జిల్లా ప్రణాళికా బోర్డు చైర్మన్‌గా వ్యవహరించేది?

10 Jul, 2014 21:02 IST|Sakshi
జిల్లా ప్రణాళికా బోర్డు చైర్మన్‌గా వ్యవహరించేది?

Civils Prelims
 Paper - I
 
భారత్‌లో ప్రాంతీయ ప్రణాళికా విధానం
 
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ప్రాంతీయ అసమానతలను కచ్చితంగా అంచనా వేయడం క్లిష్టతరమైన అంశం. వివిధ రాష్ట్రాల మధ్య అసమానతలను తలసరి ఆదాయం ఆధారంగా అంచనా వేస్తా రు.

ఈ అంచనాలు రాష్ట్రాల మధ్య ఆదాయ స్థాయిల్లో తేడాలను వెల్లడిస్తున్నప్పటికీ వివిధ ప్రాంతాల మధ్య లేదా ఒకే రాష్ర్టంలోని అనేక ప్రాంతాల మధ్య ఆదాయపరమైన అసమానతలను స్పష్టపరచడం లేదు. అభివృద్ధికి తలసరి ఆదాయం లేదా రాష్ర్ట స్థూల దేశీయోత్పత్తిని కచ్చితమైన సూచీగా పరిగణించలేం. పారిశ్రామికాభివృద్ధిలో తేడా, వ్యవసాయాభివృద్ధిలో వ్యత్యాసం, వివిధ రాష్ట్రాల మధ్య అక్షరాస్యతలో తేడా, మొత్తం శ్రామికుల్లో తయారీ రంగ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న శ్రామికుల శాతం, మొత్తం రోడ్ల విస్తీర్ణం, శిశు మరణాల రేటు లాంటి అంశాలను ప్రాంతీయాభివృద్ధిలో అసమానతలను కొలవడానికి సూచీలుగా పరిగణించాలి. ఆర్థికవేత్తలు వీటి సాయంతో వివిధ రాష్ట్రాల మధ్య Composite indices of developmentను రూపొందించడం ద్వారా ప్రాంతీయ అసమానతలను అంచనా వేయడానికి ప్రయత్నించారు. ఒకే రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతలను కొలవడానికి కింద పేర్కొన్న సూచీలు దోహదపడతాయి.
 
1.    తలసరి ఆదాయంలో వ్యత్యాసాలు
 2.    వృద్ధిరేట్లలో వ్యత్యాసాలు
 3.    పేదరిక నిష్పత్తిలో వ్యత్యాసాలు
 4.    భౌతిక జీవన నాణ్యతలో వ్యత్యాసాలు
 5.    పారిశ్రామికాభివృద్ధిలో వ్యత్యాసాలు
 6.    వ్యవసాయాభివృద్ధిలో వ్యత్యాసాలు
 7.    మొత్తం జనాభాలో పట్టణ జనాభా
 8.    తలసరి విద్యుత్ వినియోగం
 
 సూచికల విషయంలో అసమానతలు
 స్వాతంత్య్రానంతరం అధిక తలసరి ఆదాయం లో పంజాబ్, మహారాష్ర్ట, హర్యానా రాష్ట్రాలు ముందువరుసలో ఉండేవి. 1960-61లో పంజాబ్ తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 25.6 శాతం, 1971-72 లో 69.8 శాతం, 2004-05లో 32.1 శాతం ఎక్కువ. 2005-06 తర్వాత తలసరి ఆదాయంలో హర్యానా ప్రధాన స్థానం పొందింది. 2011-12లో అధిక రాష్ర్ట స్థూల దేశీయోత్పత్తి కారణంగా తలసరి ఆదాయంలో వృద్ధి పరంగా బీహార్ ప్రథమ స్థానాన్ని, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట తర్వాతి స్థానాలను పొందాయి.
 
2004-05లో దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మొత్తం జనాభాలో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 48.2 శాతంగా నమోదైంది. ఆర్థికంగా వెనుకబడిన పెద్ద రాష్ట్రాల్లో పేదరికం కేంద్రీకృతమై ఉందని దీని ఆధారంగా అవగతం చేసుకోవచ్చు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలైన మహారాష్ర్ట, గుజరాత్, తమిళనాడులో పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి.

ఫ్యాక్టరీలకు సంబంధించి మొత్తం ఉత్పత్తిలో 2/5వ వంతు కంటే ఎక్కువ, మొత్తం ఉద్యోగితలో 2/5 వంతు కంటే కొంత తక్కువ ఈ మూడు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమైంది. వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో ఇతర రాష్ట్రాల కంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు ముందంజలో ఉన్నాయి.

