జీమ్యాట్ పరీక్ష వివరాలు...

9 Oct, 2014 02:38 IST|Sakshi
జీమ్యాట్ పరీక్ష వివరాలు...

ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేయాలని ఉంది. వివరాలు తెలపండి?
 నాగార్జున, కరీంనగర్.
 
 కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఏటా నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ (సీజీఎల్‌ఈ) ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్ హోదాలో ప్రవేశించవచ్చు. సెంట్రల్ ఎక్సైజ్/ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్‌లలో ఇన్‌స్పెక్టర్/ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులను కూడా ఈ పరీక్ష ద్వారానే భర్తీ చేస్తారు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ.కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ (సీజీఎల్‌ఈ) టైర్-1, టైర్-2, ఇంటర్వ్యూ అనే మూడు దశలతో ఉంటుంది. టైర్-1, 2 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉండే రాత పరీక్షలు. ఇందులో క్వాలిఫై అయినవారు తర్వాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాలి.
 
 టైర్-1 రాత పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. సమయం రెండు గంటలు. నాలుగు విభాగాలుగా ఉంటుంది. అవి.. జనరల్ ఇంటెలిజెన్స్ (50 మార్కులు); జనరల్ అవేర్‌నెస్ (50 మార్కులు); న్యూమరికల్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు); ఇంగ్లిష్ కాంప్రహెన్షన్(50 మార్కులు); ఈ దశలో క్వాలిఫై అయినవారిని మాత్రమే టైర్-2కు అనుమతిస్తారు.టైర్-2 పరీక్షకు 400 మార్కులు కేటాయించారు. రెండు విభాగాలుగా ఉంటుంది. అవి.. అర్థమెటిక్ ఎబిలిటీస్(200 మార్కులు-సమయం రెండు గంటలు); ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ (200 మార్కులు-సమయం రెండుగంటలు); చివరి దశ ఇంటర్వ్యూ. వివరాలకు: http://ssc.nic.in
 
 మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయగలరు?
 -శ్రీధర్, ఆదిలాబాద్.
  నివాస భవంతులు, అపార్టుమెంట్లు, విల్లాలు, షాపింగ్‌మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు.. వంటి నిర్మాణాల రూపకల్పనకు సంబంధించిన అంశాలను ఆర్కిటెక్చర్.. శాస్త్రీ య కోణంలో వివరిస్తుంది. వివిధ సంస్థలు ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్, మాస్టర్స్, పరిశోధన స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్; ఇండస్ట్రియల్ డిజైన్;అర్బన్ డిజైన్;ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్; బిల్డింగ్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లతో ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ కోర్సు(ఎంఆర్క్)అందుబాటులో ఉంది. ఎంఆర్క్‌ను ఆఫర్ చేస్తున్న సంస్థలు:జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్.. కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, కన్జర్వేషన్ ప్లానింగ్, ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌లతో ఎంఆర్క్‌ను ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్‌సైట్: http://jnafau.ac.in
 
 స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూఢిల్లీ.. ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, అర్బన్ డిజైన్ స్పెషలైజేషన్లతో మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఆర్క్/ బి.ప్లానింగ్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. మియా మిలియా ఇస్లామియా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఎకిస్టిక్స్, న్యూఢిల్లీ.. మెడికల్ ఆర్కిటెక్చర్, బిల్డింగ్ సర్వీసెస్ రిక్రియేషనల్ అండ్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లతో ఎంఆర్క్‌ను అందిస్తోంది. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: www.jmi.ac.in
 సీఈపీటీ యూనివర్సిటీ, అహ్మదాబాద్.. థియరీ అండ్ డిజైన్ స్పెషలైజేషన్‌తో ఎంఆర్క్‌ను ఆఫర్ చేస్తోంది. డిజైన్ పోర్ట్‌ఫోలియో ఎవల్యూషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.  జీమ్యాట్ పరీక్ష వివరాలను తెలియజేయండి? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రవేశ విధానాన్ని వివరించండి?    -స్వాతి, కొత్తగూడెం.

 దేశంతోపాటు విదేశాల్లోని బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశానికి దోహదం చేసే పరీక్ష జీమ్యాట్.. ది గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్. ఈ పరీక్షను గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీమ్యాక్) నిర్వహిస్తుంది. ఈ స్కోర్ ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. జీమ్యాట్‌ను అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్ స్కిల్స్ విభాగాల్లో నిర్వహిస్తారు. వ్యాపారానికి సంబంధించిన అవగాహన, జాబ్ స్కిల్స్, ఎటువంటి అకడమిక్ అంశాలపై కాకుండా.. అప్పటి వరకు విద్యార్థి పెంపొందించుకున్న నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఈ పరీక్ష ఉంటుంది. జీమ్యాట్ అధికారిక వెబ్‌సైట్ పరీక్ష తేదీలు, టెస్టింగ్ సెంటర్, రిజిస్ట్రేషన్ తదితర వివరాలను పొందొచ్చు.
 
 వివరాలకు: www.mba.com
 ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)కు హైదరాబాద్, మొహాలీ(పంజాబ్)లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఐఎస్‌బీ.. షార్ట్ టర్మ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (పీజీపీ) ఇన్ మేనేజ్‌మెంట్, డాక్టోరల్ డిగ్రీతో సమానమైన ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోషిప్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల కోసం యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తుంది. పీజీపీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, స్ట్రాటజీ అండ్ లీడర్‌షిప్ వంటి ఎలక్టివ్స్ ఉన్నాయి. ప్రతి కోర్సుకు భిన్నమైన ప్రవేశార్హతలు నిర్దేశించింది ఐఎస్‌బీ. సాధారణంగా జీమ్యాట్ స్కోర్, మేనేజీరియల్ అనుభవం, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలాధారంగా ప్రవేశం ఉంటుంది.
 వివరాలకు: www.isb.edu
 
 సీజీఎల్ అండ్ సీహెచ్‌ఎస్‌ఎల్ ప్రాక్టీస్ టెస్ట్స్
 హైదరాబాద్: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ బి, సి, లోయర్ డివిజన్ క్లర్క్, డాటాఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి 2014 అక్టోబర్ 19, 26, నవంబర్ 2, 9 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు సులువుగా ప్రాక్టీస్ చేసుకునేందకు వీలుగా సాక్షి సాధనలు వివరణలతో కూడిన ఆన్‌లైన్ (ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరగవు) మోడల్ టెస్ట్‌లను రూపొందించింది.

 మోడల్ టెస్ట్స్ ప్రత్యేకతలు:
 అన్ని ప్రశ్నలకు సాధనలు, వివరణలతో కూడిన 6 గ్రాండ్ టెస్ట్‌లు
 డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా ‘కీ’తో కూడిన 10 మోడల్ పేపర్లు
 ఎప్పుడైనా, ఎన్ని సార్లైనా పరీక్ష రాసుకునే సౌలభ్యం
 పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడులతో కూడిన ఫలితాలు
 అభ్యర్థి ప్రదర్శనను తెలిపే గ్రాఫికల్ ఫర్‌ఫార్మెన్స్ రిపోర్టుతో పాటు సబ్జెక్టుల వారీ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియా అనాలసిస్
     వెబ్‌సైట్:
     http://onlinetests.sakshieducation.com
     http://www.sakshieducation.com/
     SSC/Index.html
 

మరిన్ని వార్తలు