ఉద్యోగ సమాచారం

4 Nov, 2015 00:45 IST|Sakshi

బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు
 భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్).. వికలాంగులకు రిజర్‌‌వ చేసిన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 34 (ట్రైనీ ఇంజనీర్-24, ట్రైనీ ఎగ్జిక్యూటివ్-10). దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 26. పూర్తి వివరాలకు http://careers.bhel.in/bhel చూడొచ్చు.

 రక్షణ శాఖలో గ్రూప్-సీ పోస్టులు
 రక్షణ శాఖలోని సికింద్రాబాద్ కమాండెంట్, 60 కోయ్ ఏఎస్‌సీ (ఎస్‌యూపీ) టైప్ ‘జి’.. గ్రూప్-సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు.. 17 (చౌకిదార్-4, లేబర్-13). దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 30. పూర్తి వివరాలకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (అక్టోబర్ 31-నవంబర్ 6 సంచికలోని 16వ పేజీ) చూడొచ్చు.    

 ఈఎస్‌ఐ ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్లు
 హైదరాబాద్‌లోని నాచారం ఈఎస్‌ఐ మోడల్ హాస్పిటల్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 8. ఇందులో 2 పోస్టులు వికలాంగులకు రిజర్‌‌వ చేసిన బ్యాక్‌లాగ్ ఖాళీలు. మిగిలిన 6 పోస్టులకు జనరల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 23. పూర్తి వివరాలకు http://esic.nic.in చూడొచ్చు.     
              
 తమిళనాడులో డ్రాటింగ్ ఆఫీసర్లు
 తమిళనాడులోని రహదారుల విభాగం.. జూనియర్ డ్రాటింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 188. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసినవారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 18. పూర్తి వివరాలకు www.tnhighways.gov.in చూడొచ్చు.

 బీడీ శర్మ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో హౌజ్ సర్జన్లు
 రోహ్‌తక్(హర్యానా)లోని పండిట్ బీడీ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్.. సీనియర్/ జూనియర్ హౌజ్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 87. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 8. పూర్తి వివరాలకు http://uhsr.ac.in చూడొచ్చు.

 మారిటైం వర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్లు
 ఇండియన్ మారిటైం వర్సిటీ.. డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ /డిప్యుటేషన్/ప్రమోషన్ ప్రాతిపదికన అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13 (అసిస్టెంట్ రిజిస్ట్రార్-7, ఫైనాన్‌‌స అసిస్టెంట్ రిజిస్ట్రార్-6). ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 18. పూర్తి వివరాలకు www.imu.edu.in చూడొచ్చు.  

 ఐసీఎంఆర్‌లో వివిధ పోస్టులు
 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్‌‌చ (ఐసీఎంఆర్).. వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖాళీలు 6 (రీసెర్‌‌చ సైంటిస్ట్-1, రీసెర్‌‌చ అసోసియేట్-2, టెక్నికల్ అసిస్టెంట్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్-2). మొదటి రెండు పోస్టులకు నవంబర్ 16న, తర్వాతి రెండు పోస్టులకు 17న ఇంటర్వ్యూలు జరుగు తాయి. పూర్తి వివరాలకు www.icmr.nic.in/icmrnews/MPD_Ad. pdf  చూడొచ్చు.  

 ‘ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్’లో అసిస్టెంట్లు  
 నోయిడాలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 17. పూర్తి వివరాలకు http://iwai.nic.in చూడొచ్చు.

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా