ఎడ్యు న్యూస్

7 May, 2016 02:28 IST|Sakshi

ఆర్‌జీయూకేటీ నూజివీడులో ఎంటెక్ ప్రోగ్రామ్
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) - నూజివీడు.. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
 అర్హతలు: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్), ఇంటర్, పదోతరగతి ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 55 శాతం మార్కులు ఉండాలి.

ఆర్‌జీయూకేటీ - నూజివీడు నిర్వహించే ఏడు వారాల ‘ఇంట్రడక్టరీ కోర్సు ఇన్ కంప్యూటింగ్’లో 80 శాతంతో ఉత్తీర్ణత తప్పనిసరి.
గేట్ 2015/16లో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ. 200  (ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150) డీడీ రూపంలో చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా (పూర్తిచేసిన దరఖాస్తును ప్రింట్ తీసి, ఒరిజనల్ డీడీ కాపీని జతచేసి ఆర్‌జీయూకేటీ-నూజివీడుకు పోస్ట్ ద్వారా పంపాలి)
ఎంపిక విధానం: మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: మే 23, 2016
ప్రింట్ తీసిన దరఖాస్తును పంపేందుకు చివరి తేదీ: మే 30, 2016
 వెబ్‌సైట్: www.rguktnuz.in

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు