ఉమ్మడి పరీక్షలకు సెట్ అవుదాం!

9 Jan, 2014 14:28 IST|Sakshi

రాష్ట్రంలో ఇంజనీరింగ్, లా వంటి ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి బ్యాచిలర్, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్)ల నిర్వహణ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.. ఈ క్రమంలో వచ్చే నెల నుంచి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.. మే నెల నుంచి సంబంధిత పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయా సెట్ల పరీక్షలకు ఏవిధంగా సన్నద్ధం కావాలి.. అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రభావవంతంగా ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై విశ్లేషణ..




పీఈసెట్
పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్)గా కెరీర్ ప్రారంభించేందుకు అవకాశం కల్పించే పరీక్ష పీఈసెట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్   కామన్ ఎంట్రన్స్ టెస్ట్).
నిర్వహణ: నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు
నోటిఫికేషన్ తేదీ: మార్చి 7, 2014
ఫిజికల్ ఈవెంట్స్: మే 5, 2014

ఈ పరీక్ష ద్వారా ప్రవేశం పొందే కోర్సులు:
యూజీడీపీఈడీ (అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్):
అర్హత: ఇంటర్మీడియెట్/తత్సమానం. వయసు 16 ఏళ్లు నిండి ఉండాలి.
బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్):
అర్హత: డిగ్రీ . వయసు 19 ఏళ్లు నిండి ఉండాలి.
పరీక్ష విధానం: యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు. ఫిజికల్ ఈవెంట్స్, మెరిట్ సర్టిఫికెట్స్, తదితర అంశాల ఆధారంగా రూపొందించిన తుది జాబితా ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఫిజికల్ ఈవెంట్స్‌లో 100 మీటర్ల పరుగు, 800 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగు, లాంగ్/హై జంప్, షాట్‌పుట్ అంశాలు ఉంటాయి. వీటితోపాటు ఆసక్తి ఉన్న క్రీడాంశంలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని కూడా పరీక్షిస్తారు.


పీజీఈసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)
జాతీయ స్థాయిలో గేట్ మాదిరిగా రాష్ట్ర స్థాయి కళాశాలల్లో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష పీజీఈసెట్. ఈ పరీక్ష ద్వారా ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఎంప్లానింగ్, ఫార్మ్‌డీ (పోస్ట్ బాక్యులరేట్) కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
నిర్వహణ: ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
నోటిఫికేషన్ తేదీ: ఫిబ్రవరి 28, 2014
పరీక్ష తేదీ: మే 26-29, 2014
అర్హత: బీటెక్/ బీఈ/ ఏఎంఐఈ/ బీఫార్మసీ/ బీఆర్క్/ బీప్లానింగ్. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలకు 120 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. వీటికి కేటాయించిన మార్కులు 120. థియరీ, 40 శాతం ప్రాబ్లమ్స్ (ఫార్ములా బేస్డ్)
పిపరేషన్: పీజీఈసెట్, గేట్ సిలబస్ మధ్య ఎటువంటి తేడా ఉండదు. కేవలం ప్రశ్నల క్లిష్టతలోనే స్వల్ప తేడా ఉంటుంది. ఇందులో అధిక శాతం థియరీ బేస్డ్ ప్రశ్నలు.. 40 ఫార్ములా బేస్డ్ ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి గేట్ మాదిరిగానే ప్రిపరేషన్ సాగించాలి. అప్పటికే గేట్ పరీక్ష రాసి ఉంటారు కాబట్టి ప్రాథమిక భావనలను ఒక్కసారి పునశ్చరణ చేసుకోవాలి. అంశాల వారీగా ముఖ్యమైన నిర్వచనాలు, ఫార్ములాలపై పట్టు సాధించాలి.


ఐసెట్
రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్).
నిర్వహణ: కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
నోటిఫికేషన్ తేదీ: ఫిబ్రవరి 14, 2014
పరీక్ష తేదీ: మే 23, 2014
పరీక్ష విధానం: పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 180 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. సెక్షన్-ఎ (అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు, 75 మార్కులు). ఇందులో డేటా సఫిషియెన్సీ నుంచి 20 ప్రశ్నలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 55 ప్రశ్నలు వస్తాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్ (25 ప్రశ్నలు), డేటా అనాలిసిస్ (10 ప్రశ్నలు), కోడింగ్ -డికోడింగ్ (10 ప్రశ్నలు), డేట్, టైమ్ ఆరేంజ్‌మెంట్ (10 ప్రశ్నలు) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్-బి మ్యాథమెటికల్ ఎబిలిటీ (75 ప్రశ్నలు, 75 మార్కులు). ఇందులో అర్థమెటిక్ (35 ప్రశ్నలు), అల్జీబ్రాకల్ అండ్ జ్యామెట్రికల్ ఎబిలిటీ (30 ప్రశ్నలు), స్టాటిస్టికల్ ఎబిలిటీ (10 ప్రశ్నలు)పై ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-
కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ (50 ప్రశ్నలు, 50 మార్కులు).  విభాగాల వారీగా ప్రశ్నల విభజనను పరిశీలిస్తే.. వొకాబ్యులరీ (10 ప్రశ్నలు), బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ (10 ప్రశ్నలు), ఫంక్షనల్ గ్రామర్ (15 ప్రశ్నలు), రీడింగ్ కాంప్రెహెన్షన్ (15 ప్రశ్నలు).


