sakshi
ఎస్‌బీఐలో 103 ‘స్పెషల్’ పోస్టులు
 1. అక్విజిషన్ రిలేషన్‌షిప్ మేనేజర్-34 (జనరల్-16, ఓబీసీ-9, ఎస్సీ-6, ఎస్టీ-3)
 2. రిలేషన్‌షిప్ మేనేజర్-55 (జనరల్-20, ఓబీసీ-18, ఎస్సీ-11, ఎస్టీ-6)
 3. రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)-1 (జనరల్)
 4. జోనల్ హెడ్/సీనియర్ ఆర్‌ఎం-సేల్స్ (కార్పొరేట్ అండ్ ఎస్‌ఎంఈ)-1 (జనరల్)
 5. జోనల్ హెడ్/సీనియర్ ఆర్‌ఎం-సేల్స్(రిటైల్ హెచ్‌ఎన్‌ఐ)-2 (జనరల్)
 6. కాంప్లియెన్స్ ఆఫీసర్-1 (జనరల్)
 7. ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సెలర్-9 (జనరల్-5, ఎస్సీ-2, ఎస్టీ-2)
 విద్యార్హత-అనుభవం: మొదటి ఆరు రకాల పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సెలర్‌కు డిగ్రీతోపాటు ‘సెబీ’ నిర్దేశించిన కనీస అర్హతలు, సర్టిఫికెట్లు  ఉన్నవారికి ప్రాధాన్యత. సీఎఫ్‌పీ అర్హత ఉంటే అదనపు ప్రయోజనం. మొదటి మూడు రకాల పోస్టులకు సంబంధిత రంగంలో వరుసగా కనీసం రెండు, మూడు, నాలుగేళ్ల అనుభవం ఉండాలి. ‘జోనల్ హెడ్’ పోస్టులకు పదేళ్లు, కాంప్లియెన్స్ ఆఫీసర్‌కు ఐదేళ్లు, ఇన్వెస్‌మెంట్ కౌన్సెలర్‌కు మూడేళ్లు అనుభవం ఉండాలి.
 
 కనీస వయసు: అక్విజిషన్ రిలేషన్‌షిప్ మేనేజర్‌కు 22 ఏళ్లు; రిలేషన్‌షిప్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సెలర్‌కు 23 ఏళ్లు; రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్), కాంప్లియెన్స్ ఆఫీసర్‌కు 25 ఏళ్లు; జోనల్ హెడ్‌కు 30 ఏళ్లు నిండాలి. 
 
 గరిష్ట వయో పరిమితి: అక్విజిషన్ రిలేషన్‌షిప్ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సెలర్‌కు 35 ఏళ్లు; రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్), కాంప్లియెన్స్ ఆఫీసర్‌కు 40 ఏళ్లు; జోనల్ హెడ్‌కు 50 ఏళ్ల లోపు ఉండాలి.
 
 గమనిక: రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
 
 వేతనం: అభ్యర్థి అర్హతలు, అనుభవం ఆధారంగా చెల్లిస్తారు.  
 
 ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూకి పిలుస్తారు. 
 
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింటౌట్‌కు విద్యార్హత తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను జత చేసి కింది అడ్రస్‌కు పంపాలి.
 
 చిరునామా: ఎస్‌బీఐ, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్, థర్డ్ ఫ్లోర్, అట్లాంటా బిల్డింగ్, నారిమన్ పాయింట్, ముంబై, 400021. 
 
 దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.600; ఇతరులు రూ.100 చెల్లించాలి.
 
 ముఖ్య తేదీలు
 
 1.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 12
 2.అప్లికేషన్ హార్డ్ కాపీని పంపేందుకు చివరి తేదీ: డిసెంబర్ 16 
 వెబ్‌సైట్:  (or) www.sbi.co.in 
 
మరిన్ని వార్తలు