పాలిష్ పట్టిన బియ్యంలో లోపించే విటమిన్?

9 Nov, 2016 23:46 IST|Sakshi
పాలిష్ పట్టిన బియ్యంలో లోపించే విటమిన్?

విటమిన్లను మొట్టమొదట ఫంక్ కనుగొన్నాడు.
     విటమిన్లు రెండు రకాలు అవి..
     1. కొవ్వులో కరిగే విటమిన్లు
     2. నీటిలో కరిగే విటమిన్లు
     ఎ, డి, ఇ, కె విటమిన్లు కొవ్వులో కరుగుతాయి. ఇవి కాలేయంలో నిల్వ ఉంటాయి.
     నీటిలో కరిగే బి, సి విటమిన్లు దేహంలో నిల్వ ఉండవు.
     విటమిన్ ఎ రసాయన నామం- రెటినాల్
     విటమిన్ ఎకు ఉన్న మరో పేరు యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్
     విటమిన్ ఎ కంటిలో ఉండే రొడాప్సిన్ అనే  వర్ణక పదార్థాన్ని సంశ్లేషణ చేయడానికి తోడ్పడుతుంది.
     మొక్కల్లో విటమిన్ అ.. ఛ కెరోటిన్ రూపంలో లభ్యమవుతుంది.
     కాలేయం ఛ కెరోటిన్‌ను విటమిన్ అగా మారుస్తుంది.
     విటమిన్ అ అధికంగా లభించే మొక్కలు..      ఆకుకూరలు, బొప్పాయి, మామిడి, మునగ, ఎర్రగుమ్మడి
     జంతువుల్లో విటమిన్ అ అధికంగా లభించేవి - పాలు, గుడ్లు, మాంసం, లివర్. ముఖ్యంగా షార్‌‌క లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్
  విటమిన్ అ లోపం వల్ల వచ్చే వ్యాధులు:
     - రేచీకటి (నైక్ట్టాలోపియా)
     - జిరాఫ్తాల్మియా (పొడికన్ను), కెరటో మలేసియా
     విటమిన్ అ కాలేయంలో నిల్వ ఉంటుంది
     రేచీకటి: దీన్నే నైక్ట్టాలోపియా అంటారు. దీని వల్ల కాంతి తక్కువగా ఉన్నప్పుడు సరిగ్గా కనిపించదు.
     జిరాఫ్తాల్మియా: కంటిలో కన్నీటిని స్రవించే లాక్రిమల్‌గ్రంథులు ఎండిపోతాయి. ఫలితంగా కను గుడ్లు పొడిగా మారతాయి.
     విటమిన్ అ ఎపిథీలియల్ కణాలను ఆరోగ్యం గా ఉంచుతుంది. అందువల్లే ఫేస్ క్రీముల్లో  విటమిన్ అను కూడా కలుపుతారు.
     విటమిన్ అ లోపం వల్ల చర్మం గరుకుగా మారుతుంది.
     విటమిన్ అ లోపం ప్రత్యుత్పత్తి వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.
