పాలిటెక్నిక్.. జాబ్ గ్యారెంటీ!!

4 May, 2016 01:35 IST|Sakshi
పాలిటెక్నిక్.. జాబ్ గ్యారెంటీ!!

తెలుగు రాష్ట్రాల్లో పాలిసెట్ పరీక్షలు ముగిశాయి. తెలంగాణలో ఫలితాలు వెలువడ్డాయి. త్వరలో ఏపీ పాలిసెట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ తర్వాత కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ తరుణంలో పాలిసెట్‌కు హాజరైన విద్యార్థులు ఇప్పటి నుంచే కోర్సుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి. అందుబాటులోని డిప్లొమా కోర్సులు.. వాటి ద్వారా లభించే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై దృష్టిసారించాలి. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కోర్సులపై స్పెషల్ ఫోకస్..
 
డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్లు, రైల్వేస్, భవన నిర్మాణం, సర్వేయింగ్, వాటర్ సప్లయ్ విభాగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు.
స్కిల్స్: విస్తృతమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం. బృంద నైపుణ్యాలు, పర్యవేక్షణ నైపుణ్యాలు ఉండాలి.
కెరీర్: సైట్ ఇంజనీర్‌గా మొదలై... ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, మేనేజర్లు, కంపెనీ జనరల్ మేనేజర్ స్థాయి వరకు ఎదగొచ్చు.
ఉన్నత విద్య: బీటెక్
 
 డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
వ్యవధి: మూడేళ్లు
కోర్సు: వర్‌‌కషాప్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెషిన్ డిజైన్ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు.
స్కిల్స్: మెకానికల్ ఇంజనీర్లు టూల్స్, ఇంజన్స్, మెషిన్స్ డిజైనింగ్ విభాగాల్లో పనిచేస్తారు. కాబట్టి డిజైన్ నాలెడ్జ్, డ్రాయింగ్‌పై పట్టుండాలి. టెక్నికల్ నాలెడ్జ్ చాలా అవసరం.క్యాడ్/క్యామ్ నేర్చుకోవడం లాభిస్తుంది.
ఉద్యోగాలెక్కడ: మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ట్రాన్స్‌పోర్ట్, యాన్సిలరీ యూనిట్స్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, ఆర్టీసీ.
ఉన్నత విద్య: బీటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ వంటి బ్రాంచ్‌లు)
కెరీర్: ట్రెయినీగా చేరి.. 5-6 ఏళ్లలో స్కిల్స్, ఉన్నత విద్యతో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు.
 
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ - కమ్యూనికేషన్
వ్యవధి: మూడేళ్లు
కోర్సు: ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, డిజైనింగ్, కమ్యూనికేషన్ మైక్రోప్రాసెసర్‌‌స అండ్ మైక్రో కంట్రోలర్, ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్‌‌స వంటి అంశాలను అధ్యయనం చేయాలి.
ఉన్నత విద్య: బీటెక్ (ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం ఇంజనీరింగ్)
స్కిల్స్: అధునాతన టెక్నాలజీపై మంచి అవగాహన ఉండాలి.
ఉద్యోగాలెక్కడ: కమ్యూనికేషన్ ఉత్పత్తుల సంస్థలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థలు.
కెరీర్: ట్రైనీ ఇంజనీర్‌గా కెరీర్ మొదలై... స్కిల్స్‌తో సర్వీస్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్, ప్రొడక్ట్ ఇంజనీర్, డిపార్ట్‌మెంట్ మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు.
 
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
వ్యవధి: మూడేళ్లు
కోర్సు: పవర్ జనరేషన్, పవర్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ మెషిన్‌‌స-వర్కింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ ఎస్టిమేషన్, యుటిలైజేషన్ అండ్ ట్రాక్షన్‌లను కోర్సులో భాగంగా అధ్యయనం చేస్తారు.
ఉద్యోగాలెక్కడ : జెన్‌కో, ట్రాన్స్‌కో వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు విద్యుత్ ఉపకరణ ఉత్పత్తి సంస్థల్లో అవకాశాలు.
స్కిల్స్: లాజికల్, అనలిటికల్ స్కిల్స్.
కెరీర్: జూనియర్ ఇంజనీర్ ట్రైనీగా మొదలై... అనుభవంతో జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు.
ఉన్నత విద్య: బీటెక్
 
డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్

వ్యవధి: మూడేళ్లు
కోర్సు: ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్, ప్రోగ్రామింగ్ ల్వాంగేజెస్ అండ్ సాఫ్ట్‌వేర్‌‌స, వెబ్ డిజైనింగ్, డెవలప్‌మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫర్ డిఫరెంట్ అప్లికేషన్‌‌సపై ప్రధానంగా దృష్టిసారిస్తారు.
ఉద్యోగాలెక్కడ: కంప్యూటర్ మెయింటెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సంస్థలు, కంప్యూటర్ ట్రైనింగ్ సంస్థలు.
స్కిల్స్: కంప్యూటర్ పట్ల ఇష్టంతోపాటు మ్యాథమెటిక్స్‌పై మంచి పట్టుండాలి. లాజికల్, అనలిటికల్ స్కిల్స్‌తోపాటు బృంద నైపుణ్యాలు చాలా అవసరం.
కెరీర్: జూనియర్ ప్రోగ్రామర్‌తో మొదలై... సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ స్థాయికి చేరుకోవచ్చు.
ఉన్నత విద్య: బీటెక్ (సీఎస్‌ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్,  ఐటీ బ్రాంచ్‌లు)
 
వెబ్ కౌన్సెలింగ్.. సీట్ల భర్తీ
పాలిసెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వెబ్ బేస్డ్ విధానంలో కౌన్సెలింగ్ (వెబ్ కౌన్సెలింగ్) ద్వారా సీట్ల భర్తీ చేస్తారు. ఈ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ తొమ్మిది దశల్లో ఉంటుంది. దీనికోసం అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్స్ (ఏపీ పాలిసెట్ విద్యార్థులు www.appolycet.nic.in టీఎస్ పాలిసెట్ విద్యార్థులు www.polycetts.nic.in) ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాలి.
 
నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరం
పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులు ఉన్నత విద్యను కోరుకుంటే.. నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించే అవకాశముంది. ఇందుకోసం ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్)లో ఉత్తీర్ణత సాధించాలి. బీటెక్ తర్వాత తమ బ్రాంచ్‌ల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్లలో ఎంటెక్, ఎంఈ కోర్సులు చేయొచ్చు.
 
ఏపీ పాలిసెట్ ఫలితాలు త్వరలో..
ఏపీ పాలిసెట్ ఫలితాలను త్వరలో ప్రకటిస్తాం. పాలిటెక్నిక్ ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా అందుబాటులో ఉన్న కోర్సులపై అవగాహన పెంపొందించుకోవాలి. తమకు ఇష్టమైన బ్రాంచ్ ఎంపికపై స్పష్టతకు రావాలి. కౌన్సెలింగ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ వ్యవధిలో కోర్సులపై అవగాహన, కళాశాలల నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవడంపై దృష్టిసారిస్తే వెబ్ కౌన్సెలింగ్ సమయంలో మంచి కోర్సు, కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. పలు జాబ్ ఓరియెంటెడ్ ఆధునిక డిప్లొమా కోర్సులు (ఉదాహరణకు ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ వంటివి) కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిపైనా దృష్టిసారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.
- ఎ.నిర్మల్ కుమార్ ప్రియ, జాయింట్ సెక్రటరీ, ఎస్‌బీటీఈటీ-ఏపీ
 
గత ఏడాది కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం.. కొన్ని ముఖ్య బ్రాంచ్‌ల్లో తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న బ్రాంచ్‌లు, సీట్ల వివరాలు..మరికొన్ని కోర్సులు..

ఆటోమొబైల్ ఇంజనీరింగ్
వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ : ఆర్‌టీసీ, ట్రాన్స్‌పోర్ట్ సంస్థలు, ఆటోమొబైల్ పరిశ్రమలు.
ఉన్నత విద్య: బీటెక్ (ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్)
 
అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్  
వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: ఉత్పత్తి సంస్థలు, ఎలక్ట్రానిక్స్ సంస్థలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, ఎలక్ట్రికల్ ఉపకరణాల ఉత్పత్తి సంస్థలు.
ఉన్నత విద్య: బీటెక్ (అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ బ్రాంచ్‌లు)

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సంస్థలు, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ సంస్థల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు.
ఉన్నత విద్య: బీటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
 
మైనింగ్ ఇంజనీరింగ్
వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: మైనింగ్ సంస్థలు, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్ సంస్థల్లో సూపర్‌వైజర్ స్థాయిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో ఉద్యోగాలు.
ఉన్నత విద్య: బీటెక్ (మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్ మెషీనరీ ఇంజనీరింగ్)
 
మూడున్నరేళ్ల కోర్సులివే: డిప్లొమా ఇన్ మెట్లర్జికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సిరామిక్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ లెదర్ టెక్నాలజీ.
 
స్పెషలైజ్డ్ కోర్సులు: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రస్తుతం పలు స్పెషలైజ్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. లెదర్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ.

మరిన్ని వార్తలు