ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌కు మార్గదర్శకాలు

14 Sep, 2017 12:54 IST|Sakshi
ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌కు మార్గదర్శకాలు

ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌.. ఈ పదం ఇటీవల మన దేశంలో బాగా సాధారణ మైపోయింది. కొన్ని సమస్యాత్మక పరిస్థితుల్లో ప్రతికూల వార్తలు వ్యాపించకుండా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడమే ‘ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌’. కేంద్ర ప్రభుత్వం తొలిసారి దీనికి సంబంధించి మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. ప్రజా భద్రత లేదా ప్రజల అవసరాల రీత్యా టెలికాం సర్వీసుల తాత్కాలిక నిలిపివేత మార్గదర్శకాలు–2017 ప్రకారం..

  • జిల్లా కలెక్టర్లు, మేయర్లు వంటి స్థానిక నిర్ణయాధికారులు ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌కు ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం లేదు.
  • కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాత్రమే ఉత్తర్వులు జారీ చేయాలి.
  • అత్యవసరం అయితే కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి పొందిన సంయుక్త కార్యదర్శి, ఆ పైస్థాయి అధికారి మాత్రమే ఈ ఉత్తర్వులు ఇవ్వగలరు. అయితే వీటిని 24 గంటల్లోగా హోం శాఖ కార్యదర్శి తప్పకుండా సమీక్షించాలి.
  • రాష్ట్రస్థాయిలో అయితే సెక్రటరీ టు ది స్టేట్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ది హోం డిపార్ట్‌మెంట్‌ ఆదేశాలు జారీ చేయాలి. అత్యవసరంలో అయితే రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి పొందిన సంయుక్త కార్యదర్శి, ఆపై స్థాయి అధికారి మాత్రమే ఆర్డర్స్‌ ఇవ్వగలరు. వీటిని సైతం 24 గంటల్లో హోం శాఖ కార్యదర్శి తప్పకుండా సమీక్షించాలి.
  • ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ ఉత్తర్వులు ఎస్పీ స్థాయి పోలీసు అధికారికి మాత్రమే ఇవ్వాలి.

మరిన్ని వార్తలు