ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ @ moocs

30 Aug, 2016 03:12 IST|Sakshi
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ @ moocs

నేడు చాలా మంది యువత వినూత్న ఆలోచనలతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలని కలలు కంటున్నారు. కానీ వారికి తాజా మార్కెట్ పరిస్థితులు, వినియోగదారుల అభిరుచులు, ఫండింగ్, మార్కెటింగ్, ప్రొడక్ట్ ప్రమోషన్ తదితర అంశాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆచరణలో విఫలమవుతున్నారు. ఇలాంటి వారికి మిట్,
 
 స్టాన్‌ఫోర్డ్, ప్రిన్స్‌టన్ తదితర ప్రతిష్టాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలు మాసివ్ లీ ఓపెన్ ఆన్‌లైన్
 కోర్సులు (మూక్స్) ద్వారా ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ నైపుణ్యాలను అందిస్తూ దిశానిర్దేశం చేస్తున్నాయి.
 ఈ క్రమంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విజయంలో మూక్స్ పాత్రపై ఫోకస్..

 
 జ్ఞాన సముపార్జనకు మార్గం
 కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టా లనుకునే ఔత్సాహికులు, భవిష్యత్తులో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా వెళ్లాలనుకునే విద్యార్థులు మూక్స్ సహాయంతో ఆయా రంగాల్లోని నిష్ణాతుల అనుభవాలు, ఆలోచనల ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ నిపుణుల ఉపన్యాసాలు, వ్యాపార మెళకువలు, విజయ రహస్యాలు, మార్కెట్ సరళి, సలహాలు, సూచనలను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే వెసులుబాటును మూక్స్ కల్పిస్తున్నాయి. టెక్నాలజీ రంగంలో ఆవిష్కరణలు చేయాలనుకునే ఔత్సాహికులు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అందించే ‘ఇంట్రడక్షన్ టు ది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్’ వంటి  మూక్స్ కోర్సులను చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయి థియరిటికల్, ప్రాక్టికల్ నైపుణ్యాలు పొందొచ్చు.
 
 ఐడియా టు వ్యాపారం
 మెదడులో చిగురించిన ఒక ఆలోచనను వ్యాపారంగా మార్చే విధానం, ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలు, మార్కెట్ విశ్లేషణ, మౌలిక వ్యాపార సూత్రాలు తదితర విషయాలపై పరిజ్ఞానాన్ని మూక్స్ అందిస్తాయి. వ్యాపార ప్రారంభం నుంచి ప్రొడక్ట్ మేకింగ్, మార్కెటింగ్, ప్రమోషన్, ప్రైస్, ప్లేస్, కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ..  ఇలా ప్రతి విషయంలో కొత్త పంథాను అనుసరించేలా మూక్స్ ఆలోచనలు రేకెత్తిస్తాయి. నేటి పోటీ ప్రపంచంలో నెగ్గుకురావడానికి, ఇతరుల కంటే భిన్నమైన ప్రొడక్ట్ తయారు చేయడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఉదాహరణకు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అందించే మూక్స్.. ‘డెవలపింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఫర్ న్యూ కంపెనీస్’, అలాగే  యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అందించే మూక్స్..‘ఎసెన్షియల్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్: థింకింగ్ అండ్ యాక్షన్’.. సృజనాత్మకత, వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పిస్తుంది.
 
 పెట్టుబడి మార్గాలు
 వ్యాపారానికి మూలమైన పెట్టుబడి మార్గాలు అంటే.. ఫండింగ్ ఏజెన్సీలతో సంప్రదింపులు, వారిని ఒప్పించడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలు, వ్యాపార లావాదేవీలు, వ్యాపార భాగస్వాములను ఎన్నుకోవడం, నష్టాలను తట్టుకోవడం, ఫైనాన్షియల్ ప్లానింగ్ వంటి ఆర్థిక అంశాలపై మూక్స్ ద్వారా అవగాహన పొందొచ్చు. వ్యాపారం ప్రారంభించే ముందు పాటించాల్సిన రిజిస్ట్రేషన్ పద్ధతులు, దేశాల వారీగా అమల్లో ఉన్న ప్రభుత్వ నిబంధనలు, రాయితీలు, డిపాజిట్స్, అగ్రిమెంట్స్, అవగాహన ఒప్పందాలపై ముందస్తు అవగాహన ఏర్పరచుకోవచ్చు. అంతేకాకుండా సంస్థను న్యాయబద్ధంగా నడిపేందుకు ఇవి దోహదపడతాయి.
 
 విస్తరణ- నిర్వహణ నైపుణ్యాలు
 వ్యాపార విస్తరణకు అనువైన ప్రదేశాలు, అనుసరించాల్సిన ప్రణాళికలు, వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర రంగాల్లో ఉన్న అవకాశాలు, కొత్త టెక్నాలజీలు, కంపెనీ ఎదుగుదలకు ఇతరులు అనుసరిస్తున్న మార్గాలు మూక్స్ వల్ల తెలుస్తాయి. సంస్థ, వ్యాపార నిర్వహణలో కీలక పాత్ర పోషించే కస్టమర్ రిలేషన్స్, టీం రిలేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇతర రంగాలతో సత్సంబంధాలు నెరపడం వంటి ఆర్గనైజింగ్ స్కిల్స్ మూక్స్ ద్వారా ప్రముఖుల నుంచి నేర్చుకునే అవకాశం కలుగుతుంది.
 
 ఆన్‌లైన్ బిజినెస్
 ఆన్‌లైన్ వ్యాపారం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మూక్స్ ద్వారా ఆన్‌లై న్ బిజినెస్ ట్రెండ్స్, ప్లాన్స్, ఆన్‌లైన్ ప్రమోషన్, కస్టమర్ ఫీడ్ బ్యాక్, పోటీ సంస్థల వివరాలు తెలుసుకొని ప్రస్తుత పరిస్థితుల కు అనుగుణంగా సంస్థను అభివృద్ధి చేయడం తో పాటు త్వరితగతిన వినియోగదారులకు చేరువ కావచ్చు.
 
 ప్రముఖ సంస్థలు - మూక్స్ కోర్సులు.
 

మరిన్ని వార్తలు