2011 లెక్కల ప్రకారం దేశ జనాభాలో 4.4 శాతం వాటాను కలిగి ఉన్న పంజాబ్, హర్యానా దేశం లో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో సుమారు 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
 
అభివృద్ధి ప్రక్రియలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోని మొత్తం జనాభాలో పట్టణ జనాభా అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో పట్టణ జనాభా మహారాష్ర్టలో 45.2 శాతం, తమిళనాడులో 48.4 శాతం, గుజరాత్‌లో 42.6 శాతం, కర్ణాటకలో 38.6 శాతం, పంజాబ్‌లో 37.5 శాతంగా నమోదైంది. బీహార్, ఒడిశా, అసోం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పట్టణ జనాభా శాతం తక్కువ.

2009-10లో అత్యధిక తలసరి విద్యుత్ వినియోగం గోవాలో నమోదు కాగా, పాండిచ్చేరి, పంజాబ్, గుజరాత్ తర్వాతి స్థానాలు పొందాయి. మరోవైపు తలసరి విద్యుత్ వినియోగం అసోం, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్‌లో తక్కువ. జాతీయ సగటు తలసరి విద్యుత్ వినియోగం కంటే ఆయా రాష్ట్రాల్లో తలసరి విద్యుత్ వినియోగం తక్కువ.

2011 మార్చిలో జాతీయ సగటు బ్యాంకింగ్ రంగ డిపాజిట్లు * 33,174  కోట్లు కాగా ఢిల్లీలో తలసరి బ్యాంకింగ్ రంగ డిపాజిట్ల సగటు *2,85,400 కోట్లుగా, మహారాష్ర్టలో *82,380 కోట్లుగా నమోదయ్యాయి. బీహార్, అసోంలో తలసరి డిపాజిట్లు తక్కువగా ఉండటాన్ని బట్టి ప్రాంతీయ అసమానతల తీవ్రతను తెలుసుకోవచ్చు.
 
ప్రాంతీయ ప్రణాళిక
1930వ దశకంలో ఆర్థికాభివృద్ధి మొదటి దశలో ప్రాంతీయ ప్రణాళికను సహజవనరుల ప్రణాళికగానే భావించారు. తర్వాతి కాలంలో సహజ వనరుల ప్రణాళికకు ప్రాధాన్యం తగ్గి సమస్యాత్మక రంగాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికపై శ్రద్ధ పెరిగింది. గ్రామీణ జనాభా అధికంగా ఉన్న భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రామాల మధ్య సంధానాన్ని (లింకేజ్) పెంచడం,సర్వీసు కేంద్రాల ఏర్పాటు, వృద్ధి కేంద్రాలను గుర్తించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించి అమలుపరచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

అభివృద్ధి చెందిన దేశాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి రేటును ఇతర ప్రాంతాల కంటే మెరుగుపరిచే విధంగా ప్రాంతీ య ప్రణాళికలు అవసరం. వెనుకబడిన దేశాల్లో ప్రాంతీయ ప్రణాళికల లక్ష్యాల సాధన కొంత క్లిష్టతరమైంది. పేదరిక తీవ్రత అధికంగా ఉండే ఆయా దేశాల్లో ప్రజల జీవన నాణ్యత పెంపునకు ప్రాధాన్యమివ్వాలి. జాతీయాదాయం, సంపద పేద వర్గాల ప్రజల మధ్య పునఃపంపిణీ చేసే కార్యక్రమాల రూపకల్పనతోపాటు ఉపాధి వ్యూహాన్ని రూపొందించే విధంగా ప్రాంతీయ ప్రణాళికలు తోడ్పాటును అందించాలి.
 
భారత్‌లో ప్రాంతీయ ప్రణాళికా విధానం

ప్రణాళికా ప్రక్రియ ప్రారంభమైన తర్వాత భారత్‌లో ప్రాంతీయ అసమానతలను దృష్టిలో ఉం చుకొని ప్రణాళికా రచయితలు ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధిని గుర్తించారు. రెండో ప్రణాళిక ముసాయిదాలో అల్పాభివృద్ధి ప్రాంతాల ప్రత్యే క అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి లక్ష్యసాధనకు అనుగుణంగా పెట్టుబడుల ప్రక్రియ ఉండాలని ముసాయిదాలో పేర్కొన్నారు. మూడో ప్రణాళిక డాక్యుమెంట్‌లో చాప్టర్ ఐగీను ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధికి కేటాయించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమతౌల్య అభివృద్ధితోపాటు ఆర్థిక ప్రగతి ఫలితాలను వెనుకబడిన ప్రాంతాలు పొందే విధంగా ప్రణాళికా రచనకు ప్రాధాన్యమిచ్చారు.

