వినూత్న కోర్సులతో అవకాశాలెన్నో..

24 Jun, 2014 04:57 IST|Sakshi
వినూత్న కోర్సులతో అవకాశాలెన్నో..

కోర్స్ కార్నర్: ఆధునిక సమాజంలో అవసరాలు రోజురోజుకీ మారిపోతున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. కాలానుగుణంగా ఎన్నో కొత్త రంగాలు తెరపైకి  వస్తున్నాయి. ఆయా రంగాల నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా అవసరమే. అలాంటి వనరులను సమాజానికి అందించేందుకు ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌లు  నూతన కోర్సులను ప్రారంభిస్తున్నాయి. మూస ధోరణిలో కాకుండా అందరికంటే భిన్నంగా ఆలోచించి ఇలాంటి వినూత్న కోర్సులను ఎంచుకుంటే మెరుగైన భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చు. హైదరాబాద్‌లో కొన్ని ప్రముఖ సంస్థలు అందిస్తున్న కోర్సులు.. వాటి వివరాలు..  
 
 ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్-హైదరాబాద్
 అందిస్తున్న కోర్సులు:
 ఎంఎస్‌క్యూఎంఎస్ (మాస్టర్ ఆఫ్ సైన్స్-క్వాలిటీ సర్వీస్ మేనేజ్‌మెంట్)
 అర్హత: మ్యాథ మెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ
 జేఆర్‌ఎఫ్ ఇన్ క్వాలిటీ రిలియబిలిటీ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్
 అర్హత: సంబంధిత విభాగంలోఎంఈ/ఎంటెక్/ఎంఎస్/ఎంఫిల్/తత్సమానం/ఎంస్టాట్స్/ఎంఎస్సీ/ఎంఏతోపాటు మ్యాథ్స్/ఫిజిక్స్/స్టాటిస్టిక్స్‌లతో మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్ట్‌గా డిగ్రీ లేదా బీఈ/బీటెక్.
 పార్ట్ టైమ్ కోర్సులు (స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్)
 అర్హత: డిగ్రీ/డిప్లొమా ఇన్ టెక్నాలజీ లేదా మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్ట్‌గా డిగ్రీ. నిర్దేశించిన విధంగా పని అనుభవం ఉండాలి.
 ప్రవేశం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ (నిర్దేశించిన కోర్సులకు) ఆధారంగా
 వివరాలకు: www.isihyd.ac.in
 
 బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్‌‌స (బిట్స్), పిలానీ-హైదరాబాద్
 కోర్సు: ఎంఎస్సీ (టెక్)-ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్
 ఇది మల్టిడిసిప్లినరీ కోర్సు. ఈ రంగంలో కొత్తగా మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సును రూపొందించారు. ప్రవేశం: బిట్‌శాట్ స్కోర్ ఆధారంగా
 వివరాలకు: www.bitspilani.ac.in
 నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం-హైదరాబాద్
 నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం-హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఎయిర్ అండ్ స్పేస్ లా కేంద్రం.. విమానయానం, టెలికమ్యూనికేషన్, అంతరిక్ష రంగాలకు సంబంధించిన చట్టాలు, మేనేజ్‌మెంట్‌లకు సంబంధించిన కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. వివరాలు..
 పీజీ కోర్సులు: ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్‌‌సపోర్‌‌ట మేనేజ్‌మెంట్
 స్పేస్ అండ్ టెలికమ్యూనికేషన్ లాస్
 పీజీ డిప్లొమా కోర్సులు: ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్‌‌సపోర్‌‌ట మేనేజ్‌మెంట్, స్పేస్ అండ్ జీఐఎస్ లాస్
 అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్‌‌స ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఆ రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
 వివరాలకు: www.nalsar.ac.in
 
 ఐఎస్‌బీ- హైదరాబాద్
 కోర్సు: సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (సీబీఏ)
 హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (సీబీఏ)ను ఆఫర్ చేస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల ఎగ్జిక్యూటివ్ కోర్సు.  
 అర్హత: ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్/తత్సమాన డిగ్రీ. నిర్దేశించిన విధంగా పని అనుభవం.  
 ప్రవేశం: ఇంటర్వ్యూ, ఇతర పరీక్షల ద్వారా...
 వివరాలకు: www.isb.edu/cee
 
 జేఎన్‌టీయూ-హైదరాబాద్
 జేఎన్‌టీయూ-హైదరాబాద్, బీఈ/బీటెక్ కోర్సులతోపాటు మారుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తోంది. వివరాలు..
 కోర్సులు:  బీటెక్+ఎంటెక్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్+ఎంబీఏ,
 బీటెక్ ఈసీఈ+ఎంబీఏ, బీటెక్ సీఎస్‌ఈ+ఎంబీఏ,
 ప్రవేశం: ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా. వివరాలకు: www.jntuh.ac.in/
 
 ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్.
 ఈ యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఉంది. ఇంగ్లిష్‌తోపాటు ప్రస్తుత తరుణంలో డిమాండ్ ఉన్న విదేశీ భాషలకు సంబంధించిన కోర్సులను అందించడం ఈ యూనివర్సిటీ ప్రత్యేకత. వాటి వివరాలు..
 బీఏ, బీసీజే, బీఈడీ(ఇంగ్లిష్), ఎంఈడీ, ఎంఏ, ఎంసీజే, మాస్టర్ ఇన్ కంప్యుటేషన్ లింగ్విస్టిక్స్, పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్, పీహెచ్‌డీ  
 ప్రవేశం: రాత పరీక్ష ద్వారా.వివరాలకు:  www.efluniversity.ac.in
 అకడెమిక్, పోటీ పరీక్షలకు సంబంధించిన ఎలాంటి సందేహాలనైనా మాకు మెయిల్ చేయండి. సంబంధిత నిపుణులు మీకు సమాధానాలిస్తారు.
 మెయిల్ ఐడీ:sakshieducation@gmail.com

>
మరిన్ని వార్తలు