ఉద్యోగాలు

9 Jul, 2014 22:15 IST|Sakshi

 ఎన్‌ఐఆర్డీ
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఆర్డీ) హైదరాబాద్, కాంట్రాక్ట్ పద్ధతిన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టులు:కన్సల్టెంట్(సోషల్ ఆడిట్)
 అర్హతలు: సోషల్ సెన్సైస్‌లో పీజీ లేదా సివిల్/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో కనీసం మూడు నుంచి ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్, హిందీలో పరిజ్ఞానం ఉండాలి.
 వయసు: 60 ఏళ్లకు మించకూడదు.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21
 www.nird.org.in

 బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్
 బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జనరల్ మేనేజర్
 అర్హతలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 50 ఏళ్లకు మించకూడదు.
www.becil.com

 డిప్యూటీ జనరల్ మేనేజర్
 అర్హతలు: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 15
 
 అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్
 అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టులు
 1.డెరైక్టర్
 2.డిప్యూటీ డెరైక్టర్ జనరల్
 3.అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్
 4.జోనల్ ప్రాజెక్ట్ డెరైక్టర్
 5.జాయింట్ డెరైక్టర్
 6.ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్
 7.హెడ్ ఆఫ్ డివిజన్/ఈక్వలెంట్
 అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 18
 వెబ్‌సైట్: http://asrb.org.in/
 
 హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
 హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్   (హెచ్‌ఏఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టులు
 1.ఇంజనీర్(సివిల్-గ్రేడ్ 2)
 2.అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రేడ్ 1)
 అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:
 ఆగస్టు 9
 వెబ్‌సైట్: www.hal-india.com

మరిన్ని వార్తలు