డేవిస్‌కప్ కమిట్‌మెంట్ అవార్డు విజేత?

18 Sep, 2014 15:00 IST|Sakshi

ప్రాక్టీస్ బిట్స్
 1. యునెటైడ్ కింగ్‌డమ్‌లోని ఏ ప్రాంతం సెప్టెంబర్ 18న స్వాతంత్య్రం కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది?
     ఎ) వేల్స్         బి) ఉత్తర ఐర్లాండ్
     సి) స్కాట్లాండ్     డి) ఇంగ్లండ్
 
 2.    పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-1 క్షిపణిని 2014, సెప్టెంబర్ 11న పరీక్షించారు. దీని పరిధి ఎంత?
     ఎ) 350 కిలోమీటర్లు
     బి) 700 కిలోమీటర్లు
     సి) 500 కిలోమీటర్లు    డి) 1500 కిలోమీటర్లు
 
 3.    అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డేవిస్ కప్ కమిట్‌మెంట్ అవార్డును ఏ భారతీయ టెన్నిస్ క్రీడాకారుడికి అందజేసింది?
     ఎ) యూకీ బాంబ్రీ     బి) సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్
     సి) రోహన్ బోపన్న     డి) మహేశ్ భూపతి
 
 4.    బ్లూమ్‌బర్గ్ మార్కెట్స్ మ్యాగజైన్ రూపొందించిన 50 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మహిళ?
     ఎ) నైనాలాల్ కిద్వాయ్    బి) చందా కొచ్చర్
     సి) శిఖా వర్మ     డి) అరుంధతీ భట్టాచార్య
 
 5.    2014 సెప్టెంబర్‌లో అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో కొత్తగా నిర్మించిన భారత రాయబార కార్యాలయాన్ని ఎవరు ప్రారంభించారు?
     ఎ) అరుణ్‌జైట్లీ     బి) సుష్మాస్వరాజ్
     సి) హమీద్ అన్సారీ     డి) నరేంద్ర మోడీ
 
 6.    ఇటీవల జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి ఆసియా దేశం ఏది?
     ఎ) చైనా     బి) ఇండోనేషియా
     సి) మలేషియా     డి) జపాన్
 
 7.    ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్ ‘క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్’ అవార్డును ఎవరికి ప్రదానం చేసింది?
     ఎ) బ్రయాన్ లారా     బి) షేన్ వార్న్
     సి) జాక్వస్ కల్లిస్     డి) సచిన్ టెండూల్కర్
 8.    మహిళల భద్రతకు ఉపయోగపడే రక్ష అనే మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించిన రాజకీయ పార్టీ ఏది?
     ఎ) కాంగ్రెస్     బి) భారతీయ జనతా పార్టీ
     సి) ఆమ్ ఆద్మీ పార్టీ     డి) తృణమూల్ కాంగ్రెస్
 
 9.    నూరుశాతం ఈ-అక్షరాస్యతను సాధించిన తొలి గ్రామ పంచాయతీగా ఘనత సాధించిన పల్లిచల్ ఏ రాష్ట్రంలో ఉంది?
     ఎ) తమిళనాడు     బి) కర్ణాటక
     సి) కేరళ         డి) పశ్చిమెంగాల్
 
 10.    అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
     ఎ) సెప్టెంబర్ 5     బి) సెప్టెంబర్ 6
     సి) సెప్టెంబర్ 9     డి) సెప్టెంబర్ 8
 
 11.    ఫార్చూన్ మ్యాగజైన్ 350 గ్లోబల్ కంపెనీలతో రూపొందించిన ప్రపంచ అత్యంత ప్రశంసనీయ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన కంపెనీ?
     ఎ) యాపిల్     బి) అమెజాన్
     సి) గూగుల్         డి) బెర్క్‌షైర్ హతవే
 
 12.    కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిబంధనల ప్రకారం సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు కంపెనీలు మూడేళ్ల సగటు వార్షిక లాభాల ఆధారంగా ఆర్థిక సంవత్సరం లాభాల్లో కనీసం ఎంత శాతాన్ని ఖర్చు చేయాలి?
     ఎ) 1 శాతం     బి) 2 శాతం
     సి) 3 శాతం     డి) 4 శాతం
 
 13.    ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014కు రాష్ట్రపతి ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు?
     ఎ) మార్చి 1     బి) మార్చి 3
     సి) మార్చి 5     డి) మార్చి 2
 
 14.    ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గ్రేమ్ స్మిత్ ఏ దేశానికి 108 టెస్ట్‌ల్లో నాయకత్వం వహించాడు?
     ఎ) వెస్టిండీస్     బి) న్యూజిలాండ్
     సి) ఇంగ్లండ్     డి) దక్షిణాఫ్రికా
 
 15.    ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచ బిలియనీర్ల జాబితా-2014లో ముకేశ్ అంబానీ స్థానం?
     ఎ) 32     బి) 35
     సి) 40     డి) 22
 
 16.    16వ లోక్‌సభకు ఎన్నికలు ఎన్ని దశల్లో జరిగాయి?
     ఎ) 7     బి) 8     సి) 9     డి) 10
 
 17.    భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఏ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రచారకర్తగా ఎంపికయ్యారు?
     ఎ) మహారాష్ట్ర     బి) గుజరాత్
     సి) హర్యానా     డి) ఉత్తరాఖండ్
 