ఎంసెట్
నిర్వహణ: జేఎన్‌టీయూ- హైదరాబాద్
నోటిఫికేషన్ తేదీ: ఫిబ్రవరి 10.
పరీక్ష తేదీ: మే 17, 2014
పవేశం కల్పించే కోర్సులు: ఇంజనీరింగ్, మెడికల్ అనుబంధ కోర్సులు.
అర్హత: ఇంటర్మీడియెట్ (బైపీసీ, ఎంపీసీ)
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 160 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో 160 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 180 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. బైపీసీ విద్యార్థులకు జువాలజీ, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 చొప్పున ప్రశ్నలు వస్తాయి.

పిపరేషన్: ఇంటర్ పరీక్షలు ముగిసిన 45 రోజుల తర్వాత ఎంసెట్ పరీక్ష జరుగుతుంది. ఎంపీసీ విద్యార్థులు ఇందులో మొదటి 15 రోజులు చాప్టర్‌వైజ్ ప్రిపరేషన్, తర్వాత ఎక్కువగా గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. ఇంటర్ పరీక్షలకు ముందు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లను విస్తృత స్థాయిలో ప్రిపేర్ కావాలి. ప్రస్తుత సమయంలో ఇంటర్ పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంటర్ పరీక్షలు పూర్తయిన వెంటనే మొదటి సంవత్సరం సిలబస్‌ను ఆబ్జెక్టివ్‌గా ప్రిపేరవ్వాలి. ఎంసెట్‌లో 135 మార్కులకుపైగా సాధించిన విద్యార్థులకు వందలోపు ర్యాంకు వచ్చే అవకాశం ఉంది.


బైపీసీ: మెడికల్ స్ట్రీమ్ విద్యార్థులు బోటనీలో ప్రతి అంశాన్ని చదవాలి. ప్రతిరోజూ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. జువాలజీలో అధిక శాతం  ప్రశ్నలు..రెండేళ్ల సిలబస్‌లోని ఆరు నుంచి ఎనిమిది చాప్టర్ల మధ్యనే ఉంటున్నాయి. ఫిజిక్స్ కోసం మ్యాథమెటికల్ ఓరియెంటేషన్‌ను పెంచుకోవాలి.  సినాప్సిస్ రూపొందించుకుంటూ అకాడమీ పుస్తకాల్లోని అంశాలను క్షుణ్నంగా చదవాలి. ఒకేవిధంగా ఉన్న పాయింట్స్, ఉదాహరణలను టేబుల్ లేదా చార్ట్ రూపంలో పొందుపర్చుకుని రివిజన్ చేయడం ద్వారా మెరుగైన మార్కులను సాధించవచ్చు. టాప్-100లో నిలవాలంటే 135 నుంచి 140 మార్కులు సాధించాలి.


ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ డిప్లొమా అభ్యర్థులకు, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అభ్యర్థులకు లేటరల్ ఎంట్రీ విధానంలో ఇంజనీరింగ్, ఫార్మసీకి సంబంధించి బ్యాచిలర్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కల్పించేందుకు ఉద్దేశించిన పరీక్ష ఈసెట్.
నిర్వహణ: జేఎన్‌టీయూ-కాకినాడ
నోటిఫికేషన్ తేదీ: ఫిబ్రవరి 4, 2014
పరీక్ష తేదీ: మే 10, 2014
అర్హత: 45 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా 45 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. అర్హతను బట్టి ప్రశ్నపత్రం వేర్వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో డిప్లొమా విద్యార్థులకు: నాలుగు విభాగాల్లో పరీక్ష ఉంటుంది. అవి..  మ్యాథమెటిక్స్ (50 మార్కులు), ఫిజిక్స్(25 మార్కులు), కెమిస్ట్రీ (25 మార్కులు), పాలిటెక్నిక్‌లో సంబంధిత బ్రాంచ్ (100 మార్కులు).
బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు: మూడు విభాగాలు ఉంటాయి. అవి..  మ్యాథమెటిక్స్
(100 మార్కులు), అనలిటికల్ ఎబిలిటీ (50 మార్కులు), కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ (50 మార్కులు).
ఫార్మసీ కోర్సులకు: నాలుగు విభాగాలు ఉంటాయి. అవి..  ఫార్మాస్యూటిక్స్ (50 మార్కులు), ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ (50 మార్కులు), ఫార్మకాగ్నసీ (50 మార్కులు), ఫార్మకాలజీ(50 మార్కులు).
పశ్నల క్లిష్టత: సంబంధిత సబ్జెక్ట్‌లలో ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి 10+2. బ్రాంచ్ సబ్జెక్ట్ మాత్రం డిప్లొమా స్థాయిలో ఉంటుంది. ఇందుకోసం మార్కెట్లో లభించే ప్రామాణిక మెటీరియల్‌ను ఆబ్జెక్టివ్‌గా ప్రిపేర్ కావడం మంచిది.


లాసెట్
లాసెట్ (లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్). ఈ పరీక్ష ద్వారా మూడేళ్ల బీఎల్/ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ/బీఎల్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
నిర్వహణ: ఎస్వీ యూనివర్సిటీ-తిరుపతి
నోటిఫికేషన్ తేదీ: మార్చి 6, 2014
పరీక్ష తేదీ: జూన్ 8, 2014
అర్హత: మూడేళ్ల లా కోర్సుకు 10+2+3 విధానంలో 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్ (10+2 విధానంలో).
పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. ఎంచుకున్న కోర్సు ఆధారంగా ప్రశ్నల క్లిష్టత వేర్వేరుగా ఉంటుంది. ఐదేళ్ల లా ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో, మూడేళ్ల లా ప్రశ్నపత్రం డిగ్రీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రశ్నపత్రంలో 120 ప్రశ్నలు మూడు విభాగాల్లో ఉంటాయి. అవి.. పార్ట్-ఎ జనరల్ నాలెడ్జ్-మెంటల్ ఎబిలిటీ (30 ప్రశ్నలు, 30 మార్కులు), పార్ట్-బి కరెంట్ అఫైర్స్ (30 ప్రశ్నలు, 30 మార్కులు), పార్ట్-సి లా ఆప్టిట్యూడ్ (60 ప్రశ్నలు, 60 మార్కులు). వీటికి 90 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. పార్ట్-ఎలో కోడింగ్, క్యాలెండర్, స్టాండర్డ్ జీకే నుంచి ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్‌లో సమకాలీన అంశాలతోపాటు న్యాయ  సంబంధిత అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.


పీజీలాసెట్
పీజీలాసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష ద్వారా ఎల్‌ఎల్‌ఎం/ఎంఎల్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ ఉత్తీర్ణులు.
పరీక్ష విధానం: మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. వ్యవధి: 90 నిమిషాలు. ప్రశ్నపత్రంలో రెండు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్-ఎలో భాగంగా జూరిస్ ప్రుడెన్స్‌పై 20, కాన్‌స్టిట్యూషనల్ లాపై 20 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-బిలో మర్కెంటైల్ లా, లేబర్ లా ఇలా ఒక్కో అంశంపై 16 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలుంటాయి.


ఎడ్‌సెట్ (ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)
ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించేందుకు దోహదం చేసే బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశానికి ఎడ్‌సెట్ నిర్వహిస్తారు.
నిర్వహణ: ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
నోటిఫికేషన్ తేదీ: మార్చి 5, 2014
పరీక్ష తేదీ: జూన్ 2, 2014
అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఈ క్రమంలో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు-25 మార్కులు), పార్ట్-బి జనరల్ నాలెడ్జ్ (15 మార్కులు-15 ప్రశ్నలు), టీచింగ్ ఆప్టిట్యూడ్ (10 మార్కులు-10 ప్రశ్నలు). పార్ట్-సి మెథడాలజీ (ఎంచుకున్న సబ్జెక్ట్ మ్యాథ్స్/ ఫిజికల్ సైన్స్/ సోషల్‌స్టడీస్/ ఇంగ్లిష్ ఆధారంగా-100 మార్కులు-100 ప్రశ్నలు).
జనరల్ ఇంగ్లిష్: ఇందులో రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్ వంటి  బేసిక్ గ్రామర్ అంశాలపై దృష్టి సారించాలి.
పార్ట్-బి: ఇందులో సమకాలీన అంశాలతోపాటు స్టాండర్డ్ జీకే అంశాలు కూడా వస్తాయి.
టీచింగ్ ఆప్టిట్యూడ్:  మంచి టీచర్ల లక్షణాలు, వ్యక్తిగత వైరుధ్యాలున్న విద్యార్థులకు బోధించడంలో బోధకుడి సమర్థత, జనరల్ ఇంటెలిజెన్స్, అనలిటికల్ థింకింగ్‌లపై ప్రశ్నలుంటాయి.
పార్ట్-సి: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. వీటి క్లిష్టత డిగ్రీ స్థాయిలో ఉంటుంది.  సబ్జెక్ట్‌ల వారీగా ప్రశ్నల విభజనను గమనిస్తే..  మ్యాథమెటిక్స్ (100 ప్రశ్నలు), ఫిజికల్ సెన్సైస్ (ఫిజిక్స్-50 ప్రశ్నలు, కెమిస్ట్రీ- 50 ప్రశ్నలు), బయలాజికల్ సెన్సైస్ (బోటనీ-50 ప్రశ్నలు, జువాలజీ-50 ప్రశ్నలు), సోషల్ సెన్సైస్ (జాగ్రఫీ -35 ప్రశ్నలు, హిస్టరీ- 30 ప్రశ్నలు, సివిక్స్-15 ప్రశ్నలు , ఎకనామిక్స్-20 ప్రశ్నలు) ఇంగ్లిష్ (100 ప్రశ్నలు) సబ్జెక్ట్‌లు వస్తాయి.

మరిన్ని వార్తలు