సర్కారీ కొలువులు సరైన సన్నద్ధత!

13 Aug, 2015 01:58 IST|Sakshi
సర్కారీ కొలువులు సరైన సన్నద్ధత!

 తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 15 వేలకు పైగాఖాళీల భర్తీకి జీవో జారీచేసింది.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 తదితర పరీక్షలకు  సంబంధించి ‘స్కీం ఆఫ్ ఎగ్జామినేషన్’ పేరుతో విధివిధానాలను విడుదల చేసింది.. పోలీస్ డిపార్టుమెంట్, ట్రాన్స్‌కో ప్రత్యేకంగా  నిర్వహించే పరీక్షల వివరాలు ఇంకా విడుదల కాలేదు.. ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగార్థులు ప్రిపరేషన్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. అయితే ఉద్యోగం ఏదైనా, పరీక్ష మరేదైనా ఉమ్మడిగా జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇందులో సాధించిన మార్కులు ఎంపికలో  కీలకపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో పరీక్షల విధివిధానాలు, జీఎస్ పేపర్‌పై స్పెషల్ ఫోకస్...
 
 టీఎస్‌పీఎస్‌సీ పరిధిలో ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, జీహెచ్‌ఎంసీ, పీఆర్ అండ్ ఆర్‌డీ, ఆర్ అండ్ బీ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగాలకు విడివిడిగా పరీక్ష విధానాలను వెల్లడించకున్నా, స్థూలంగా అవగాహన పెంపొందించేలా స్కీం ఆఫ్ ఎగ్జామినేషన్‌ను ప్రభుత్వం ప్రకటించింది.

 పేపరు    సబ్జెక్టు    ప్రశ్నలు    మార్కులు    సమయం
 1జనరల్ స్టడీస్    150    150    150 నిమిషాలు
 2సంబంధిత సబ్జెక్టు    150    300    150 నిమిషాలు
 మొత్తం        300    450
 ఇంటర్వ్యూ        50
 
 ఇది గెజిటెడ్ హోదాలో ఉండి, గ్రూప్-1, గ్రూప్-2 పరిధిలోకి రాని ఇతర పరీక్షలకు సంబంధించిన విధానంగా పేర్కొంది.
 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు:
 గ్రూప్-1, గ్రూప్-2 పరిధిలోకి రాని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష విధానం...
 పేపరు    సబ్జెక్టు    ప్రశ్నలు    మార్కులు    సమయం
 1జనరల్ స్టడీస్    150    150    150 నిమిషాలు
 2సంబంధిత సబ్జెక్ట్    150    150    150 నిమిషాలు
 
 బీటెక్ అర్హతతో నిర్వహించే గెజిటెడ్ హోదా ఉద్యోగ పరీక్షలు, డిప్లొమా అర్హతతో నిర్వహించే నాన్ గెజిటెడ్ హోదా పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్ 150 మార్కులకు ఉంటుంది. ఇందులో బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి.
 
 టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీచేసే ఇంజనీరింగ్ ఉద్యోగాలు:
 విభాగం    ఉద్యోగం    ఖాళీలు
 ఐఅండ్‌సీఏడీ    ఏఈ    252
 ఏఈఈ    159
 ఎంఏ అండ్ యూడీ    ఏఈ    389
 ఏఈఈ    126
 జీహెచ్‌ఎంసీ    ఇంజనీరింగ్ మేనేజర్    146
 పీఆర్ అండ్ ఆర్‌డీ    ఏఈ    243
 ఏఈఈ    161
 టీఆర్ అండ్ బీ    ఏఈ    243
 ఏఈఈ    83
 
 పోలీస్ డిపార్ట్‌మెంటు
  పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 539 ఎస్‌ఐ, 8009 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. వీటితోపాటు అగ్నిమాపక శాఖలోని ఫైర్‌మెన్ (6), స్టేషన్ ఫైర్ ఆపరేటర్ (9), డ్రైవర్ ఆపరేటర్ (85) ఉద్యోగాలను కూడా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రత్యేక పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది. {పభుత్వం ప్రకటించిన ఉద్యోగాల్లో అత్యధికం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పరీక్షల విధివిధానాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణుల అంచనా.
 
 పీఆర్‌బీ పరీక్షల్లో అనుసరిస్తున్న విధానం..
 సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ):
 అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
 పేపరు    మార్కులు
 ఇంగ్లిష్    100
 తెలుగు    100
 అర్థమెటిక్ అండ్ రీజనింగ్    200
 జనరల్ స్టడీస్    200
 ఇంగ్లిష్, తెలుగు అర్హత పేపర్లు
 కానిస్టేబుల్ రాత పరీక్ష:
ఇప్పటి వరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత అర్హతగా ఉంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఇంటర్మీడియెట్ పాస్/ఫెయిల్ అర్హతగా నిర్దేశించారు.
 కానిస్టేబుల్ రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్‌కు 100 మార్కులు కేటాయించారు. ఇంగ్లిష్‌కు 30 మార్కులు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌కు 70 మార్కులు ఉంటాయి.
 
