తుది అడుగులు పడాలిలా

15 May, 2014 02:20 IST|Sakshi
తుది అడుగులు పడాలిలా

రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎంసెట్ పరీక్షకు కౌంట్‌డౌన్ మొదలైంది.. మరో వారంలో (మే 22) ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో చివరి దశ సన్నాహాలు ఏ విధంగా ఉండాలి.. ఏయే అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.. తదితర అంశాలపై సబ్జెక్ట్‌ల వారీగా నిపుణుల సూచనలు..
 
 మ్యాథమెటిక్స్
 ఎంసెట్‌లో ప్రశ్నలన్నీ ఇంటర్మీడియెట్ సిలబస్‌లోని ప్రాథమిక భావనల (బేసిక్ కాన్సెప్ట్స్) ఆధారంగా ఉంటాయి.మ్యాథమెటిక్స్ విద్యార్థులు ప్రాక్టీస్, కచ్చితత్వం, సమయపాలనకు ప్రాధాన్యతనివ్వాలి.
 చివరి వారంలో మ్యాట్రిక్స్, డిటర్మినెంట్స్, మ్యాథమెటిక్ ఇండక్షన్, 3-డీ జ్యామెట్రీ, ఇంటిగ్రల్ కాలిక్యులస్, క్వాడ్రేటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, వెక్టర్ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, బైనామిల్ థీరమ్, డిఫరెన్షియల్ కాలిక్యులస్, సర్కిల్స్ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. కాంప్లెక్స్ నంబర్స్ చాప్టర్‌లో మాడ్యుల్స్, అంప్లిట్యూడ్, క్యూబ్ రూట్ ఆఫ్ యునిటీ, ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ సంబంధిత ప్రాబ్లమ్స్ చాలా ముఖ్యమైనవి.
 
 గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. సులభమైన ప్రశ్నలు 75 శాతం వరకు ఉంటున్నాయి. వీటిల్లో 80 శాతం ప్రశ్నలకు కచ్చితత్వంతో సమాధానాలు ఇస్తే మెరుగైన స్కోర్ సాధించవచ్చు. అన్ని కాన్సెప్ట్స్, ఫార్ములా, డెఫినేషన్స్, కీ టర్మ్స్‌పై పట్టు సాధించాలి. పరీక్షలో ఎన్ని ప్రశ్నలు సాధిం చాం కంటే.. కచ్చితత్వంతో ఎన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చామన్నదే ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ప్రశ్నలను చదువుతూ ప్రిపరేషన్ సాగించడం కంటే ప్రాక్టీస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ప్రయోజనకరం. చివరి వారంలో గత ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. గ్రాండ్ టెస్ట్‌లకు హాజరుకావాలి.ఎంసెట్‌ను చివరి గ్రాండ్‌టెస్ట్ మాదిరిగానే భావించాలి. తద్వారా ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షకు హాజరు కావచ్చు.
 -ఎంఎన్ రావు, చైతన్య విద్యా సంస్థలు
 
 ఫిజిక్స్
 ప్రతి అంశంలోని ఫార్ములాలు, ముఖ్యమైన పాయింట్లను సాధ్యమైనన్ని సార్లు పునశ్చరణ చేసుకోవాలి.
 అకడమిక్ పుస్తకాల్లోని మెకానిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయి డ్స్, థర్మోడైనమిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్, న్యూక్లి, కమ్యూనికేషన్స్ తదితర అంశాల్లోని థియరీ ప్రశ్నలపై దృష్టి సారించాలి. క్లిష్టంగా భావించే అంశాలను ప్రాథమిక భావనలాధారంగా నేర్చుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి.
     గత ఐదేళ్ల ఎంసెట్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావాలి.
     న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేసుకోవాలి.
     థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, అటమ్స్, న్యూక్లి, థర్మోడైనమిక్స్, కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఈ అంశాలు కెమిస్ట్రీ ప్రిపరేషన్‌లో కూడా ఉపయోగపడతాయి.
     {పతి అంశానికి సంబంధించిన యూనిట్స్, డెమైన్షన్స్‌పై పూర్తి అవగాహన సాధించాలి.
     పరీక్షలో ఫిజిక్స్‌కు కనీసం గంట 15 నిమిషాల సమయం కేటాయించడం ప్రయోజనకరం.
     పరీక్షలో ఇచ్చే 40ప్రశ్నల్లో 25ప్రశ్నలు సులువుగా, 10 ప్రశ్నలు మధ్యస్తంగా, 5 ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. కాబట్టి మొదటి 35ప్రశ్నలపై దృష్టి సారించడం మంచిది.-పి.కె.ఎస్.రావు, శ్రీ గాయత్రి విద్యా సంస్థలు
 
