కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2015

13 Nov, 2014 00:40 IST|Sakshi
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2015

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1),
2015కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మిలటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్
త్రివిధ దళాల్లో ఉన్నతమైన హోదాతో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. ఈ నేపథ్యంలో అర్హత,
పరీక్షా విధానం, సంబంధిత వివరాలు..

 
ఖాళీలు:


ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్)    200
ఇండియన్ నావల్ అకాడమీ (ఎజిమలా)    45
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్)    32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (పురుషులు)    175
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (మహిళలు)    12
 
ఎంపిక ప్రక్రియ:

ఎంపిక ప్రక్రియలో మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి నియామకాన్ని ఖరారు చేస్తారు.
 
రాత పరీక్ష:

 రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న విభాగాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది.
 
 ఇండియన్ మిలిటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ
 
సబ్జెక్ట్                                   వ్యవధి           మార్కులు
ఇంగ్లిష్                                 2 గంటలు          100
జనరల్ నాలెడ్జ్                      2 గంటలు          100
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్    2 గంటలు          100
 
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ:
సబ్జెక్ట్               వ్యవధి       మార్కులు
ఇంగ్లిష్              2 గంటలు    100
జనరల్ నాలెడ్జ్    2 గంటలు    100

ఈ పరీక్షలో ప్రశ్నల క్లిష్టత ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పదో తరగతి స్థాయిలో ఉంటుంది.
 
అర్హత:

అన్ని విభాగాలకు అవివాహితులైనవారు మాత్రమే అర్హు లు. ఇండియన్ మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నావల్ అకాడమీకి బీటెక్/బీఈ. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే మహిళలు అర్హులు.
 
వయోపరిమితి:

ఇండియన్ మిలిటరీ అకాడమీ, నావల్ అకాడెమీల కోసం జనవరి 2, 1992- జనవరి 1, 1997 మధ్య, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1992- జనవరి 1, 1996 మధ్య, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (పురుషులు, మహిళలు) పోస్టులకు జనవరి 2, 1991- జనవరి 1, 1997 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
 పరీక్ష తేదీ: ఫిబ్రవరి 15, 2015.
 వెబ్‌సైట్: www.upsc.gov.in
 


 

>
మరిన్ని వార్తలు