క్యాట్‌కు ప్రత్యామ్నాయాలు..

27 Dec, 2016 01:24 IST|Sakshi
క్యాట్‌కు ప్రత్యామ్నాయాలు..

దేశంలో ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంలు)లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష క్యాట్‌. దీనికి పోటీ లక్షల్లో ఉంటే అందుబాటులో ఉన్న సీట్లు 5 వేల లోపే. ఇందులోఅర్హత సాధించకుంటే నిరుత్సాహపడనవసరం లేదు. క్యాట్‌కు ప్రత్యామ్నాయంగా మరెన్నో మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి..

సీమ్యాట్‌
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ).. మేనేజ్‌మెంట్‌ కోర్సుల ఔత్సాహికుల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్ష కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌. ఇందులో ప్రతిభ చూపడం ద్వారా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ పీజీ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశించొచ్చు. పరీక్ష నాలుగు విభాగాలుగా ఉంటుంది. అవి.. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్‌ రీజనింగ్, లాంగ్వేజ్‌ కాంప్రెహెన్షన్, జనరల్‌ అవేర్‌నెస్‌. ప్రతి సెక్షన్‌ నుంచి 25 ప్రశ్నలు 400 మార్కులకు ఉంటాయి.
 వెబ్‌సైట్‌:  aicte-cmat.in


మ్యాట్‌
 ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా దేశంలో దాదాపు 500కు పైగా ప్రముఖ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో ప్రవేశించొచ్చు. దీన్ని ఏటా నాలుగుసార్లు నిర్వహిస్తారు. పరీక్ష ఐదు విభాగాల్లో ఉంటుంది. ప్రతి సెక్షన్‌ నుంచి 40 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి.
మ్యాట్‌ 2017 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: జనవరి 27, 2017.
 వెబ్‌సైట్‌:  www.aima.in


ఏటీఎంఏ
ఎయిమ్స్‌ టెస్ట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్స్‌ (ఏటీఎంఏ) పరీక్షలో ప్రతిభ చూపడం ద్వారా జాతీయ స్థాయిలో 200కు పైగా ప్రముఖ బి–స్కూల్స్‌లో ప్రవేశాలకు అర్హత లభిస్తుంది. అనలిటికల్‌ రీజనింగ్, వెర్బల్‌ స్కిల్స్, క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌లో పరీక్ష ఉంటుంది. ఒక్కో సబ్జెక్ట్‌కు సంబంధించి రెండు విభాగాలుగా 180 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.  ఏటా మూడుసార్లు పరీక్ష ఉంటుంది. ∙ఏటీఎంఏ – 2017 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఫిబ్రవరి 2, 2017. http://www.atmaaims.com/


ఐసెట్‌
ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌).. రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్ల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్వహించే పరీక్ష. ఇందులో ర్యాంకు ద్వారా యూనివర్సిటీ క్యాంపస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలు, రాష్ట్ర స్థాయిలో ఇతర ప్రముఖ బి–స్కూల్స్‌లో ప్రవేశించొచ్చు. 200 మార్కులకు, రెండు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. అనలిటికల్‌ ఎబిలిటీ, మ్యాథమెటికల్‌ ఎబిలిటీ, కమ్యూనికేషన్‌ ఎబిలిటీలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షకు ఏటా ఫిబ్రవరి/మార్చి నెలలో ప్రకటన వెలువడుతుంది.

ఎన్‌మ్యాట్‌
నర్సీమొంజీ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎన్‌మ్యాట్‌)లో బెస్ట్‌ స్కోర్‌/ ర్యాంకు ఆధారంగా నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు దేశంలోని మరో 150 వరకు బి–స్కూల్స్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం మూడు విభాగాల్లో (లాంగ్వేజ్‌ స్కిల్స్, క్వాంటిటేటివ్‌ స్కిల్స్, లాజికల్‌ రీజనింగ్‌),  రెండు గంటల వ్యవధిలో ఈ పరీక్ష ఉంటుంది.
వెబ్‌సైట్‌: www.nmat.org.in


వీటితోపాటు సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ – పుణె.. జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్ష సింబయాసిస్‌ నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ నిర్వహించే జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎక్స్‌ఏటీ) అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు