కొలువుల వేటలో.. డిజిటల్‌ బాటలో..

1 Jan, 2017 04:16 IST|Sakshi
కొలువుల వేటలో.. డిజిటల్‌ బాటలో..

అప్లికేషన్‌ దశ నుంచి అపాయింట్‌మెంట్‌ లెటర్‌ వరకు.. ఆసాంతం ఆన్‌లైన్లోనే సాగించేందుకు కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అందువల్ల యువత కొలువుల వేటలో డిజిటల్‌ బాట పట్టాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఈ విషయంలో సిటీ నేపథ్యమున్న వారు మెరుగ్గా ఉంటున్నప్పటికీ.. గ్రామీణ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే కొద్దిపాటి మెళకువలు, నైపుణ్యాలతో డిజిటల్‌ బాటలో కొలువులు సాధించడం సులువే అన్నది నిపుణుల సూచన.

ఆన్‌లైన్లో దరఖాస్తు
ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవడంలో అభ్యర్థులు పలు పొరపాట్లు చేస్తున్నారు. అవే వారిని షార్ట్‌లిస్ట్‌కు దూరంగా ఉంచుతున్నాయి. అభ్యర్థులు చేస్తున్న పొరపాట్లలో ప్రధానమైనవి.. ఈ–మెయిల్‌ రెజ్యూమెలను పంపేటప్పుడు సబ్జెక్టు లైన్లో సరైన పదాలు రాయకపోవడం; ఇన్‌లైన్‌ టెక్స్‌›్టలో ఎలాంటి పదాలు, వాక్యాలు రాయాలో తెలియకపోవడం; రెజ్యూమెను అటాచ్‌మెంట్‌ చేసేటప్పుడు ఫైల్‌ నేమ్‌ ప్రొఫెషనల్‌గా లేకపోవడం. వీటి విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి.

జాబ్‌ సెర్చ్‌ పోర్టల్స్‌
జాబ్‌ సెర్చ్‌ పోర్టల్స్‌లో ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసుకునే ముందు తమకున్న నైపుణ్యాల విభాగాలను మాత్రమే స్కిల్స్‌ కాలమ్‌లో పేర్కొంటే.. నిర్దిష్టంగా ఆ స్కిల్స్‌ అవసరమున్న ఉద్యోగాల జాబితా/అలర్ట్స్‌ పొందేందుకు వీలవుతుంది. ఎక్స్‌పీరియన్స్‌డ్‌ ప్రొఫెషనల్స్‌ అయితే తమ పని అనుభవం, స్కిల్స్‌ను స్పష్టంగా పేర్కొనాలి.

సోషల్‌ మీడియాలో

ఇటీవల కాలంలో రిక్రూటర్స్‌ నియామకాలకు ఎక్కువగా సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు. లింక్డ్‌ఇన్, ట్విటర్, ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ ఆధారంగా అభ్యర్థుల స్కిల్స్‌ను బేరీజు వేస్తున్నారు. అందువల్ల సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తమ ఐడీ ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలి.
ఆన్‌లైన్లో ఉద్యోగాన్వేషణ సాగించే అభ్యర్థులు నిరంతరం తమ ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. కనీసం మూడు నెలలకోసారైనా ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేసుకుంటూ కొత్తగా పెంపొందించుకున్న స్కిల్స్‌ ఏమైనా ఉంటే వాటిని పొందుపరచాలి. ‘కీ’ స్కిల్స్, ఫ్రిఫర్డ్‌ లొకేషన్, ప్రిఫర్డ్‌ జాబ్‌ ప్రొఫైల్‌ అన్నిటినీ పరిశీలించాలి. వీలైతే వీటిలో మార్పులు చేసేందుకు నిపుణుల సలహాలు తీసుకోవాలి.

ఆన్‌లైన్‌ పరీక్షలు
నియామకాలకు చాలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఆన్‌లైన్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటిపై అభ్యర్థులు ముందుగానే అవగాహన పెంపొందించుకోవాలి. లేదంటే పరీక్ష సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ప్రాక్టీస్, మాక్‌ టెస్ట్‌లకు హాజరుకావాలి.

అవసరమైన టెక్నికల్‌ నైపుణ్యాలు

ఎంఎస్‌ ఆఫీస్‌ టూల్స్‌పై అవగాహన
కీ బోర్డ్‌ షార్ట్‌ కట్‌ మెథడ్స్‌ తెలుసుకోవడం
పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ స్కిల్స్‌
ఫైల్స్‌–డాక్యుమెంట్‌ ప్రొఫార్మాలపై అవగాహన
డాక్యుమెంట్‌ కన్వర్షన్‌  టైపింగ్‌ స్కిల్స్‌

అవసరమైన నాన్‌ టెక్నికల్‌ స్కిల్స్‌
లాంగ్వేజ్‌ కాంప్రెహెన్షన్‌   గ్రామర్‌పై నైపుణ్యం
సెంటెన్స్‌ ఫార్మేషన్‌          స్పోకెన్‌ ఇంగ్లిష్‌
బాడీ లాంగ్వేజ్‌          కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

ఆన్‌లైన్లో ఇంటర్వూ్యలు
షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు సంస్థలు ఆన్‌లైన్లో ఇంటర్వూ్యలు నిర్వహిస్తున్నాయి. వీటిని  స్కైప్‌ ఇంటర్వూ్యలుగా పేర్కొంటున్నారు. వీటి విషయంలో అభ్యర్థులు ప్రొఫెషనల్‌గా వ్యవహరించాలి. ఇంటర్వ్యూకు ఉపయోగించే గది వాతావరణం హుందాగా ఉండేలా చూసుకోవాలి. నిర్దిష్ట సమయానికి గంట, రెండు గంటల ముందే కంప్యూటర్, స్పీకర్, వీడియో, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఇంటర్వూ్య సమయంలో అవాంతరాలు ఎదురైతే, ఎదుటి వారికి ఆ సమస్యను వివరించడానికి సైతం సందేహించొద్దు.

‘ఆన్‌లైన్లో’ అభ్యర్థులు చేస్తున్న పొరపాట్లు

కీ స్కిల్స్‌ సరిగా పేర్కొనకపోవడం
ఆన్‌లైన్‌ ప్రొఫైల్‌లో సీవీ/రెజ్యూమెను అటాచ్‌ చేయకపోవడం
ప్రిఫర్డ్‌ లొకేషన్స్‌ విషయంలో ఒకట్రెండు ప్రాంతాలకు పరిమితం కావడం
ఆన్‌లైన్‌ ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేసుకోకపోవడం
ఈ–మెయిల్‌ అప్లికేషన్స్‌లో సబ్జెక్ట్‌ లైన్‌ను సరిగా పేర్కొనకపోవడం

మరిన్ని వార్తలు