3వ ప్రణాళిక అప్రోచ్ పేపర్‌లో రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించే విధంగా రాష్ర్ట ప్రభుత్వాలకు తగిన చేయూతనివ్వాలని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తి పెంపు, ఆదాయం, ఉపాధి పెంపునకు చర్యలు, సాంఘిక సేవల్లో భాగంగా ప్రాథమిక విద్య, వాటర్ సప్లయ్, పారిశుధ్యం, సమాచారం, విద్యుత్ సౌకర్యాల అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణం పెంపు లాంటి అంశాలను పేర్కొన్నారు. ఇదివరకే అ మల్లో ఉన్న కార్యక్రమాలతోపాటు కొత్త కార్యక్రమాల రూపకల్పన ద్వారా ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధిని అప్రోచ్ పేపర్‌లో పేర్కొన్నారు.
 
నాలుగో ప్రణాళికలో చిన్న రైతుల అభివృద్ధి; ఏజెన్సీ, ఉపాంత రైతులు, వ్యవసాయ కార్మికుల అభివృద్ధి; ఏజెన్సీ, దుర్భిక్ష పీడిత ప్రాంతాల కార్యక్రమం, క్రాష్ స్కీం ఫర్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్, పైలట్ ఇంటెన్సివ్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ ప్రాజెక్ట్‌లను అమలుపరిచారు. 4వ ప్రణాళికలో ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధిలో భాగంగా అవలంభించిన విధానాలు, కార్యక్రమాలను అయిదో ప్రణాళికలోనూ కొనసాగించారు. 5వ ప్రణాళికలో ఏరియా డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యమిచ్చారు.

ఇందులో భాగం గా వనరుల ఆధారిత లేదా సమస్యాత్మక ఆధారిత అభివృద్ధి దృక్పథం, లక్షిత వర్గాల అప్రోచ్, ఇన్సెంటివ్ అప్రోచ్, సమగ్ర ప్రాంతాల అభివృద్ధి లాంటి దృక్పథాలను అవలంభించారు. ప్రాంతీ య అసమానతలను రూపుమాపే క్రమంలో ఆరో ప్రణాళిక Area Planning, Subplan Approach ను ప్రోత్సహించడం ద్వారా ప్రాం తీయ ప్రణాళికను జాతీయ అభివృద్ధి ప్రణాళికతో సంఘటితపరచవచ్చని భావించారు.

ఏడో ప్రణాళిక వ్యవసాయ ఉత్పాదకత, మానవ వనరుల సామర్థ్యం లాంటి రెండు అంశాల్లో ప్రాం తీయ అసమానతల తొలగింపును గుర్తించింది. ఎనిమిదో ప్రణాళిక కొండ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం, ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్, బోర్డర్ ఏరియా డెవలప్‌మెంట్ కౌన్సిల్ లాంటి కార్యక్రమాలను ప్రకటించింది. ఈ కార్యక్రమాలను తప్పనిసరిగా ప్రాంతీయ ప్రణాళికలో భాగంగా పరిగణించవచ్చు.

తొమ్మిదో ప్రణాళికలో ప్రత్యే క ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని భావించారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులు ప్రాంతీయ అసమానతల తొలగింపునకు సహకరించవని ఈ ప్రణాళిక డాక్యుమెంట్‌లో ప్రణాళిక రచయితలు భావించారు. వెనుకబడిన రాష్ట్రాల్లో అవస్థాపనా రంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడుల పెంపు ఆవశ్యకతను డాక్యుమెంటులో పొందుపరిచారు.

పదో ప్రణాళిక పెరుగుతున్న ప్రాంతీయ అసమానతల పట్ల ఆందోళన వెలిబుచ్చింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధనలో భాగంగా ఈ ప్రణాళికలో రాష్ట్రాలకు విడిగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించారు. సాంఘిక అభివృద్ధి, వృద్ధిరేట్లను ఈ లక్ష్యాల్లో భాగంగా పొందుపరిచారు. పదకొండో ప్రణాళికలో వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు నిధిని పటిష్టపరచాలని భావించారు.