 18.    దేశంలోని మొదటి మైనారిటీ సైబర్ గ్రామాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
     ఎ) రాజస్థాన్     బి) ఉత్తరప్రదేశ్
     సి) మహారాష్ట్ర     డి) పశ్చిమబెంగాల్
 
 19.    ‘‘అంబేద్కర్: అవేకనింగ్ ఇండియాస్ సోషల్ కాన్షన్స్’’ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు?
     ఎ) విజయ్ దర్దా
     బి) నరేంద్ర జాదవ్
     సి) అరుంధతీ రాయ్
     డి) వి.కె.మల్హోత్రా
 
 20.    ఆర్సెనీయ్ యాట్‌సెన్‌యుక్ ఏ దేశానికి ప్రధాని?
     ఎ) రష్యా        బి) కజక్‌స్థాన్
     సి) ఉక్రెయిన్     డి) బెలారస్
 
 21.    బోర్ వైల్డ్‌లైఫ్ శ్యాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది?
     ఎ) మహారాష్ట్ర     బి) అస్సాం
     సి) కర్ణాటక         డి) త్రిపుర
 
 22.    మైనారిటీల కోసం సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది?
     ఎ) జస్టిస్ సచార్ కమిటీ
     బి) జస్టిస్ రంగనాథ్‌మిశ్రా కమిటీ
     సి) జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ
     డి) జస్టిస్ ముద్గల్ కమిటీ
 
 23.    కామరాజర్ పోర్ట్ అని ఏ నౌకా కేంద్రాన్ని పిలుస్తారు?
     ఎ) ట్యుటికోరన్     బి) ఎన్నోర్
     సి) కొచ్చిన్         డి) మంగళూరు
 
 24.    వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) డెరైక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
     ఎ) పీటర్ స్కాట్     బి) జూలియన్ హక్స్‌లీ
     సి) మార్కో లాంబర్టిని     డి) మ్యాక్స్ నికోల్‌సన్
 
 25.    ‘బిగ్ యాపిల్’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
     ఎ) వార్సా         బి) మాడ్రిడ్
     సి) బార్సిలోనా     డి) న్యూయార్క్
 
 26.    ఈ-మెయిల్‌ను ఎవరు కనుగొన్నారు?
     ఎ) సబీర్ భాటియా     బి) బిల్‌గేట్స్
     సి) రే టామ్లిన్‌సన్     డి) లారీ పేజ్
 
 27.    మానవ శరీరంలోని ఎముకల సంఖ్య?
     ఎ) 212     బి) 206     సి) 222     డి) 215
 
 28.    విటమిన్ బి లోపం వల్ల ఏ వ్యాధి సంక్రమిస్తుంది?
     ఎ) రికెట్స్         బి) రేచీకటి
     సి) బెరిబెరి         డి) ఆస్టియో మలేసియాత
 
 29.    నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)ను ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు?
     ఎ) 1975     బి) 1980     సి) 1985     డి) 1982
 
 30.    సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరి స్థానంలో నియమితులయ్యారు?
     ఎ) బిల్‌గేట్స్     బి) స్టీవ్ బామర్
     సి) స్టీవ్ జాబ్స్     డి) పాల్ అలెన్
 
 31.    ఫిబ్రవరి 4ను ఏ దినంగా పాటిస్తారు?
     ఎ) ప్రపంచ క్షయ దినం
     బి) ప్రపంచ ఎయిడ్స్ దినం
     సి) ప్రపంచ కేన్సర్ దినం
     డి) ప్రపంచ మలేరియా దినం
 
 32.    2014 ఆస్కార్ అవార్డుల్లో పది విభాగాల్లో నామినేషన్ పొందిన ఏ చిత్రానికి ఒక్క అవార్డూ రాలేదు?
     ఎ) గ్రావిటీ         బి) అమెరికన్ హజిల్
     సి) ఫాస్ట్ అండ్ ప్యూరియస్    డి) హీలియం
 
 33.    ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా-2014లో అగ్రస్థానంలో ఉన్నది?
     ఎ) బిల్ గేట్స్     బి) కార్లోస్ సిమ్
     సి) అమాన్సియా ఒర్టేగా     డి) వారెన్ బఫెట్
 
 34.    ఏ ప్రముఖ క్రికెటర్ విగ్రహాన్ని ఆంటిగ్వా రాజధాని సెయింట్ జాన్స్‌లో ఆవిష్కరించారు?
     ఎ) బ్రయాన్ లారా     బి) సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్
     సి) క్లైవ్ లాయిడ్     డి) సర్ వివియన్ రిచర్డ్స్
 
 35.    2014 దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను ఎవరు గెలుచుకున్నారు?
     ఎ) రోజర్ ఫెదరర్     బి) థామస్ బెర్టిచ్
     సి) రఫెల్ నాదల్     డి) కీ నిషికోరి
 
 సమాధానాలు:
     1) సి;     2) బి;     3) సి;     4) డి;     5) బి;
     6) ఎ;     7) డి;     8) బి;     9) సి;     10) డి;
     11) ఎ;     12) బి;     13) ఎ;     14) డి;     15) సి;
     16) సి;     17) బి;     18) ఎ;     19) బి;     20) సి;
     21) ఎ;     22) ఎ;     23) బి;     24) సి;     25) డి;
     26) సి;     27) బి;     28) సి;     29) డి;     30) బి;
     31) సి;     32) బి;     33) ఎ;     34) డి;     35) ఎ.
 

మరిన్ని వార్తలు