 కెమిస్ట్రీ
 ఆర్గానిక్ కెమిస్ట్రీ పునశ్చరణకు కేటాయించాలి. ఇందులో ఆల్ నేమ్డ్ రియాక్షన్స్- మెకానిజమ్ (రిగెంట్స్‌తో కలిపి), ఇంటర్‌కన్జర్వేషన్స్, ఆల్కహాల్స్-ఫినోల్స్-కార్బాక్సిలిక్ యాసిడ్స్ ్కఓ్చ విలువలు, ఎమైన్స్ ్కఓఛ విలువలపై దృష్టి సారించాలి.ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రాబ్లమెటిక్ పార్ట్‌కు సంబంధించిన అన్ని ఫార్ములాలపై పట్టు సాధించాలి.ఇనార్గానిక్ కెమిస్ట్రీలో గ్రూప్స్ ప్రాక్టీస్‌లో ట్రెండ్స్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, ఆల్డిహైడ్స్, ఆక్సీహైడ్స్ (ప్రతి గ్రూపులోని)కు ప్రాధాన్యతనివ్వాలి.
 
 బయో మాలిక్యూల్స్, పాలిమర్స్‌కు ఒక రోజు, కెమిస్ట్రీ ఎవ్రీ డే ఇన్ లైఫ్ అంశానికి ఒక రోజు కేటాయించాలి.
 చివరి రెండు రోజుల్లో ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ముఖ్య భావనలను పునశ్చరణ చేసుకోవాలి.
 గత ఎంసెట్ ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావాలి.
 నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని ప్రశ్నలను ప్రయత్నించడం ఉత్తమం.
 -జి.పి. రావు, నారాయణ విద్యా సంస్థలు
 
 బోటనీ
 ప్రభావవంతమైన పునశ్చరణ కోసం కొన్ని చాప్టర్లపై దృష్టి కేంద్రీకరించాలి.
 సిలబస్ పరంగా చూస్తే.. ఎంసెట్‌లో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సిలబస్‌కు సమప్రాధాన్యతనిస్తారు.పునశ్చరణలో ప్రథమ సంవత్సరం చాప్టర్లపై దృష్టి సారించడం ఉపయుక్తం.ఎందుకంటే ఇందులో అడిగే ప్రశ్నలన్నీ నాలెడ్జ్ బే స్డ్‌గా ఉంటాయి. అంతేకాకుండా వీటిని గుర్తు పెట్టుకోవడం తేలిక. దాంతో మంచి స్కోర్ చేయవచ్చు.
 
 ప్రథమ సంవత్సరంలోని మొదటి చాప్టర్ (Biological classification), ఆరో చాప్టర్ (prokaryotic cell), ద్వితీయ సంవత్సరంలోని ఏడు, ఎనిమిది (Microbiology), 14వ చాప్టర్లను (Microbes in human life) క్లబ్ చేసి చదువుకోవాలి. ఇందులోంచి 8,9 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
 తర్వాతి ప్రాధాన్యత ప్రథమ సంవత్సరం నాలుగో చాప్టర్ (Plant kingdom)కు ఇవ్వాలి. దీనికి సమయం ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇందులో పట్టు సాధించడం చాలా కీలకం. తర్వాత ప్రథమ సంవత్సరం 12వ చాప్టర్(Histology and Anatomy), ద్వితీయ సంవత్సరం 10వ చాప్టర్ (Molecular biology)ను ప్రిపేర్ కావాలి. వీటిలోంచి 5 నుంచి 6 ప్రశ్నలు రావచ్చు.
 ప్రథమ సంవత్సరంలోని ఐదు (Morpholog), ఆరు, ఏడు చాప్టర్ల (Reproduction)కు సమయం కేటాయించాలి. ఇవి సులువైనవే కాకుండా ముఖ్యమైనవి కూడా. వీటిలోంచి 5 నుంచి 6 ప్రశ్నలు రావచ్చు.
 
 Cytology, Genetics, Biotechnology అంశాలను ఒకే గ్రూప్‌గా చేసి చదువుకోవడం స్వల్ప కాలంలో ఎక్కువ మొత్తంలోనే ప్రిపేర్ కావచ్చు.ద్వితీయ సంవత్సరంలోని మొదటి యూనిట్ (్కజిడటజీౌౌజడ) నుంచి 5 నుంచి 6 ప్రశ్నలు రావచ్చు. ఇందులో Mineral nutrition చాలా ముఖ్యమైన అంశం.
 చివర్లో ప్రథమ సంవత్సరం 13వ చాప్టర్ (Ecology), ద్వితీయ సంవత్సరంలోని 12వ, 13వ చాప్టర్లను ప్రిపేర్ కావాలి. తద్వారా స్ఫురణకు రాని ముఖ్యమైన అంశాలను జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు.
 -బి. రాజేంద్ర,
 సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
 
 జువాలజీ
 జంతు శాస్త్రం ప్రథమ సంవత్సరంలో యూనిట్ల వారీగా వచ్చే ప్రశ్నలు ఇలా ఉండొచ్చు. యూనిట్-1(2), యూనిట్-2(2 లేదా 3), యూనిట్-3(2), యూనిట్-4(2),యూనిట్ -5(2), యూనిట్-6(2 లేదా 4), యూనిట్ -7(2 లేదా 4), యూనిట్ -8(2 లేదా 4).
 
