ఇగ్నో నుంచి ఎంబీఏ చేయటం ఎలా?

27 Mar, 2014 15:06 IST|Sakshi

ఇగ్నో నుంచి ఎంబీఏ చేయటం ఎలా?
 -శ్రీధర్, నిర్మల్.
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ద్వారా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సును అందిస్తుంది. కోర్సు కాల వ్యవధి: రెండున్నరేళ్లు. అర్హత: 50 శాతం మార్కులతో (రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం) ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు మేనేజీరియల్/ సూపర్ వైజర్/సంబంధిత వృత్తిలో మూడేళ్ల అనుభవం. లేదా 50 శాతం మార్కులతోపాటు ప్రొఫెషనల్ డిగ్రీ (ఇంజినీరింగ్ /మెడిసిన్/సీఏ/ఐసీడబ్ల్యూఏఐ)/కంపెనీ సెక్రటరీషిప్/లా.


 జాతీయ స్థాయిలో నిర్వహించే ఓపెన్‌మ్యాట్ పరీక్ష ద్వారా ఎంబీఏ కోర్సులో ప్రవేశం క ల్పిస్తారు. సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు ఫిబ్రవరి, ఆగస్టులలో ఓపెన్‌మ్యాట్‌ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 
 ఎంబీఏలో ఆఫర్ చేస్తున్న స్పెషలైజేషన్స్: హెచ్‌ఆర్‌ఎం, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్.
 వివరాలకు: www.ignou.ac.in


 
 పలంటాలజీ కోర్సుకు సంబంధించిన వివరాలను తెలపండి?    
 -బాలు, నిజామాబాద్.
 పలంటాలజీ అంటే శిలాజ అధ్యయన శాస్త్రం. దీనిలో చరిత్ర పూర్వకాల అధ్యయనంతోపాటు శిలాజాల అధ్యయనం వంటి అంశాలు ఈ శాస్త్రంలో ఉంటాయి. ఎలాంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా భూమి పరిణామం చెందింది అనే విషయాలను గురించి వివరిస్తుంది. బయాలజీ, జియాలజీ, ఆర్కియాలజీల అంశాలను వివరించే మల్టీడిసిప్లినరీ కోర్సుగా పలంటాలజీని పేర్కొంటారు.
 
 ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
 ఉస్మానియా యూనివర్సిటీ -హైదరాబాద్
 కోర్సు: అప్లయిడ్ జియాలజీ(పలంటాలజీ ఒక సబ్జెక్ట్‌గా)
 అర్హత: 40 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీ. ప్రవేశం: ఎంట్రన్స్ ఆధారంగా
 వివరాలకు: www.osmania.ac.in
 ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం
 కోర్సు: ఎంఎస్సీ జియాలజీ, ఎంఎస్సీ(టెక్-అప్లయిడ్ జియాలజీ, (పలంటాలజీ ఒక సబ్జెక్ట్‌గా)
 అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.
 ప్రవేశం: ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా
 వివరాలకు: www.andhrauniversity.edu.in
 
 
 స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోర్సుల వివరాలను తెలపండి?

 నరేందర్, సికింద్రాబాద్.
 మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడుతూ, సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు బోధించేందుకు అవసరమైన..బోధనా పద్ధతుల్లో శిక్షణనిచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం ఈ విభాగంలో మెంటల్ రిటార్డేషన్, హియరింగ్, విజువల్, ఆటిజం, ఇంపెయిర్‌మెంట్, లెర్నింగ్ డిజబిలిటీ విభాగాల్లో డీఈడీ, బీఈడీ, ఎంఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
 
 కోర్సుల కరిక్యులం రూపకల్పన, కళాశాలల గుర్తింపు, పర్యవేక్షణ బాధ్యతలను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఈ కోర్సులను పూర్తి చేసిన వారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల కింద నడిచే పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్‌గా, వివిధ ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా, రెగ్యులర్ ప్రీస్కూళ్లు, వివిధ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవలందించవచ్చు.
 
 మన రాష్ట్రంలో.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ - సికింద్రాబాద్; స్వీకార్ రిహాబిలిటేషన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యాండీక్యాప్డ్-సికింద్రాబాద్; ఆంధ్రా యూనివర్సిటీ -విశాఖపట్నం (www.andhrauniversity.edu.in); శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం- తిరుపతి (www.spmvv.ac.in); కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ - ఆంధ్ర మహిళా సభ-హైదరాబాద్ (www. andhramahilasabha.org.in) బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును అందిస్తున్నాయి. ఠాగూర్ హరిప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ తదితర ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
 వివరాలకు: http://rehabcouncil.nic.in
 
 
 ఎంబీఏ (ఫార్మా మేనేజ్‌మెంట్) కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
 -ప్రవీణ్, కరీంనగర్.
 ఫార్మసీ రంగానికి నూతన ఔషధాలను కనిపెట్టడంతోపాటు వాటిని మార్కెటింగ్ చేయడం కూడా సవాలుగా మారింది. దాంతో పలు ఫార్మా కంపెనీలు మార్కెటింగ్ సంబంధిత విభాగాలను పర్యవేక్షించడం కోసం వృత్తి నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పలు విద్యాసంస్థలు ఫార్మసీ రంగంలో మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సు చేయడం ద్వారా ఫార్మాస్యుటికల్, కెమికల్, బయోటెక్నాలజీ సంస్థలు, పరిశోధన, విద్యాసంస్థల్లో మేనేజిరియల్ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
 
 ఆఫర్ చేస్తున్న సంస్థలు:
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పంజాబ్.
 వెబ్‌సైట్: www.niper.nic.in
 నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ముంబై
 వెబ్‌సైట్: www.nmims. edu
 

>
మరిన్ని వార్తలు