 ట్రాన్స్‌కో, జెన్‌కో
  ప్రభుత్వం టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ జెన్‌కోలకు సంబంధించి 2,681 ఖాళీలు ప్రకటించింది. వీటిలో డిప్లొమా, బీటెక్ అర్హతలుగా ఉండే సబ్ ఇంజనీర్, అసిస్టెంటు ఇంజనీర్ ఉద్యోగాలున్నాయి. వీటికి సంబంధించిన పరీక్షల పూర్తి విధివిధానాలు స్పష్టం కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో 100 మార్కులకు నిర్వహించిన ఏఈ పరీక్షలో 70 మార్కులు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్‌కు, 30 మార్కులు అర్థమెటిక్, రీజనింగ్ విభాగాలకు ఉండేవి. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహించే తొలి పరీక్షలో సిలబస్‌లో మార్పులు జరిగే అవకాశముంది. జీఎస్‌లో తెలంగాణ ప్రాంత అంశాలకు వెయిటేజీ ఇచ్చే అవకాశముందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
 
 ట్రాన్స్‌కో, జెన్‌కో-ఖాళీలు:
 విభాగం    ఉద్యోగం    ఖాళీలు
 టీఎస్ జెన్‌కో    ఏఈ    988
 ఏఈఈ    92
 టీఎస్‌ఎన్‌పీడీసీఎల్    ఏఈ    309
 ఎస్‌ఈ    314
 టీఎస్‌ఎస్‌పీడీసీఎల్    ఏఈ    427
 ఎస్‌ఈ    153
 ట్రాన్స్‌కో    ఏఈ    224
 ఎస్‌ఈ    174
 
 ప్రిపరేషన్
  ఏ ఉద్యోగ నియామక పరీక్ష అయినా అందులో తప్పనిసరిగా జనరల్ స్టడీస్ పేపరు ఉంటుంది. ఇందులో అత్యధిక మార్కులు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరగనున్న పరీక్షలు కాబట్టి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీల్లోని అంశాలపై విశ్లేషణాత్మక అవగాహన అవసరం. తెలంగాణ ప్రాంత పరిస్థితులకు ప్రాధాన్యతనిస్తూ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ కొనసాగించాలి.
 
 సూచనలు:
 చరిత్ర అంశాలు చదివేటప్పుడు భారతదేశ చరిత్రతోపాటు, తెలంగాణ ప్రాంత చరిత్రలోని ముఖ్య అంశాలుగా పేర్కొనే శాతవాహనులు, కాకతీయులు తదితర రాజవంశాల కాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పాలిటీకి సంబంధించిన అంశాలను చదివేటప్పుడు జాతీయ స్థాయిలో రాజ్యాంగం, సవరణలు, రాజ్యాంగ సంస్థలు-వాటి విధుల గురించి తెలుసుకోవాలి. ఈ విభాగం నుంచి తెలంగాణ ప్రత్యేకంగా ఉండే అంశాలు తక్కువే అయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమైన సంస్థల ఏర్పాటు, అదే విధంగా ఉమ్మడి సంస్థల విభజన- పరిపాలన పరంగా ఉన్న అధికారాలు వంటి వాటిపై దృష్టిసారించాలి.
 
 జాగ్రఫీ విషయంలో తెలంగాణ ప్రాంతంపై శ్రద్ధ చూపాలి. ఈ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, పంటలు, రవాణా సౌకర్యాలు, రాష్ట్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, నీటి పారుదల వ్యవస్థ అంశాలు ముఖ్యమైనవి.ుంలో పంటలు- దిగుబడి, ఆర్థిక సర్వేలోని అంశాలన్నిటిపై దృష్టిసారించాలి. వర్తమాన వ్యవహారాలను అధ్యయనం చేయాలి. ధనల వరకు అన్ని విషయాలపై అవగాహన ఎంతో అవసరం.జనరల్ స్టడీస్‌పై పట్టు కోసం అభ్యర్థులు ముందుగా హైస్కూల్ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేసి, బేసిక్స్‌పై అవగాహన పెంపొందించుకోవాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోని పుస్తకాలను చదవడంతోపాటు, వాటిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. వీటితో పాటు కరెంట్ అఫైర్స్‌కోసం తెలంగాణ రాష్ర్ట మాసపత్రిక చదవడం ఎంతో ఉపకరిస్తుంది.
 
 ప్రిపరేషన్ ప్రారంభిస్తే మేలు
 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రధానంగా జనరల్ స్టడీస్ పేపర్‌పై ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆయా డిపార్ట్‌మెంట్‌లు సొంతగా చేపట్టే నియామక పరీక్షల ఔత్సాహికులకు సిలబస్ పరంగా ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ ఆందోళన మరింత ఎక్కువవుతోంది. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) గ్రూప్-2, గ్రూప్-3 కేడర్ పోస్టుల భర్తీకి ప్రకటించిన సిలబస్ మేరకే దాదాపు వీటి సిలబస్ కూడా ఉంటుంది. కాబట్టి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (పీఆర్‌బీ), ఇంజనీరింగ్ ఉద్యోగాల ఔత్సాహికులు ప్రస్తుతం గ్రూప్-2 స్థాయిలోని సిలబస్‌కు అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించడం మేలు’ అనేది నిపుణుల అభిప్రాయం.

మరిన్ని వార్తలు