నగర విద్యార్థికి కేంబ్రిడ్జి పురస్కారం

11 Sep, 2014 00:28 IST|Sakshi
నగర విద్యార్థికి కేంబ్రిడ్జి పురస్కారం

నగర విద్యార్థికి అవుట్ స్టాండింగ్ కేంబ్రిడ్జి లెర్నర్ అవార్డు లభించింది. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో చదువుతున్న వరుణ్ మాథుర్ జూన్ 2014 సిరీస్‌లో కేంబ్రిడ్జి నిర్వహించిన ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐజీసీఎస్‌ఈ) పరీక్షలో భారత్ నుంచి ప్రథమస్థాయిలో నిలిచాడు.  కేంబ్రిడ్జి.. ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్‌లో భాగంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు పరీక్ష నిర్వహిస్తుంది. దీనిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పురస్కారం అందజేస్తారు. వీరికి అంతర్జాతీయంగా గుర్తింపుతోపాటు కెరీర్‌కు అవసరమైన ప్రోత్సాహాన్ని కేంబ్రిడ్జి వర్సిటీ అందిస్తుంది. నగరానికే చెందిన మరో విద్యార్థి చాలుమూరి వెంక టనాగ రితిన్ నాయుడు రెండో స్థానంలో నిలిచాడు.
 

Read latest Education News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా