వార్తల్లో వనిత

8 Mar, 2017 04:09 IST|Sakshi

భారత మహిళలు

కిరణ్‌ బేడీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా 2016, మే 29న బాధ్యతలు స్వీకరించారు.  

నీతా అంబానీ: 2016, ఆగస్టులో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా ఎంపికయ్యారు. దీంతో ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు.

నజ్మా హెప్తుల్లా: కేంద్ర మంత్రిగా పనిచేసి 2016, ఆగస్టులో మణిపూర్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు.

జస్టిస్‌ మంజులా చెల్లూర్‌: 2016, ఆగస్టులో బాంబే హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌గా నియమితులయ్యారు.

శుభా ముద్గల్‌: ప్రముఖ గాయని శుభా ముద్గల్‌కు 2016కుగానూ రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావనా అవార్డు
లభించింది.

అనురాధా రాయ్‌: ‘స్లీపింగ్‌ ఆన్‌ జూపిటర్‌’ అనే పుస్తకానికి గానూ అనురాధారాయ్‌కి డీఎస్‌సీ ప్రైజ్‌ ఫర్‌ సౌత్‌ ఏషియన్‌ లిటరేచర్‌–2016 దక్కింది. ఆమె రచించిన ఇతర నవలలు.. ‘యాన్‌ అట్లాస్‌ ఆ‹ఫ్‌ ఇంపాజిబుల్‌ లాంగింగ్‌’, ‘ది ఫోల్డెడ్‌ ఎర్త్‌’.

అర్చనా రామసుందరం: తమిళనాడు కేడర్‌ ఐపీఎస్‌ అధికారిణి అర్చనా రామసుందరం 2016, ఫిబ్రవరి 1న సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. ఒక పారామిలటరీ బలగానికి చీఫ్‌గా నియమితులైన తొలి మహిళగా గుర్తింపు పొందారు.

మెహబూబా ముఫ్తీ: జమ్మూకశ్మీర్‌ తొలి మహిళా ముఖ్యమంత్రిగా 2016 ఏప్రిల్‌ 4న బాధ్యతలు స్వీకరించారు. ఈమె పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు.
ఠి ప్రియదర్శిని ఛటర్జీ: గువహటికి చెందిన ఈమె మిస్‌ ఇండియా–2016గా ఎంపికైంది.

మహాశ్వేతాదేవి: ప్రముఖ బెంగాలీ రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి 2016, జూలై 28న 91 ఏళ్ల వయసులో మరణించారు. ఆమెకు
1996లో జ్ఞాన్‌పీఠ్, 1997లో రామన్‌ మెగసెసే అవార్డు, 2006లో పద్మవిభూషణ్‌ లభించాయి.

ప్రియాంక చోప్రా: యునిసెఫ్‌ గ్లోబల్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా నియమితురాలైంది. అసోం రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రచారకర్తగా ప్రియాంక చోప్రాను

నియమించింది.
మాధురీ దీక్షిత్‌: తల్లిపాల విశిష్టతను తెలిపే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘మదర్స్‌ అబ్సల్యూట్‌ అఫెక్షన్‌ (మా) ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ నియమితులయ్యారు.

ఠి పి.వి.సింధు: 2016, ఆగస్టులో బ్రెజిల్‌లో రియో డి జనీరో నగరంలో జరిగిన వేసవి ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో రజత పతకం సాధించింది. దీంతో ఒలింపిక్‌ రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా పి.వి.సింధు గుర్తింపు పొందింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య 2016, డిసెంబర్‌లో ‘మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును పి.వి.సింధుకు ప్రదానం చేసింది. వైజాగ్‌ స్టీల్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.

ఠి సాక్షి మాలిక్‌: హరియాణాకు చెందిన సాక్షి మాలిక్‌ రియో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో 58 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈమెకు 2017లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఈమెను హరియాణా ప్రభుత్వం ‘బేటీ బచావ్, బేటీ పడావ్‌’ కార్యక్రమ ప్రచారకర్తగా, రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్‌ యూనివర్సిటీ రెజ్లింగ్‌ డైరెక్టర్‌గా నియమించింది.

ఠి దీపా కర్మాకర్‌: త్రిపురకు చెందిన దీపా కర్మాకర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారతీయ మహిళా జిమ్మాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల వాల్ట్‌ జిమ్నాస్టిక్స్‌లో రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. 2017లో పద్మశ్రీ అవార్డు లభించింది.

దీపా మాలిక్‌: పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ దీపా మాలిక్‌. 2016, సెప్టెంబర్‌లో రియో పారాలింపిక్స్‌లో షాట్‌పుట్‌లో రజత పతకం సాధించింది. ఈమెకు 2017లో పద్మశ్రీ పురస్కారం దక్కింది.

స్మృతి మంధన
    మహారాష్ట్రకు చెందిన మహిళా క్రికెటర్‌. 2016 ఐసీసీ ఉమెన్స్‌ టీం ఆఫ్‌ ది ఇయర్‌లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రికెటర్‌.

మరిన్ని వార్తలు