 అవస్థాపనా సౌకర్యాల కల్పన, గుడ్ గవర్నెన్‌‌సను ప్రోత్సహించడం, వ్యవసాయ రంగ సంస్కరణల లాంటి అంశాలకు ఈ నిధి నుంచి గ్రాంట్లు ఇస్తారు. వీటితో పాటు కొండ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం, Western Ghats Development Programme, బోర్డర్ ఏరియా డెవలప్‌మెంట్ కార్యక్రమాలను పటిష్టపరచాలని భావించారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి అనేక ప్రోత్సాహకాలను ఈ ప్రణాళికలో ప్రతిపాదించారు.
 ప్రణాళికా యుగం మొత్తాన్ని పరిశీలించినప్పుడు ప్రాంతీయ ప్రణాళికలకు సంబంధించి

ప్రభుత్వ విధానాలు కిందివిధంగా ఉన్నాయి.
 1.    వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ లక్ష్యంగా అవలంభించిన విధానాలు.
 2.    నీటిపారుదల, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల అభివృద్ధికి సంబంధించిన విధానాలు.
 3.    ముఖ్య అవస్థాపనా సౌకర్యాలైన రవాణా, సమాచార రంగాలను వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి నిమిత్తం అవలంభించిన విధానాలు.
 4.    {పాంతీయ అసమానతల నివారణలో భాగంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వనరుల బదిలీ.
 5.    వెనుకబడిన, అల్పాభివృద్ధి ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం ప్రత్యేక కార్యక్రమాలు.
 
 
మాదిరి ప్రశ్నలు
 1.    బోర్డర్ ఏరియా అభివృద్ధి కార్యక్రమాన్ని ఎన్నో ప్రణాళికలో ప్రారంభించారు?
     1) 5     2) 6    3) 7     4) 8
 
2.    జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమానికి ఇంతకు ముందున్న పేరేమిటి?
     1) పనికి ఆహార పథకం
     2) జాతీయాభివృద్ధి పథకం
     3) గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం
     4) ఏదీకాదు
 
3.    రాష్ట్రాలకు, ప్రణాళికా సంఘానికి మధ్య సహకారం పెంపొందించడానికి ఏర్పరిచిన సంస్థ ఏది?
     1) జాతీయ అభివృద్ధి మండలి
     2) జాతీయ సమన్వయ మండలి
     3) జాతీయ సహకార మండలి
     4) ఏదీకాదు

 4.    Rural Infrastructure Develo-pment Fund  ఏర్పాటైన సంవత్సరం?
     1) 1994-95     2) 1995-96
     3) 1996-97     4) 1997-98

 5.    జిల్లా ప్రణాళికా బోర్డు చైర్మన్‌గా వ్యవహరించేది?
     1) ముఖ్యమంత్రి నియమించిన వ్యక్తి
     2) జిల్లా మంత్రి
     3) జిల్లా పరిషత్ చైర్మన్
     4) జిల్లా కలెక్టర్

 6.    అభివృద్ధికి కచ్చితమైన సూచీలుగా వేటిని పరిగణించలేం?
     1) తలసరి ఆదాయం
     2) రాష్ర్ట మొత్తం స్థూల దేశీయోత్పత్తి
     3) 1, 2         4) ఏదీకాదు
 
7.    దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో సుమా రు 20 శాతం వాటా కలిగిన రాష్ట్రాలు?
     1) పంజాబ్, హర్యానా
     2) పంజాబ్, గుజరాత్
     3) హర్యానా, పశ్చిమబెంగాల్
     4) తమిళనాడు, కర్ణాటక
 
8.    తలసరి విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న రాష్ట్రం?
     1) అసోం     2) బీహార్
     3) ఉత్తరప్రదేశ్     4) పైవన్నీ
 
9.    వాణిజ్య బ్యాంకింగ్ రంగ డిపాజిట్లలో తల సరి డిపాజిట్లు తక్కువగా ఉన్న రాష్ట్రం?
     1) బీహార్         2) అసోం
     3) 1, 2          4) ఏదీకాదు
 
10.    {పాంతీయ సమతౌల్య అభివృద్ధిని 3వ ప్రణాళికలో ప్రత్యేకంగా ఏ చాప్టర్‌లో పొందుపరిచారు?
     1) ఐగీ     2) గీ     3) గీఐ    4) గీఐఐ
 
 సమాధానాలు
 1) 3     2) 1     3) 1     4) 2     5) 4
 6) 3     7)1     8) 4     9) 3     10) 1
 

మరిన్ని వార్తలు