     విటమిన్ డి రసాయన నామం- కాల్సీఫెరాల్
     విటమిన్ ఇ రసాయన నామం- టోకోఫెరాల్
     విటమిన్  కె రసాయన నామం
     - నాఫ్తోక్వినోన్ లేదా ఫిల్లోక్వినోన్
     విటమిన్  సి రసాయన నామం
     - ఆస్కార్బిక్ ఆమ్లం
     విటమిన్ బి1 రసాయన నామం    - థయమిన్
     విటమిన్  బి2 రసాయన నామం    - రిబోఫ్లేవిన్
     విటమిన్ బి3  రసాయన నామం
     - నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం
     విటమిన్ బి5  రసాయన నామం
     - పాంటోథెనిక్ ఆమ్లం
     విటమిన్ బి6  రసాయన నామం - పైరిడాక్సిన్
     విటమిన్ బి12  రసాయన నామం
     - సయనోకోబాలమిన్
     విటమిన్ బి7  రసాయన నామం     - బయోటిన్
     విటమిన్ బి9  రసాయన నామం
     - ఫోలిక్ ఆమ్లం
     విటమిన్ అకి ఉన్న మరొక పేరు
     - యాంటీ జిరాఫ్తాల్మిక్ విటమిన్
 
 విటమిన్లు - మారు పేర్లు
     విటమిన్ డి
     - సన్‌షైన్ విటమిన్, యాంటీ రికెట్స్ విటమిన్
     విటమిన్ ఇ
     - బ్యూటీ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్
     విటమిన్ కె     - కొయాగ్యులేషన్ విటమిన్,
     యాంటీ హేమరేజిక్ విటమిన్,
     యాంటీ బ్లీడింగ్ విటమిన్
     విటమిన్ బి1    - యాంటీ బెరిబెరి విటమిన్
     విటమిన్ బి2 (రిబోఫ్లేవిన్)
 - విటమిన్ జి, వోవో ఫ్లేవిన్ (ౌఠిౌ జ్చఠిజీ)
     విటమిన్ బి3 (నియాసిన్)
     - యాంటీ పెల్లాగ్రా విటమిన్
     విటమిన్ సి     - యాంటీ స్కర్వీ విటమిన్
      విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధులు:
     1. రికెట్స్ (ఎక్కువగా చిన్న పిల్లల్లో)
     2. ఆస్టియో మలేసియా (ఎక్కువగా యువతీ, యువకుల్లో)
     3. ఆస్టియోపీనియా (వృద్ధుల్లో కండరాలు, ఎముకలు బలహీనపడటం)
     విటమిన్ ఇ లోపం వల్ల వచ్చే సమస్యలు
     1. మగవారిలో వంధ్యత్వం కలిగి, శుక్ర కణాల ఉత్పాదన జరగదు.
     2. ఆడవారిలో గర్భస్రావాలు జరుగుతాయి.
     3. వంధ్యత్వం కలుగుతుంది.
     విటమిన్ కె: రక్తం త్వరగా గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ విటమిన్‌ను శస్త్ర చికిత్సకు ముందు రోగులకు ఇస్తారు.
     విటమిన్ కె లోపం వల్ల రక్తం గడ్డకట్టదు. దాంతో అధిక రక్తస్రావం జరుగుతుంది.
     విటమిన్ కె రక్త స్కంధనానికి తోడ్పడుతుంది.
     విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వీ
     విటమిన్ సి... వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
     వేడి చేస్తే విచ్ఛిన్నమయ్యే విటమిన్
     - విటమిన్ సి
     గాయాలు త్వరగా మానేందుకు సహాయపడే విటమిన్     - విటమిన్ సి
     ఉసిరి, జామకాయ, నిమ్మ, నారింజ వంటి పుల్లగా ఉండే ఫలాల్లో ఎక్కువగా ఉండేది
     - విటమిన్ సి
     రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్
     -విటమిన్ సి
     స్కర్వీ వ్యాధి లక్షణాలు:
     చిగుళ్లు వాచి రక్తం కారడం
 విటమిన్ బి1 (థయమిన్) లోపం వల్ల వచ్చే వ్యాధి    - బెరిబెరి
 విటమిన్ బి1 లోపం వల్ల పక్షుల్లో వచ్చే వ్యాధి     
     - పాలీన్యూరైటిస్
 బియ్యం పొట్టు తీయడం లేదా పాలిష్ చేయడం వల్ల కోల్పోయే విటమిన్     - థయమిన్
 తవుడులో అధికంగా ఉండే విటమిన్
 - థయమిన్
 చాలా రకాల ధాన్యాల్లో థయమిన్ పైపొరల్లోనే ఉంటుంది.
 మర పట్టినప్పుడు ఈ పొరలు పోతాయి. అందుకే తెల్లని పాలిష్ పట్టిన బియ్యంతో వండిన అన్నం తినే వాళ్లలో థయమిన్ లోపం ఏర్పడుతుంది. ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం తినే వాళ్లకు ఈ జబ్బులు రావు.
