ఇస్రోలో 272 పోస్టులు ఐటీఐ అభ్యర్థులకు 110

24 Aug, 2016 03:06 IST|Sakshi
ఇస్రోలో 272 పోస్టులు ఐటీఐ అభ్యర్థులకు 110

 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు రెండు ప్రకటనలను జారీ చేసింది. ఒక నోటిఫికేషన్‌ను అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్‌ఏసీ) విడుదల చేయగా మరో నోటిఫికేషన్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డీఎస్సీ) జారీ చేసింది.  ఈ ప్రకటనల ప్రకారం పీజీ, పీహెచ్‌డీ విద్యార్హతలు మొదలుకొని పదో తరగతి,  ఐటీఐ, డిప్లొమా తదితర కోర్సులు చేసిన అభ్యర్థులకూ వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం     మీద 110 ఉద్యోగాలు ఐటీఐ ఉత్తీర్ణులకు ఉండటం గమనార్హం. నోటిఫికేషన్లకు సంబంధించిన మరిన్ని వివరాలు..
 
 మొత్తం పోస్టులు
 272. ఇందులో 249 ఉద్యోగాలు ఎస్‌ఏసీ పరిధిలోవి. 23 ఖాళీలు ఎస్‌డీఎస్సీవి.
 
 పోస్టుల వారీ ఖాళీలు (ఎస్‌ఏసీ)
 సైంటిస్ట్/ఇంజనీర్-88; సోషల్ రీసెర్చ్ ఆఫీసర్-1; జూనియర్ ప్రొడ్యూసర్-1; సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్-1; ప్రోగ్రామ్ అసిస్టెంట్-2; టెక్నికల్ అసిస్టెంట్-33; సైంటిఫిక్ అసిస్టెంట్-11; లైబ్రరీ అసిస్టెంట్ ‘ఎ’-2; టెక్నీషియన్ ‘బి’-103 (ఐటీఐ ఫిట్టర్-6, మెషినిస్ట్-4, టర్నర్-1, ఎలక్ట్రానిక్స్-53, ఎలక్ట్రానిక్స్/ఐటీ-1, ఎలక్ట్రీషియన్-17, ప్లంబర్-7, కార్పెంటర్-5, ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్-5, వెల్డర్-1, ఐటీ/ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మెయింటనెన్స్-2, డిజిటల్ ఫొటోగ్రఫీ-1); డ్రాట్స్‌మ్యాన్ ‘బి’-7
 
 పోస్టుల వారీ ఖాళీలు (ఎస్‌డీఎస్సీ)
  సైంటిఫిక్ అసిస్టెంట్-2; టెక్నికల్ అసిస్టెంట్-21 (ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విత్ ఎల్‌వీడీ లెసైన్స్-1, కెమికల్ ఇంజనీరింగ్-3, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్-6, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-2, మెకానికల్ ఇంజనీరింగ్-7, ఫొటోగ్రఫీ-1, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-1).
 
 వేతనం
 సైంటిస్ట్/ఇంజనీర్, సోషల్ రీసెర్చ్ ఆఫీసర్, జూనియర్ ప్రొడ్యూసర్‌కు రూ.15,600-39,100+5400; సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్‌కు రూ.9,300-34,800+4800, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్‌కు రూ.9,300-34,800+4,600; టెక్నీషియన్ ‘బి’, డ్రాట్స్‌మ్యాన్ ‘బి’కి రూ.5,200-20,200+2000. ఎస్‌డీఎస్సీలోని అన్ని పోస్టులకు నెలకు సుమారు రూ.38,565 చెల్లిస్తారు.
 
 విద్యార్హత
 సైంటిస్ట్/ఇంజనీర్, సోషల్ రీసెర్చ్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సోషల్ రీసెర్చ్ ఆఫీసర్, జూనియర్ ప్రొడ్యూసర్‌కు పీహెచ్‌డీ. టెక్నికల్ అసిస్టెంట్‌కు సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా. సైంటిఫిక్ అసిస్టెంట్‌కు బీఎస్సీ. లైబ్రరీ అసిస్టెంట్‌కు డిగ్రీ+సంబంధిత సబ్జెక్టులో పీజీ. టెక్నీషియన్ ‘బి’, డ్రాట్స్‌మ్యాన్ ‘బి’కి పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ. ఎస్‌డీఎస్సీలోని సైంటిఫిక్ అసిస్టెంట్‌కు ఫస్ట్ క్లాస్ బీఎస్సీ; మిగిలిన అన్ని పోస్టులకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా.
 
 వయసు
 2016, ఆగస్టు 29 నాటికి కనీసం 18 ఏళ్లు; గరిష్టం 35 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.  
 
 ఎంపిక విధానం
 రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ రెండూ నిర్వహిస్తారు.
 
 దరఖాస్తు విధానం
 ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలి. ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆన్‌లైన్ దరఖాస్తులను విడివిడిగా సమర్పించాలి. వెబ్‌సైట్ లింక్ ఆగస్టు 29 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఆన్‌లైన్ అప్లికేషన్‌ను ప్రింట్ తీసి, భద్రపరచుకోవాలి. మార్క్‌షీట్లను స్కాన్ చేసి ట్ఛఛిటఠజ్టీఝ్ఛ్ట ఃట్చఛి.జీటటౌ.జౌఠి.జీకు ఆగస్టు 31 లోపు పంపాలి.   
 
 చివరి తేదీ
 ఎస్‌ఏసీలోని పోస్టులకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ 2016, ఆగస్టు 29; ఎస్‌డీఎస్సీ పోస్టులకు ఆగస్టు 25.    
 
 వెబ్‌సైట్
 ఎస్‌ఏసీ పోస్టులకు www.sac.gov.in (లేదా) http://recruitment.sac. gov.in/OSAR ఎస్‌డీఎస్సీ పోస్టులకు www.sdsc.shar.gov.in చూడొచ్చు.
 

మరిన్ని వార్తలు