సాక్షి జర్నలిజంలో పీజీ డిప్లొమా.. ప్రవేశం

23 Mar, 2015 00:32 IST|Sakshi
సాక్షి జర్నలిజంలో పీజీ డిప్లొమా.. ప్రవేశం

జర్నలిజంలో ఉజ్వల భవిత కోసం  ఎదురు చూస్తున్న ఔత్సాహిక యువతకు  ‘సాక్షి’ స్వాగతం పలుకుతోంది.  పాత్రికేయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి  సదవకాశం కల్పిస్తోంది. జర్నలిజంలో  పీజీ డిప్లొమా ప్రవేశాలకు తాజాగా  సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం (ఎస్‌ఎస్‌జే).

నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు..
 అర్హతలు:
     తెలుగు మీద పట్టు
     ఆంగ్లంపై అవగాహన
     డిగ్రీ ఉత్తీర్ణత (గతేడాదికి డిగ్రీ పూర్తిచేసి, సర్టిఫికెట్లు ఉన్నవారే అర్హులు)
     01-08-2015 నాటికి 25 ఏళ్లకు మించని వయసు.
 
 ఎంపిక విధానం:
 అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో 2 రాతపరీక్షలు ఉంటాయి. మొదటి పేపర్లో తెలుగు, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్‌‌సపై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు; రెండో పేపర్లో తెలుగు, ఇంగ్లిష్ పరిజ్ఞానం, అనువాదం, కరెంట్ అఫైర్‌‌సపై వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని సాక్షి ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. నమూనా ప్రశ్నపత్రాలు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్లలో ఉంటాయి. మొదటి దశలో ఉత్తీర్ణులైనవారికి బృందచర్చ, మౌఖిక పరీక్ష ఉంటాయి. ఇందులోనూ ఉత్తీర్ణులైన వారిని శిక్షణ కోసం ఎంపిక చేస్తారు.
 
 నియమావళి:
 అభ్యర్థులు శిక్షణ కాలంతోపాటు సాక్షిలో నాలుగేళ్లు పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రం (బాండ్ అగ్రిమెంట్) ఇవ్వాలి.
 
 శిక్షణ:
 అర్హత సాధించిన అభ్యర్థులు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఇందులో పత్రికలో పనిచేయడానికి అవసరమైన తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యాలు, ఎడిటింగ్, రిపోర్టింగ్, అనువాదం, వర్తమాన వ్యవహారాలు నేర్పిస్తారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, భూగోళశాస్త్రం మొదలైన వాటిపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు.
 
 శిక్షణ భృతి:
 జర్నలిజం స్కూలులో చేరిన విద్యార్థులకు మొదటి ఆరు నెలలు రూ.8,000, తరవాతి ఆరునెలలు రూ.10,000 నెలవారీ భృతి ఉంటుంది. అనంతరం సంస్థలో ఏడాదిపాటు ట్రెయినీగా పనిచేయాలి. అప్పుడు సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు ఉంటాయి. సాక్షి ప్రచురణ కేంద్రాల్లో, కార్యక్షేత్రాల్లో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి.
 
 దరఖాస్తు విధానం:
 www.sakshieducation.com,
 www.sakshischoolofjournalism.com
 వెబ్‌సైట్లలో దరఖాస్తులు ఉంటాయి. అందులోని సూచనలు క్షుణ్నంగా చదివి, దరఖాస్తును ఆన్‌ైలైన్‌లోనే పూర్తిచేసి, సబ్‌మిట్ చేయాలి. ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని సాక్షి జర్నలిజం స్కూలు చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.
 ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపే సమయంలోనే రూ. 200 ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డుల్లో దేంతోనైనా చేయొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఒక యునిక్ నంబర్ వస్తుంది. దాన్ని వేసి, దరఖాస్తు నింపే ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నంబరు వస్తుంది. ఆ నంబరు సాయంతో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
 ముఖ్య తేదీలు:
     దరఖాస్తు చేయడానికి గడువు: 10-04-2015
     రాతపరీక్ష: 19-04-2015
     ఫలితాలు: 11-05-2015
     ఇంటర్వ్యూలు: 18-05-2015 నుంచి
     తరగతులు ప్రారంభం: 01-06-2015
 
 చిరునామా:
 ప్రిన్సిపల్,
 సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం,
 సితారా గ్రాండ్ హోటల్ పక్కన,
 రోడ్ నంబర్- 12, బంజారాహిల్స్,
 హైదరాబాద్- 500034
 ఫోన్: 040 23386945
 సమయం: ఉ.10 గం. నుంచి సా. 5 గం. వరకు
 (సెలవులు, ఆదివారాలు మినహా)

మరిన్ని వార్తలు