ఫెలోషిప్

8 Aug, 2014 22:07 IST|Sakshi

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్‌ఆర్డీ ఫెలోషిప్‌లు అందజేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
హెచ్‌ఆర్‌డీ ఫెలోషిప్ (లాంగ్‌టెర్మ్)
విభాగాలు: టాక్సికాలజీ, జీనోమిక్స్, జరియాట్రిక్స్,స్టెమ్‌సెల్ రీసెర్చ్, క్లినికల్ ట్రైల్స్, డిసీజ్ మోడలింగ్, ఎన్విరాన్‌మెంటల్ హెల్త్, మెంటల్ హెల్త్, క్లినికల్ సైకాలజీ, క్వాలిటీ కంట్రోల్, మోడరన్ బయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, డ్రగ్ కెమిస్ట్రీ, ఆపరేషనల్ రీసెర్చ్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, మెడికల్ ఎథిక్స్, హెల్త్ ఎకనమిక్స్.
వ్యవధి: విభాగాన్ని బట్టి ఆరు మాసాల నుంచి ఏడాది వరకు.
ఫెలోషిప్: పనిచేస్తున్న సంస్థలోనే పరిశోధన కొనసాగించేవారికి నెలకు రూ.20,000; ఇతర సంస్థల్లో పరిశోధన చేసేవారికి నెలకు రూ.40,000 అందజేస్తారు. కంటిన్‌జెన్సీ ఫండ్, ట్రావెల్ అలవెన్స్ అదనం.
అర్హత: ఎండీ/ ఎమ్మెస్/ ఎండీఎస్/ ఎంబీబీఎస్/ఎంవీఎస్సీ/ ఎమ్మెస్సీ/ ఎంఫార్మసీ/ ఎంటెక్‌తోపాటు సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉండాలి. జాతీయ, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు/ పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్త/ హెల్త్ రీసెర్చర్‌గా పనిచేస్తూ ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఆగస్టు 20
వెబ్‌సైట్: www.icmr.nic.in

మరిన్ని వార్తలు