డీఎంఆర్‌సీలో 3428 పోస్టులు

28 Sep, 2016 02:47 IST|Sakshi

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా రెండు కేటగిరీల పోస్టులను పొందుపరిచింది. ఒకటి..
 ఎగ్జిక్యూటివ్. రెండు.. నాన్ ఎగ్జిక్యూటివ్.మొదటి కేటగిరీలో 6 రకాల ఉద్యోగాలు,
 రెండో కేటగిరీలో 8 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం మీద స్టేషన్ కంట్రోలర్, కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్, మెయింటెయినర్ పోస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటి వివరాలు..
 
 ఖాళీలు: మొత్తం పోస్టులు 3428 (ఎగ్జిక్యూటివ్-44, నాన్ ఎగ్జిక్యూటివ్-3384)
 1.    ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని ఉద్యోగాలు:
 అసిస్టెంట్ మేనేజర్-44 (ఎలక్ట్రికల్-14, సివిల్-5, ఆపరేషన్స్-5, హెచ్‌ఆర్-3, ఫైనాన్స్-10, ఎస్ అండ్ టీ-7)  
 2.    నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని ఉద్యోగాలు:
 ఎ. స్టేషన్ కంట్రోలర్/ట్రైన్ ఆపరేటర్      (ఎస్సీ/టీవో)-662 (ఓపెన్-376, ఓబీసీ-104, ఎస్సీ-96, ఎస్టీ-86). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-95
 బి. కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్                     (సీఆర్‌ఏ)-1100 (ఓపెన్-556, ఓబీసీ-297, ఎస్సీ-165, ఎస్టీ-82). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-159
 సి. జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-48 (ఓసీ-26, ఓబీసీ-12, ఎస్సీ-7,     ఎస్టీ-3). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-6
 డి. జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్) -81 (ఓసీ-42, ఓబీసీ-21, ఎస్సీ-12, ఎస్టీ-6). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-11
 ఇ. జూనియర్ ఇంజనీర్(మెకానికల్)-10
 ఎఫ్. జూనియర్ ఇంజనీర్(సివిల్)-66 (ఓసీ-33, ఓబీసీ-18, ఎస్సీ-10, ఎస్టీ-5). ఇందులో ఎక్స్‌సర్వీస్‌మెన్-9
 జి. అకౌంట్ అసిస్టెంట్-24
 హెచ్. మెయింటెయినర్-1393 ((ఎలక్ట్రీషియన్-456 (ఓసీ-231, ఓబీసీ-123, ఎస్సీ-68, ఎస్టీ-34); ఫిట్టర్-243 (ఓసీ-134, ఓబీసీ-60, ఎస్సీ-33, ఎస్టీ-
 16); ఎలక్ట్రానిక్ మెకానిక్-
 602 (ఓసీ-327, ఓబీసీ-110, ఎస్సీ-87, ఎస్టీ-78), రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్-92 (ఓసీ-44, ఓబీసీ-22, ఎస్సీ-12, ఎస్టీ-14))
 వేతనం: ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్టులకు నెలకు రూ.20,600-46,500 చెల్లిస్తారు. నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని ఎస్సీ/టీవో పోస్టులకు రూ.13,500-25,520; సీఆర్‌ఏ, అకౌంట్ అసిస్టెంట్లకు రూ.10,170-18,500; జూనియర్ ఇంజనీర్లకు రూ.13,500-25,520; మెయింటెయినర్ పోస్టులకు 8000-14,140 చెల్లిస్తారు.
 
 విద్యార్హత:
 1.అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్/ఎస్ అండ్ టీ/సివిల్) పోస్టులకు 2016లో గేట్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత బ్రాంచ్‌ల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్.
 2.ఎస్సీ/టీవో పోస్టులకు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/తత్సమాన బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా (లేదా) బీఎస్సీ హానర్స్ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్) (లేదా) బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్).
 3.సీఆర్‌ఏలకు మూడేళ్ల/నాలుగేళ్ల డిగ్రీతోపాటు కంప్యూటర్ లిటరసీ (కంప్యూటర్ అప్లికేషన్స్‌లో కనీసం ఆరు వారాల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్సు)
 4.జూనియర్ ఇంజనీర్‌లకు సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో మూడేళ్ల డిప్లొమా
 5.మెయింటెయినర్ పోస్టులకు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ
 
 వయసు:
 (2016 జూలై 1 నాటికి)18-28 ఏళ్లు.
 ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని అన్ని పోస్టులకు, నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోని జూనియర్ ఇంజనీర్లకు మూడు దశల (రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్) ద్వారా ఎంపిక చేస్తారు. ఎస్సీ/టీవో, సీఆర్‌ఏ పోస్టులకు నాలుగు దశల (రాత పరీక్ష, సైకలాజికల్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్) ద్వారా; మిగిలిన పోస్టులకు రెండు దశల (రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్) ద్వారా ఎంపిక చేస్తారు.
 
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి.
 దరఖాస్తు రుసుం: ఓసీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.400; ఇతరులు రూ.150 చెల్లించాలి.
 దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 15.
 వెబ్‌సైట్: www.delhimetrorail.com
 

మరిన్ని వార్తలు