 థయమిన్ లోపం వల్ల గుండె సామాన్యంగా ఉండే సైజు కంటే పెద్దగా అవుతుంది. దీన్నే కార్డియో మెగాలి అంటారు. గుండె నీరసంగా కొట్టుకొని కాళ్లలో వాపు వస్తుంది.
 కాఫీలు, టీలు, వక్కపొడి, జర్దా ఎక్కువగా తీసుకుంటే మనం తీసుకొనే ఆహారంలో ఉన్న థయమిన్ శరీరంలోని కణాలకు అందదు. ఆయా పదార్థాల్లో ఉండే రసాయన పదార్థాలు థయమిన్‌ను పనికి రాకుండా చేస్తాయి.
 ఆల్కహాల్ ఎక్కువగా సేవించే వారిలో థయమిన్ లోపం ఉంటుంది.
 విటమిన్ బి2 (రిబోఫ్లేవిన్) పాలు, గుడ్లు, కాలేయం, ఆకుకూరల్లో లభిస్తుంది. ఈ విటమిన్ నోటిపూతను అరికడుతుంది.
 విటమిన్ బి7 (బయోటిన్)ను దీన్నే విటమిన్ హెచ్ అని కూడా అంటారు.   
 ఈ విటమిన్‌ను జుట్టు, గోర్లు బాగా పెరగడానికి డాక్టర్లు సిఫార్సు చేస్తారు. బయోటిన్‌ను పలు సౌందర్య ఉత్పత్తుల్లో వాడుతున్నారు.
 ఉడకబెట్టని పచ్చి గుడ్డును ఆహారంగా తీసుకునే వారిలో బయోటిన్ లోపం ఏర్పడుతుంది.
 బయోటిన్ లోపం వల్ల అలోపేసియా (జుట్టు ఊడిపోవడం) కలుగుతుంది. కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోవడం, గోర్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
 విటమిన్ బి12 లోపం వల్ల వచ్చే వ్యాధి
 - పెర్నీషియస్ అనీమియా
 ఫ్రీరాడికల్స్ ప్రభావం నుంచి రక్షించే విటమిన్     - విటమిన్ ఉ
 విటమిన్ ఉను శిశు జనన కారకం అంటారు.
 విటమిన్ ఉ-చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. క్రీడా సామర్థ్యాన్ని పెంచుతుంది.
 విటమిన్ డి అధికంగా ఉండే ఆహార పదార్థాలు: సార్ట్టైన్ చేపలు, పాలు, గుడ్లు, కాడ్‌లివర్ ఆయిల్, ట్యూనా చేపలు, పుట్ట గొడుగులు
 విటమిన్ ఉ అధికంగా లభించే ఆహార పదార్థాలు: బాదం, నువ్వులు, గుమ్మడి కాయ గింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు, వేరుశనగ, అవకాడో.
 విటమిన్ కె అధికంగా లభించే ఆహార పదార్థాలు: ఆకుకూరలు, క్యాబేజి, బ్రకోలి-పేగుల్లో ఉన్న  బ్యాక్టీరియా విటమిన్ కెను ఉత్పత్తి చేస్తుంది.
 విటమిన్ బి1 (థయమిన్)  అధికంగా లభించే పదార్థాలు: గోధుమ వంటి ధాన్యాలు, నువ్వు గింజలు, పాలు, మాంసం, వేరుశనగ గింజలు, చేపలు, గుడ్లు.
 విటమిన్ బి2 అధికంగా లభించే పదార్థాలు: పాలు, గుడ్లు, ఆకుకూరలు.
 విటమిన్ బి12 - సయనోకోబాలమిన్: ఆహార పదార్థాల్లో లభించదు. పేగుల్లోని బ్యాక్టీరియాలు దీన్ని సంశ్లేషణ చేసి శరీరానికి అందిస్తాయి.
 

మరిన్ని వార్తలు