ప్రవేశిక - తాత్విక పునాదులు

10 Apr, 2017 12:38 IST|Sakshi
 పోటీ పరీక్షల  ప్రత్యేకం
 
 ప్రతి ప్రజాస్వామ్య రాజ్యాంగం సాధారణంగా ప్రవేశికతో ప్రారంభమవుతుంది. భారతదేశ రాజ్యాంగం కూడా ప్రవేశికతోనే మొదలవుతుంది. ప్రవేశికకు పీఠిక, అవతారిక, ముందుమాట, ఉపోద్ఘాతం లాంటి పర్యాయపదాలున్నాయి. ప్రవేశికను ఆంగ్లంలో ‘Preambl్ఛ* అంటారు. 
 
 రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలు, మూల తత్వాన్ని ప్రవేశిక సూచనప్రాయంగా తెలియజేస్తుంది. ఏ ఉన్నత ఆశయాలతో రాజ్యాంగాన్ని  రచించారు? ఏ తరహా ప్రభుత్వాన్ని, ఎలాంటి సమాజాన్ని నిర్మించదలచారు? తదితర అంశాలను ప్రవేశిక స్పష్టం చేస్తుంది. 
 
 ప్రవేశిక - ఆధారం
 ప్రపంచంలో ప్రవేశిక కలిగిన మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ప్రవేశిక భావాన్ని అమెరికా నుంచి గ్రహించారు. అయితే రాజ్యాంగ పరిషత్‌లో 1946 డిసెంబర్ 13న జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిపాదించిన ‘ఆశయాల’ తీర్మానమే దీనికి ప్రధాన ప్రాతిపదిక. ఫ్రెంచి రాజ్యాంగం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్రం అనే అంశాలను గ్రహించారు. ఐక్యరాజ్య సమితి చార్టర్‌లోని ప్రవేశిక కూడా 
 ఆధారమని చెప్పొచ్చు.
 
 ప్రవేశిక - పాఠ్యాంశం
 భారత ప్రజలమైన మేము భారతదేశానికి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని; ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వా తంత్య్రాన్నీ; అంతస్తుల్లో, అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఈ 1949 నవంబర్ 26న మా రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం.
 
 ప్రవేశిక - పదజాలం, భావాలు, అర్థ వివరణ
 ప్రవేశికలో గొప్ప భావజాలాన్ని ప్రయోగించారు. ప్రతి పదానికి, భావానికి ఒక విశిష్ట అర్థాన్ని, పరమార్థాన్ని ఆపాదించవచ్చు. ‘భారత ప్రజలమైన మేము’ అని ప్రవేశిక ప్రారంభమవుతుంది. ప్రజలే రాజకీయాధికారానికి మూలం. ప్రజలే రాజ్యాంగాన్ని రచించుకున్నారని దీని అర్థంగా చెప్పొచ్చు.
 
 రాజకీయ స్వభావాన్ని తెలియజేసే పదాలు
 భారతదేశం ఏ తరహా రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందో, దాని స్వభావం ఏమిటో స్పష్టంగా పేర్కొన్నారు.
 
  సార్వభౌమత్వం  (Sovereignty): అంటే సర్వోన్నత అధికారం అని అర్థం. భారతదేశం అంతర్గతంగా సర్వోన్నత అధికారం, బాహ్యంగా ((External Independence and Internal Supremacy)) విదేశీ దౌత్య విధానాల్లో స్వేచ్ఛను కలిగి ఉంటుంది. ఏ బాహ్య శక్తీ మన విదేశాంగ విధానాన్ని నియంత్రించలేదు.
 
  సామ్యవాదం(Socialist): ఈ పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. సామ్యవాదం అంటే సమ సమాజ స్థాపన. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను క్రమేణా తగ్గించడం. ఉత్పత్తి శక్తులను (ఔ్చఛీ, ఔ్చఛౌఠట ్చఛీ ఇ్చఞజ్ట్చీ) ప్రభుత్వం నియంత్రించడం ద్వారా సంపద కొద్ది మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం కాకుండా, సాధ్యమైనంత వరకు జాతీయం చేస్తారు. తద్వారా ప్రజలకు సమాన అవకాశాలతోపాటు వాటిని అందిపుచ్చుకోవడానికి తోడ్పాటును అందిస్తారు. 
 
 ఠి సామ్యవాదానికి వివిధ రూపాలున్నాయి. కమ్యూనిజం, మావోయిజం, సిండికాలిజం, గిల్డ్ సోషలిజం, ఫెబియనిజం, స్టేట్ సోషలిజం మొదలైన రూపాలు వివిధ దేశాల్లో అమల్లో ఉన్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యవాదం (Democratic Socialism) అమల్లో ఉంది.
 