 జంతు వైవిధ్యం-1, 2లలో ప్రతి సముదాయంలోని ముఖ్యమైన పదాలపై దృష్టి సారించాలి. ఉదాహరణ-తరాల ఏకాంతరత, లాసో కణాలు, రాబ్డయిట్లు, బోత్రిడియం, రెనిట్ గ్రంథులు, సిర్రస్, నేథోఖైలేరియం, రాడ్యాలా, స్ఫటిక శంఖువు, అరిస్టాటిల్ లాంతరు, సంపర్క దండాలు, కర్ణ స్థంభిక, సంయుక్త త్రికం, ద్రోణి, హలాస్థి, విష్‌బోన్ వంటివి.
 
     వివిధ సముదాయాలకు చెందిన డింభకాలను నేర్చుకోవాలి.
     వానపాము, బొద్దింక నిర్మాణ వ్యవస్థలను తులనాత్మకంగా అధ్యయనం చేయాలి.
     మిధ్యాపాదాలు, కశాభాలు, ద్విదావిచ్ఛితిలో జరిగే దశలు వంటి వాటిపై దృష్టి సారించాలి.
     జీవావరణ శాస్త్రంలోని కాంతి, ఉష్ణోగ్రత ప్రభావాలు, సరస్సు, జీవావరణ వ్యవస్థ, ఆహార గొలుసులు, జీవావరణ పిరమిడ్లు, శక్తి ప్రసరణ, షోషక వ లయాలు, జనాభా వంటి అంశాలపై దృష్టి సారించాలి.
 
 పర్యావరణ అంశాల నుంచి ఒక ప్రశ్న రావచ్చు.ద్వితీయ సంవత్సరంలో మానవ వ్యవస్థలు మొత్తం ఐదు యూనిట్లలో 10 వ్యవస్థలను ప్రస్తావించారు. వీటి నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు రావచ్చు. ఇదే క్రమంలో జన్యుశాస్త్రం-3, జీవపరిణామం- 2 లేదా 3, జీవ పరిణామం- 2 లేదా3, అనువర్తిత జీవశాస్త్రం-3 ప్రశ్నలు అడగొచ్చు.మానవుని వ్యవస్థలలో వివిధ డిసార్డర్స్‌ను నేర్చుకోవాలి. వివిధ పాఠ్యాంశాలలోని పటాలను క్షుణ్నంగా పరిశీలించాలి. ఉదాహరణ-ఆక్సీ హీమోగ్లోబిన్ వియోజిత వక్రరేఖ, నాడీ ప్రచోదనం, ఈసీజీ, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పెడిగ్రి చార్ట్ వంటివి.
 -కె.శ్రీనివాసులు,
 చైతన్య విద్యా సంస్థలు.
 
 జనరల్ టిప్స్
 ఎంసెట్‌లో 50 నుంచి 60 శాతం ప్రశ్నలు ఇంటర్మీడియెట్‌లో అకడెమిక్స్‌పై పట్టు ఉన్న విద్యార్థులందరూ సమాధానం ఇచ్చే విధంగానే ఉంటున్నాయి. 20 నుంచి 30 శాతం ప్రశ్నలు ఓ మోస్తరు క్లిష్టతతో, మరో 20 నుంచి 30 శాతం ప్రశ్నలు అత్యంత క్లిష్టంగా ఉంటున్నాయి. ర్యాంకుల నిర్ధారణ అత్యంత క్లిష్టంగా ఉండే 20 నుంచి 30 శాతం ప్రశ్నలే కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి విద్యార్థులు ఈ దిశగా దృష్టి సారించి ప్రిపరేషన్ సాగించాలి. అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్స్ ఆధారిత ప్రశ్నల ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి.ముఖ్యమైన ఫార్ములాలను, కాన్సెప్ట్‌లను నోట్స్ రూపంలో పొందుపర్చుకుంటే రివిజన్ సులభంగా పూర్తి చేసుకోవచ్చు.ప్రతి విభాగానికి సంబంధించి అభ్యర్థులు తమకు అనుకూలమైన రీతిలో షార్ట్‌కట్ మెథడ్స్‌తో సొంత నోట్స్ రూపొందించుకోవాలి.ఏ సబ్జెక్ట్ అయినా.. ప్రస్తుత సమయంలో కొత్త అంశాల జోలికి వెళ్లకూడదు. దీని వల్ల సమయం వృథా అవడంతోపాటు మానసిక ఆందోళనకు గురవుతారు.పరీక్ష తేదీకి వారం రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి.
 

మరిన్ని వార్తలు