జేఈఈ అడ్వాన్‌‌సడ్ - 2015

6 Nov, 2014 00:19 IST|Sakshi
జేఈఈ అడ్వాన్‌‌సడ్ - 2015

జేఈఈ అడ్వాన్స్‌డ్.. లక్షా యాభై వేల మంది ప్రతిభావంతులు మాత్రమే హాజరయ్యే పరీక్ష. ఇందుకోసం విద్యార్థులు జేఈఈ-మెయిన్‌లోని పేపర్-1 పరీక్ష రాయాలి. జేఈఈ-మెయిన్ ద్వారా 1,50,000 మంది విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. వీరిలో 20,000 మంది విద్యార్థులకు ర్యాంక్ కేటాయిస్తారు. అడ్వాన్స్‌డ్ ర్యాంక్‌తోపాటు ఇంటర్‌లో టాప్ 20 పర్సంటైల్ లేదా 75 శాతం మార్కులు ఉంటేనే ఐఐటీలు, ఐఎస్‌ఎంలో ప్రవేశం లభిస్తుంది.
 
 ఆబ్జెక్టివ్‌గా రెండు పేపర్లు

 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు.. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. ప్రతి పేపర్‌కు 180 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు 360. వీటిలో నాలుగు రకాల ప్రశ్నలిస్తారు. ప్రతి పేపర్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి పేపర్‌కు సమయం మూడు గంటలు. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కులిస్తారు. అంతేకాకుండా హాజరు విషయంలో కూడా పరిమితి విధించారు. ఈ క్రమంలో జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు వరుసగా రెండు సార్లు (సంవత్సరాలు) మాత్రమే రాసే అవకాశం ఉంది.
 
 మ్యాథమెటిక్స్
 
ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు: లిమిట్స్ అండ్ కంటిన్యుటీ, డిఫరెన్షిబిలిటీ,  3డీ లైన్స్-ప్లేన్స్ (అనుబంధ ప్రశ్నలు), క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌‌స, మ్యాట్రిక్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, ఏరియా బౌండెడ్ బై కర్వ్‌స్, మాక్సిమ-మినిమ, జామెట్రికల్ అప్లికేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, అప్లికేషన్స్ ఆఫ్ వెక్టర్ అల్జీబ్రా, డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్.పిపరేషన్ కోసం 4-5 పుస్తకాలను రిఫర్ చేయడం కంటే ఏదో ఒక ప్రామాణిక పుస్తకాన్ని సంపూర్ణంగా చదవడమే ఉత్తమం.
 
 బీఆర్క్ కోసం ఏఏటీ

 
బీఆర్క్ (ఆర్కిటెక్చర్)లో చేరాలనుకునే విద్యార్థులు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కు హాజరు కావాలి. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ సాధించిన విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ఇందుకోసం 2015, జూన్ 18-19 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరీక్షను 2015, జూన్ 21న నిర్వహిస్తారు.
 
 ఫిజిక్స్

 
ఫిజిక్స్‌లో కొన్ని అంశాలు ఉమ్మడిగా ఉంటాయి. వాటిని ఒకే సారి చదవడం ప్రయోజనకరం. ఉదాహరణకు గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నో స్టాటిస్టిక్స్; కరెంట్  ఎలక్ట్రిసిటీ, హీట్ ట్రాన్స్‌ఫర్, ఫ్లూయిడ్ డైనమిక్స్; సౌండ్ వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, సింపుల్ హార్మోనిక్ మోషన్; లీనియర్ డైనమిక్స్, రొటేషనల్  డైనమిక్స్; థర్మోడైనమిక్స్, కెమిస్ట్రీలోని థర్మోడైనమిక్స్ భాగం. థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్. ఆప్టిక్స్‌లో.. ముందుగా వేవ్ టాపిక్స్‌ను పూర్తి చేయడం మంచిది. తర్వాత జామెట్రికల్ ఆప్టిక్స్‌ను ప్రిపేర్ కావాలి. వేవ్స్‌లో ట్రాన్స్‌వర్స్ వేవ్స్, సౌండ్ వేవ్స్‌కు వెయిటేజీ సమంగా ఉంటుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్, ఫిజికల్ ఆప్టిక్స్, ఆసిలేషన్స్, ఏసీ సర్క్యూట్స్‌లలోని మ్యాథమెటికల్ పార్ట్ ప్రిపేర్ కావడం ఉపయుక్తం. గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నటిజంలలో కూడా టాపిక్స్ కామన్. ప్రిన్సిపల్స్, అప్లికేషన్స్‌లో కొద్దిపాటి తేడా ఉంటుంది. కూలుంబ్స్ లా.. న్యూటన్స్ గ్రావిటేషన్ లాగా మారుతుంది. గాస్ లాను గ్రావిటేషన్ ఫీల్డ్ ఎవల్యూషన్‌లోనూ ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, మాగ్నటిజం అంశాలను ఒక్కటిగా చదువుకోవచ్చు.
 
 కెమిస్ట్రీ
 
 గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి అధిక ప్రాధాన్యతనిచ్చారు. కాబట్టి మెటలర్జీ, కాంప్లెక్స్ కంపౌండ్స్, అనలిటికల్ కెమిస్ట్రీ, పి-బ్లాక్ ఎలిమెంట్స్, డి-బ్లాక్  ఎలిమెంట్స్‌పై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అడిగే ప్రశ్నలు ఆయా అంశాల్లోని ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ఉంటాయి. ఉదాహరణకు ఎలక్ట్రాన్ డిస్‌ప్లేస్‌మెంట్స్, రియాక్షన్ మెకానిజం, రీజెంట్స్, స్టెబిలిటీ ఆఫ్ ఇంటర్మీడియెట్స్. ఈ అంశానికి సంబంధించి ఇచ్చిన సిలబస్ వరకే పరిమితం కావడం మంచిది. ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్, ఈక్విలెంట్ కాన్సెప్ట్స్, సాల్యుబులిటీ ప్రొడక్ట్, కామన్ ఆయాన్ ఎఫెక్ట్, ఎలక్ట్‌డ్ ్రపొటెన్షియల్ వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే ప్రాథమిక భావనలపై పట్టు, ఇచ్చిన సమస్య ప్రకారం సూత్రాన్ని అన్వయించుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.
 
 షెడ్యూల్
 
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 2, 2015.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: మే 7, 2015.
 అడ్మిట్ కార్డు డౌన్‌లోడింగ్: మే 9-12, 2015.
 పరీక్ష తేదీ: మే 24, 2015.
 వెబ్‌సైట్: http://jeeadv.iitd.ac.in
 

మరిన్ని వార్తలు