దీన్నే పరిమాణాత్మక లేదా 
 రాజ్యాంగ సామ్యవాదం అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో చట్టపరంగా నిర్దిష్ట పద్ధతిలో మార్పులు చేపడతారు. మన సామ్యవాదం గాంధీయిజం+మార్క్సిజంల మేలు కలయిక. కానీ గాంధీతత్వం వైపు కొంత మొగ్గు కనిపిస్తుంది. ప్రపంచీకరణ, ఆర్థిక ఉదారవాదం, ప్రైవేటీకరణ నేపథ్యంలో సామ్యవాద తత్వం మసకబారుతోందని చెప్పొచ్చు.
 
  లౌకికతత్వం (్ఛఛిఠ్చట): ఈ పదాన్ని కూడా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు చేర్చారు. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. లౌకిక దేశాల్లో అధికార మతం, మత వివక్ష ఉండవు. మతం విషయంలో పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం ఉంటాయి. మతపరంగా ఎవరికీ ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేదా నష్టం వాటిల్లదు. అధికార మతం ఉన్న రాజ్యాలను మతస్వామ్య రాజ్యం (Theocratic State) అంటారు. ఉదా: పాకిస్తాన్, బంగ్లాదేశ్.
 
  ప్రజాస్వామ్యం (Democracy)): ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో, ప్రజల కోసం, ప్రజల వల్ల ఏర్పాటైన ప్రభుత్వం. అంటే ప్రజలే పాలితులు, పాలకులని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నిర్వచించారు. భారత్‌లో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. ఎలాంటి వివక్షకు తావు లేకుండా కేవలం నిర్ణీత వయసున్న పౌరులందరికీ ఓటు హక్కు, ప్రభుత్వ పదవులకు పోటీ చేసే హక్కును కల్పించారు. పాలన చట్టపరంగా (Rule of law) జరుగుతుంది. చట్టబద్ధత లేకుండా ఏ చర్యా చెల్లుబాటు కాదు. సాధారణంగా ఏ వ్యక్తికీ ప్రత్యేక హోదా లేదా మినlహాయింపు ఉండదు.
 
 గణతంత్ర (Republic): ‘గణం’ అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన. ఇది ప్రజాపాలన. వారసత్వ లేదా అధికార హోదాలు ఉండవు. భారత రాష్ర్టపతి, ఇతర ప్రజా పదవుల్లోని వ్యక్తులను నిర్ణీత కాలానికి ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, లేదా పరోక్షంగా ఎన్నికవుతారు. బ్రిటిష్ రాణి/రాజు తరహాలో వారసత్వ అధికారం ఉండదు.
 
సామాజిక ఆశయాలు (Social Objectives): ప్రవేశికలో కొన్ని ఉదాత్తమైన ఆశయాలను పొందుపర్చారు. రాజ్యాంగం ద్వారా వాటిని సాకారం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.
 
  న్యాయం: న్యాయం అంటే ఒక సర్వోన్నత సమ తా భావన. అసమానత లు, వివక్షలు లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం. రాజ్యాంగంలో మూడు రకాల న్యాయాలను ప్రస్తావించారు. అవి..
 
 1) రాజకీయ న్యాయం (Political Justice): రాజ్య కార్యకలాపాల్లో పౌరులంతా ఎలాంటి వివక్ష లేకుండా పాల్గొనడమే రాజకీయ న్యాయం. సార్వజనీన ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, విజ్ఞాపన హక్కు మొదలైన వాటిని రాజకీయ న్యాయ సాధనకు ప్రాతిపదికలుగా పేర్కొనొచ్చు.
 
 2) సామాజిక న్యాయం (Social Justice): సమాజంలో పౌరులంతా సమానులే. జాతి, మత, కుల, లింగ, పుట్టుక అనే తేడాలు లేకుండా అందరికీ సమాన హోదా, గౌరవాన్ని కల్పించడం, అన్ని రకాల సామాజిక వివక్షలను రద్దు చేయడం, సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, తెగల అభ్యున్నతికి కృషి చేయడం.
 
 3) ఆర్థిక న్యాయం (Economic Justice): ఆర్థిక అంతరాలను తగ్గించడం, సంపద ఉత్పత్తి, పంపిణీ, వృత్తి, ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు, పేదరిక నిర్మూలన, ఆకలి నుంచి విముక్తులను చేయడం. జీవించేందుకు అనువుగా జీవితాన్ని మార్చడం.
 
 ఉన్నత ఆదర్శాలు
  స్వేచ్ఛ (Liberty): నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, ఉదాత్త నాగరిక, సామాజిక జీవనానికి స్వేచ్ఛాయుత వాతావరణం అవసరం. స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్భంధాలు లేకుండా వ్యక్తి పరిపూర్ణ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో ప్రతి పౌరుడికీ స్వేచ్ఛ ఉండి తీరాలి. ఉదా: మత స్వేచ్ఛ అనేది లౌకిక రాజ్యస్థాపనకు పునాది.
 
