‘ఈపీఎఫ్‌ఓ’లో 257 కొలువులు..

6 Jun, 2016 23:56 IST|Sakshi
‘ఈపీఎఫ్‌ఓ’లో 257 కొలువులు..

జాబ్ పాయింట్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
 
పోస్టుల సంఖ్య: మొత్తం 257. వీటిలో 21 పోస్టులను వికలాంగులకు కేటాయించారు.
 
వేతన స్కేల్: రూ.9,300 నుంచి రూ.34,800 (గ్రేడ్ పే రూ. 4,600 అదనంగా చెల్లిస్తారు)
 
వయోపరిమితి: 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది.
 
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. లా, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్/కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తారు.
 
విధులు:  వర్క్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రికవరీ, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ క్యాష్, లీగల్ పెన్షన్,  విచారణలు, నష్టపరిహారాల మదింపు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. జమ్ముకశ్మీర్ తప్ప దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పని చేయాలి.
 
ప్రొబేషన్: రెండేళ్లు
 
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా..
 
రాత పరీక్ష ఇలా: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్ష ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు విధిస్తారు. జనరల్ ఇంగ్లిష్, భారత స్వాతంత్య్ర సంగ్రామం, సమకాలీన అంశాలు - అభివృద్ధి, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్, జనరల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
 
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 23
 
దరఖాస్తు ప్రింట్‌ను సబ్‌మిట్ చేయడానికి చివరి తేదీ: జూన్ 24
 
వెబ్‌సైట్స్: www.upsc.gov.in, http://www.upsconline.nic.in

>
మరిన్ని వార్తలు