  సమానత్వం : ప్రజాస్వామ్యంలో అతి ముఖ్య ఆదర్శం సమానత్వం. అంటే అన్ని రకాల అసమానతలు, వివక్షలను రద్దు చేసి, ప్రతి వ్యక్తి వికాసానికి అవసరమైన అవకాశాలు కల్పించడం.
 
 ఠి సౌభ్రాతృత్వం (Fraternity): అంటే సోదర భావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. అసమానతలు, వివక్షలు లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్ధిల్లుతుంది. సార్వజనీన సోదర భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో సౌభ్రాతృత్వం అనే భావనను ప్రవేశికలో పొందుపర్చాలని డాక్టర్ బి.ఆర్. 
 అంబేద్కర్ ప్రతిపాదించారు.
 
 ఠి ఐక్యత, సమగ్రత (Unity & integrity): దేశ ప్రజలు కలిసి ఉండేందుకు ఐక్యతా భావం తోడ్పడుతుంది. ఇది ఒక మానసిక ఉద్వేగం (Psychological Emotion). మతం, కులం, ప్రాంతం లాంటి సంకుచిత ఆలోచనలకు అతీతమైన ఆదర్శం. సమగ్రత అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సమగ్రత ప్రజల్లో జాతీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది.
 
  సమగ్రతను చేర్చాల్సిన ఆవశ్యకత: 1970 తర్వాత దేశంలో చాలా చోట్ల ప్రాంతీయవాద, వేర్పాటువాద సమస్యలు తలెత్తాయి. దేశ సమగ్రతను దెబ్బతీసేలా మిలిటెంట్ పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమగ్రత అనే పదాన్ని చేర్చాల్సిన పరిస్థితి అనివార్యమైంది.
 
 ప్రవేశిక సవరణకు అతీతం కాదు
 ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంట్‌కు ప్రకరణ 368ని అనుసరించి ఉందని 
 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనం కిందికి వస్తుంది కాబట్టి దాని సారాంశం మార్చకుండా, ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేసేలా నిర్మాణాత్మకంగా సవరణలు చేయొచ్చని స్పష్టం చేసింది. అందువల్ల స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత అనే పదాలను చేర్చారు. ఇది ప్రవేశికకు మొట్టమొదటి సవరణ, చిట్టచివరిది కూడా. 
 
  ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా?  వివాదాలు 
  సుప్రీంకోర్టు తీర్పులు: రాజ్యాంగ సారాంశం మొత్తం ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే, ఇది రాజ్యాంగంలో అంతర్భాగమా? కాదా? అనే అంశంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించింది. 1960లో బెరుబారి యూనియన్ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ 1973లో కేశవానంద భారతి వివాదంలో తీర్పునిస్తూ.. దీనికి పూర్తి భిన్నంగా, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని వ్యాఖ్యానించింది. 1995లో ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా కేసులోనూ అత్యున్నత ధర్మాసనం ఇదే అభిప్రాయాన్ని పునరుద్ఘాటించింది.
 
 ఠి రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశికను ఓటింగ్‌కు 
 పెట్టినప్పుడు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని డాక్టర్ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది.
 
 ప్రవేశిక ప్రయోజనం - ప్రాముఖ్యత - విమర్శ
 ఠి ప్రవేశిక రాజ్యాంగ ఆత్మ, హృదయం. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను తెలుసుకోవడానికి ఆధారం. ఇది రాజ్యాంగానికి సూక్ష్మరూపం (Constitution in Miniature). ఇందులో రాజ్యాంగ తాత్విక పునాదులున్నాయి.
 ఠి ప్రయోజనాలు: రాజ్యాంగ ఆధారాలను ప్రవేశిక వివరిస్తుంది. రాజ్యాంగ ఆమోద తేదీని తెలుపుతుంది. రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు చట్టపర సహాయకారిగా ఉపయోగపడుతుంది.
 ఠి విమర్శ: ప్రవేశికకు న్యాయ సంరక్షణ (Non-Justiciable) లేదు. ఇందులో పేర్కొన్న ఆశయాలను అమలుపర్చకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఇందులో పేర్కొన్న భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు. హక్కుల ప్రస్తావన లేదు. శాసనాధికారాలకు ఇది ఆధారం కాదు. సమకాలీన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రవేశికలోని కొన్ని ఆదర్శాలు అమలుకు నోచుకోవట్లేదని     చెప్పొచ్చు.
 
  బి. కృష్ణారెడ్డి,
  డెరైక్టర్, క్లాస్-వన్ స్టడీ సర్కిల్
 
మరిన్ని వార్తలు